టైటిల్‌లో పవర్‌ ఉంటే ఆటోమేటిక్‌ గా ఆడియెన్స్‌లో ఇంట్రస్ట్‌ క్రియేట్ అవుతుంది. అది మెగా ఫ్యామిలీ మూవీస్‌తో సంబంధం ఉంటే ఆ క్రేజే వేరు.. ఇక అల్లు అరవింద్‌ ఆశీస్సులు తోడైతే సినిమా నిర్మాణం రిలీజ్‌ సాఫీగా సాగిపోతుంది. అలాంటి ఓ సినిమా ఈరోజు ప్రారంభమైంది. ఆ మూవీ టైటిల్‌ ‘మెగా పవర్‌’. శ్రీ సత్య ఆర్ట్స్‌ బ్యానర్‌లో ప్రొడక్షన్‌ నెం 1 గా అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. గేదెల రవిచంద్ర డైరెక్షన్‌లో అడబాల నాగబాబు, సాయి నిర్మల, ఇల్లా అభిషేక్‌, సత్యమూర్తి గేదెల నిర్మిస్తున్నారు. శ్రీ కళ్యాణ్‌, శశి జంటగా నటిస్తున్న ఈ మూవీని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ ఆశీస్సులతో ప్రారంభించారు. పూజా కార్యక్రమాల తర్వాత తొలిషాట్‌కు రఘుబాబు క్లాప్‌ ఇవ్వగా కిరణ్ అబ్బవరం కెమెరా స్విచ్చాన్‌ చేయగా పృథ్విరాజ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఈ చిత్ర టైటిల్‌ ని రిలీజ్‌ చేసారు.
పృథ్వీ, రఘుబాబు, మురళీశర్మ, రచ్చ రవి, రియాజ్‌, రెహమాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగర్‌, సురేష్‌, సంగీత, ప్రభావతి వర్మ, కౌశల్య ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Leave a comment

error: Content is protected !!