మూవీ టైటిల్: దాస్ కా ధమ్కీ
నటీనటులు: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, తరుణ్ భాస్కర్, అక్షరా గౌడ, ‘హైపర్’ ఆది, ‘రంగస్థలం’ మహేష్, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు
ఛాయాగ్రహణం : దినేష్ కె బాబు
సంగీతం : లియోన్ జేమ్స్
కథ: ప్రసన్నకుమార్ బెజవాడ
నిర్మాత : కరాటే రాజు
స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : విశ్వక్ సేన్
విడుదల తేదీ: మార్చి 22, 2022
డైనమిక్ ‘హీరో విశ్వక్ సేన్’ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జతగా రెండో సారి ‘నివేదా పేతురాజ్’ నటిస్తోంది. ‘విశ్వక్ సేన్’ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత బాధ్యతలు వహిస్తున్నారు. ఇప్పటికే, విడుదల చేసిన పాటలు చార్ట్‌బస్టర్ గా నిలిచాయి, ముఖ్యంగా ఆల్మోస్ట్ పడిపోయానే పిల్లా 12మిలియన్స్ కి చేరుకుంది. ఇటివలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ 2.0, ప్రీ రీలిజ్ కి జూనియర్ ఎన్టీయార్ రావడం ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఉగాది సందర్భంగా రీలిజ్ అయ్యిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం?
కథ: ‘కృష్ణదాస్'(విశ్వక్ సేన్) అనాథ. ఆది, మహేష్ ఇద్దరితో కలిసి చిన్నప్పటి నుంచి పెరగడంతో పాటు ఓ ‘స్టార్ హోటల్’లో కలిసి పనిచేస్తారు. ఒక రోజు హోటల్‌కు వచ్చిన ‘కీర్తీ'(నివేదా పేతురాజ్)తో ప్రేమలో పడి వెయిటర్ అనే విషయం దాస్తాడు. ‘ఎస్ ఆర్ ఫార్మా కంపెనీ’కి సీఈవో అని చెప్పగా, ఒక రోజు నిజం తెలుస్తుంది. ఆ కారణంగా ‘ఉద్యోగం’ పోవడం, రెంట్ కట్టకపోవడంతో ‘హౌస్ ఓనర్’ గెంటేస్తాడు. ఆ సమయంలో ‘సిద్ధార్థ్ మల్హోత్రా'(రావు రమేష్) వచ్చి, తన అన్నయ్య కుమారుడు సంజయ్ రుద్ర(విశ్వక్ సేన్) ఒక ‘డ్రగ్’ రీసెర్చ్ మధ్యలో చనిపోయాడని చెబుతాడు. సిద్ధార్థ్ మల్హోత్రా ద్వారా ‘సంజయ్’ స్థానంలో కి వచ్చిన ‘కృష్ణదాస్’ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? సంజయ్ ఎలా చనిపోయాడు? అసలు, ఆ డ్రగ్ రీసెర్చ్ కంప్లీట్ అయ్యిందా? అసలు ఆ డ్రగ్ ఏంటి? అనేది వెండితెరపై చూడాలి.
కథ, విశ్లేషణ:
‘దాస్ కా ధమ్కీ’ విడుదలకు ముందు టీమ్ సభ్యులు పాత కధే కానీ, కొత్తగా చెప్పడానికి ట్రై చేసాం అంటు చెప్పుకొచ్చారు. అది నిజమే కాకపోతే, సినిమా చూసాక ఆ కొత్తదనం కూడా మిస్ అయ్యిందనిపిస్తుంటుంది.
