మార్కెట్లోకి కొత్తగా లాంచ్ అవుతున్న యంగ్ హీరో మీద ఖర్చుకు వెనకాడకుండా టెక్నికల్‌గా గ్రాండ్ అప్పీయరెన్స్ కోసం ప్రయత్నించడం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. ఆ హీరో ప్రొడ్యూసర్ కొడకైనా సరే.. సినిమా పట్ల నమ్మకం లేకపోతే కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టే ధైర్యం చేయరు. అలా కాంప్రమైజ్ కాకుండా చేయడం ఒక రకంగా సాహసమనే చెప్పాలి. అలాంటి సాహసమే చేశారు పరారీ మూవీ ప్రొడ్యూసర్స్. సాయిశివాజీ డైరెక్షన్లో శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్లో గాలి ప్రత్యూష సమర్పణలో మహిత్ నారాయణ్ మ్యూజిక్ డైరెక్షన్లో జివివి గిరి నిర్మించిన చిత్రమే ‘పరారీ’. యోగీశ్వర్ అనే కొత్త కుర్రాడు హీరోగా లాంచ్ అవుతున్నాడు. అతిధి ఫీమేల్ లీడ్ చేసింది. సీనియర్ నటుడు సుమన్ కీలక పాత్ర పోషించిన పరారీ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
ఈ ట్రైలర్ రిలీజ్ ను సాధారణ ప్రెస్‌మీట్‌లా కాకుండా… రాజకీయ ప్రముఖుల సమక్షంలో సినీ పెద్దల సాక్షిగా… ఈ చిత్ర హీరో యోగీశ్వర్ బర్త్‌డే సెలబ్రేషన్‌తో పాటు ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్‌తో కలిపి ఓ గ్రాండ్ సెలబ్రేషన్ చేసారు. ఇది నిజంగా విశేషమే. ఈ పరారీ చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌కి ముఖ్య అతిదులుగా పొలిటిషన్స్ వి హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, రవతు కనకయ్య,గాలి అనిల్‌కుమార్, సుప్రీంకోర్ట్ రిటైర్డ్ జడ్జి శ్రీ మాల్యాద్రి గార్లు హాజరయి చిత్ర యూనిట్‌ను ఆశీర్వదించారు. దర్శకులు చంద్రమహేష్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రతాని రామకృష్ణ గౌడ్, ప్రసన్నకుమార్లాంటి సినీ పెద్దల ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర విజయాన్ని కాంక్షించారు. నటులు సుమన్, పొలిటిషియన్ అంజన్‌కుమార్ యాదవ్, సినీ ప్రముఖులు ప్రసన్నకుమార్‌లు ధియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేయగా.. నటి కవిత సాంగ్ ప్రోమోను లాంచ్ చేసారు. ఇదే వేడుకలో చిత్ర హీరో యోగేశ్వర్ బర్త్ డే సెలెబ్రేషన్ గ్రాండ్ గా జరిపి కేక్ కట్ కట్ చేశారు. ఆ తర్వాత జరిగిన ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్ లో వచ్చిన అతిథులు ఆహ్వానితులు సినిమా క్వాలిటీని, టెక్నికల్ వేల్యూస్‌ని మెచ్చుకుంటూ.. చిత్ర విజయాన్ని కాంక్షిస్తూ మేకర్స్‌కి అభినందనలు తెలియజేసారు. మార్చి 30 న పరారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.
నటీ నటులు :
యోగిశ్వర్, అతిధి, సుమన్, భూపాల్, శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు
సాంకేతిక నిపుణులు :
నిర్మాత: జి వి వి గిరి,
దర్శకత్వం: సాయి శివాజీ
సంగీతం మహిత్ నారాయణ్,
లిరిక్ రైటర్స్: రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సినిమాటోగ్రఫీ; గరుడ వేగా అంజి,
ఎడిటర్ గౌతమ్ రాజు,
ఆర్ట్స్; ఆనంద్, కోటి అబలయ్,
యాక్షన్ :నందు,
కొరియోగ్రఫీ: జానీ, భాను,