‘దేవరాజ్’ తనయుడు ‘ప్రణం దేవరాజ్’ హీరోగా, సాయి శివం జంపాన దర్శకత్వంలో జె.మల్లికార్జున నిర్మిస్తున్న చిత్రం “వైరం”. హీరోయిన్ మోనల్, విన్ను మద్ది పాటి, గరుడ రామ్, కాశీ విశ్వనాధ్, శత్రు, చమ్మక్ చంద్ర, భద్రం తదితరులు నటించారు. యువాన్స్ నాయుడు సమర్పణలో సంస్కృతి ప్రొడక్షన్స్, శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి పిక్చర్, సర్తాక్ పిక్చర్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు దేవరాజ్, చంద్ర దేవ రాజ్ ల చేతుల మీదుగా శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి బ్యానర్ లోగోను లాంచ్ చేసారు. అలాగే, బెనర్జీ, కాశీ విశ్వనాధ్ చేతుల మీదుగా వైరం టీజర్ విడుదల చేయడం విశేషం.

‘ప్రణం దేవరాజ్’ హీరోగా తెలుగు, కన్నడ బై లింగ్వేల్ లో రీలిజ్ అవ్వుతున్న ఈ చిత్ర టీజర్ తెలుగు, కన్నడలో మంచి రెస్పాన్స్ వస్తుంది. మొదటి సినిమాతోనే హీరో గా చక్కటి పెర్ఫామెన్స్ తో ఆకట్టుకోబుతున్నాడు. ‘వైరం’ హై ఓల్టేజ్ పవర్ ఉన్న సినిమా. సీనియర్ నటుడు దేవరాజ్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిన KGF విలన్ ‘గరుడ రామ్’ ఈ సినిమా లో యాక్ట్ చేయడం పెద్ద అసెట్. ఈ సినిమాలో సామల భాస్కర్ అందించిన విజ్యువల్స్ హైలైట్ గా నిలవనుంది. అరిపిరాల కళ్యాణ్ శాస్త్రి, శీలం త్రివిక్రమ్ రావు, టెక్నీషియన్స్ ప్రొడక్షన్ కి సపోర్ట్ గా నిలిచారు. అలాగే, సగటు ప్రేక్షకుడుకి మంచి సినిమా అందించాలనే ఉద్దేశం దర్శకుడు ‘సాయి’లో కనిపిస్తుంది. ఆశలమధ్య అవకాశాల మధ్య పట్టువదలని విక్రమార్కుడు లా ఈ సినిమా నెలబెట్టడానికి టీమ్ ఎంతో కృషి చేసింది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అనే గట్టి నమ్మకంతో చిత్ర నిర్మాతలు మరియు బెనర్జీ, కాశీ విశ్వనాధ్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నటీ నటులు
ప్రణం దేవరాజ్, విన్ను మద్ది పాటి, మోనల్,, గరుడ రామ్, కాశీ విశ్వనాధ్, శత్రు, చమ్మక్ చంద్ర, భద్రం తదితరులు…

సాంకేతిక నిపుణులు
నిర్మాత : జె.మల్లికార్జున
డైరెక్టర్ : సాయి శివన్ జంపాన
కో ప్రొడ్యూసర్స్ : అరిపిరాల కళ్యాణ్ శాస్త్రి, శీలం త్రివిక్రమ్ రావు
మ్యూజిక్ : మహతి స్వర సాగర్
డి ఓపి : సామల భాస్కర్
ఎడిటర్ : అజయ్ యం.కుమార్
కొరియోగ్రాఫర్ : శిరీష్,భూషణ్ మురళి
స్టంట్స్ : మాస్ మధ, రాం సుంకర, లయన్ జి.
ఆర్ట్ : రవి కుమార్ ఎం
పి ఆర్ ఓ : హర్ష

Leave a comment

error: Content is protected !!