సినిమా ఓపినింగ్ లో క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ, దునియా లో ‘డబ్బు’ లేకపోతే ఒక సగటు మనిషి ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుందో కళ్ల గట్టినట్టు చూపించాడు. కాకపోతే, మొదట్లో ‘సీన్స్’ అన్ని కాస్త బోరింగ్ అనిపిస్తాయి. ఎప్పుడైతే ‘నివేతా పేతురాజ్’ ఎంటర్ అవ్వుతుందో కాస్త ఎంగేజింగ్ గా ఉంటుంది. ఈ సినిమాలో మునుపెన్నడు చూడని విధంగా ‘నివేతా’ ని చూసి సగటు ప్రేక్షకుడు ఫిదా అవ్వాలిసిందే. అక్కడక్కడ వచ్చే ‘ఆది’ పంచ్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. రంగస్థలం మహేష్ స్క్రీన్ మీద ప్రాస బాగా వర్కౌట్ అయ్యింది. కథ పాతదే కావచ్చు, కాకపోతే ‘సీన్స్’ లో క్యూరియాసిటీ ఉండి ఉంటె నెస్ట్ లెవెల్ సినిమా. అటువంటి క్యూరియాసిటీ కలిగించే సీన్స్ ‘దాస్ కా ధమ్కీ’లో లేకపోవడం కాస్త మైనస్ అని చెప్పచ్చు. సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ గా కనిపించిన ‘తరుణ్ భాస్కర్’ రోల్ ఇన్ కంప్లీట్ గా ఉండటం, అక్కడక్కడ కొన్నిటికీ లాజిక్స్ లేకపోవడం. ‘విశ్వక్’ ఒక దర్శకుడిగా, టెక్నికల్ టీమ్ నుంచి మంచి అవుట్ పుట్ తీసుకున్నారు. ‘స్క్రీన్ ప్లే’ మీద కాస్త గ్రిప్పింగ్ గా రాసుకొని ఉంటె ఇంకా బావుండేది.
ఈ సినిమాకి మొదటి నుంచి ప్రేక్షకులని థియేటర్ కి రప్పించగలిగింది ‘లియోన్ జేమ్స్’ అందించిన మ్యూజిక్. ‘పూర్ణాచారి’ రాసిన పాటలు పెప్పీగా ఉన్నాయి. అందుకే, కాబోలు లిరిసిస్ట్ ‘పూర్ణాచారి’ని ‘ధమ్కీ’ టీజర్ లాంచ్ రోజు ‘నందమూరి బాలకృష్ణ’ తెగ పోగేడేసాడు. రామ్ మిరియాల సంగీతం అందించిన ‘మావా బ్రో’ పెద్దగా పేలలేదు.
నటీనటులు పెర్ఫామెన్స్: హీరోగా ‘విశ్వక్ సేన్’ రెండు పాత్రల మధ్య వేరియేషన్ చూపించిన విధానం బాగుంది. ముఖ్యంగా, నెగిటివ్ షెడ్స్ పాత్రలో ఇంబాలెన్స్డ్ సైకో గా చేసిన తీరు అద్భుతం. ‘నివేదా పేతురాజ్’ నటన తో పాటు గ్లామర్ డోస్ మరింత పెంచడంతో కుర్ర కారులు ఫిదా అయ్యారు. ‘రావు రమేష్’ పాత్రలో వేరియేషన్స్ చూపించే స్కోప్ ఉన్న రెగ్యులర్ అయ్యిపోయింది. ‘హైపర్’ ఆది, ‘రంగస్థలం’ మహేష్ తమ పాత్రలు సినిమాకి హైలైట్. తరుణ్ భాస్కర్ ఈ సినిమాకి ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. అక్షరా గౌడ స్క్రీన్ మీద తక్కువగా కనిపించిన ప్రేక్షకులని బాగా ఎట్ట్రాక్ట్ చేసింది. అజయ్, రోహిణి, పృథ్వీరాజ్, రజత తదితరులకు పెద్దగా నటించే అవకాశం లభించలేదు.
సాంకేతిక విభాగం: ‘విశ్వక్’ ఒక దర్శకుడిగా అలాగే టెక్నికల్ గా సక్సెస్ అయ్యాడు. కాకపోతే, ‘స్క్రీన్ ప్లే’ మీద కాస్త గ్రిప్పింగ్ గా రాసుకొని ఉంటె ఇంకా బావుండేది. రైటర్ ప్రసన్నకి కథను అటు ఇటు తిప్పి కథ తీశారు తప్ప కొత్త గా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు.’లియోన్ జేమ్స్’ అందించిన మ్యూజిక్ హార్ట్ & సోల్. దినేష్ కె బాబు అందించిన విజ్యువల్స్ సింప్లీ సూపర్బ్. ఈ సినిమాలో మరో ఎడ్వాంటేజ్ క్యాస్ట్ ధరించిన కాస్ట్యూమ్స్ అదుర్స్. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్ గా ఉండటంతో పాటు విశ్వక్ సేన్ తండ్రి ‘కరాటే’ రాజు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అనిపిస్తుంది.
రేటింగ్ : 2.5/5
బాటమ్ లైన్: ఇంబాలెన్స్డ్ సైకో గా ఆకట్టుకున్న ‘దాస్ కా ధమ్కీ’
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్