అభయ్ ప్రొడక్షన్స్‌లో తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషల్లో రూపొందిన ఆల్బమ్ సాంగ్ ‘ఊహలో తేలాల’. ధనుంజయ్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ ఆల్బమ్ సాంగ్‌ను సంగీత దర్శకులు కోటి, ఆర్పీ పట్నాయక్ కలిసి ఆవిష్కరించారు. ఈ సాంగ్ లాంఛ్ వేడుకకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ CEO రవణం స్వామి నాయుడు, రచయిత లక్ష్మీ భూపాల, సీనియర్ జర్నలిస్ట్స్ ప్రభు, సుబ్బారావు వంటి వారంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అభయ్ ప్రొడక్షన్స్ అధినేత ధనుంజయ్ మాట్లాడుతూ: ‘ఊహలో తేలాల’ ఆల్బమ్‌లోని పాటలు మనసుకు హత్తుకునేలా చిత్రీకరించడం జరిగింది. డైరెక్టర్ ఫణి గణేష్ అద్భుతంగా ఈ పాటని చిత్రీకరించారు. ప్రముఖ నేపథ్య గాయకులు కారుణ్య, చిన్మయి, యాసిన్ నజీర్ వంటి ప్లే బ్యాక్ సింగర్స్ ఆలపించిన ఆల్బమ్ ఇది. అలాగే ఇందులో నటించిన నటి నటులు ఎంతో అద్భుతంగా చేసారు.

Leave a comment

error: Content is protected !!