సామాన్యుడు సినిమా హీరో కావాలనుకోవడం అత్యాశ కాదు.. అతనికి ఓ కల. కానీ అది సాకారం చేసుకునే ప్రక్రియలో సినిమా కష్టాలెన్నింటినో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది చాలు కదా ఓ సినిమా కథకు మెటీరియల్‌. ఇప్పుడిదే కాన్సెప్ట్‌తో ఓ కల సినిమా రెడీ అయ్యింది. ఈసినిమా ట్రైలర్‌ ను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు లాంచ్ చేసారు. ట్రైలర్‌ బాగా కట్‌ చేసారని మెచ్చుకుంటూ టీమ్‌ కు ఆల్‌ది బెస్ట్ చెప్పారు. ఓ కల చిత్రానికి మొదట్నుంచి సినీ పెద్దల ఆశీస్సులు బాగానే అందుతున్నాయి. ఇది సినిమాకు పాజిటివ్‌ వైబ్రేషనే. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ను దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి లాంచ్ చేయడం ఈ చిత్రానికి ప్లస్‌పాయింట్. ఎటిర్నిటి ఎంటర్‪టైన్‪మెంట్, అహం అస్మి ఫిల్మ్స్ బ్యానర్లపై గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్ హీరోహీరోయిన్లుగా దీపక్ కొలిపాక దర్శకత్వంలో లక్ష్మీ నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడాలి, అదిత్య రెడ్డి నిర్మించారు. ఏప్రిల్ 13 నుంచి ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదల కాబోతోంది.

Leave a comment

error: Content is protected !!