సందేశాల కోసం సినిమా చేయలేదు.. ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికే ఈ సినిమా తీసాం అంటున్నాడు శ్రీ సింహ కోడూరి. జులై 7 న రిలీజ్‌ కాబోతున్నా భాగ్‌ సాలే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సింహ కోడూరి పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. నేచురాలిటీ కోసం జనాల్లోనే షూట్ చేసాం. ఆ టైమ్‌లో చాలా సమస్యలొచ్చాయి. జనాలు కెమెరాల వైపు చూసేవారు.. ఎక్కువ టేక్స్ తీసుకున్నా చాలా నేచురల్‌గా వచ్చిందన్నారు సింహ. అలాగే రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌ గా పనిచేయడం వల్ల ఎంతో అనుభవం వచ్చింది.. ఆ టైమ్‌లో చేసిన అబ్జర్వేషన్‌ ఈ సినిమాకి చాలా ఉపయోగపడిందన్నారు.
కొత్త డైరెక్టర్లతో చేసినా.. పెద్ద బ్యానర్లలో చేసానన్నారు. పెద్ద డైరెక్టర్లతో చేయాలనుంటుంది.. రాజమౌళి గారితో చనువు ఉంది కదా అని చాన్స్ అడగలేను.. ఆయన స్టోరీకి నేను ఉపయోగపడతాననుకుంటే ఆయనే తీసుకుంటారు.. నా అన్న కాల భైరవ తో కలిసి సినిమా చేస్తాననుకోలేదు.. వాస్తవానికి భాగ్‌సాలే సినిమా కోసం కాలభైరవనే సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత నా సెలక్షన్‌ జరిగిందని చెప్పుకొచ్చాడు శ్రీసింహ.
ఈ సినిమా కరోనా టైమ్‌లో విన్నాను. అదే టైమ్‌లో ఉస్తాద్‌, దొంగలున్నారు జాగ్రత్త కూడా ఉండటంతో ఈ సినిమా లేట్ అయ్యింది. ఈ సినిమా అయ్యాక చాలా షోలు వేసాం.. అందరూ నవ్వుకుంటూ హాయిగా బయటకొచ్చారు. ఈ సినిమా కోసం డైరెక్టర్‌ ప్రణీత్‌ 15 వెర్షన్స్ రెడీ చేసుకుని బెటర్‌మెంట్ వెర్షన్‌ ఔట్‌పుట్ ఇచ్చాడు.
ఒక సినిమా జనాలకు ఎందుకు నచ్చుతుంది ఎందుకు నచ్చడం లేదు అనేది చెప్పలేం. ఈ సినిమా మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చే కాన్సెప్ట్‌.. నచ్చేలా తీసాడు డైరెక్టర్‌ ప్రణీత్ అన్నాడు శ్రీ సింహ. ఈ సినిమాకు మెయిన్‌ పిల్లర్‌ మ్యూజిక్‌. కాలభైరవ ఇచ్చిన ఆర్‌ ఆర్‌ సినిమాను నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లిందన్నారు.
ఈ సినిమాలో నేహా సోలంకి కథానాయిక. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాతగా.. బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే రిలీజ్‌కు రెడీ అయ్యింది.

Leave a comment

error: Content is protected !!