గమ్యాన్ని చేరుకునేందుకు రెండే రెండు మార్గాలు.. ఒకటి శక్తి , రెండు పట్టుదల.. వారసత్వం ఉంటే తప్ప సిల్వర్‌స్క్రీన్‌పై ఛాన్స్ అంత ఈజీ కాకపోతున్న ఈ తరుణంలో మదనపల్లిలో సెటిలయిన ఓ కడప కుర్రాడు హీరో కావాలన్న పట్టుదలతో శక్తివంచనలేకుండా కృషి చేసి ఓ సామాన్యుడు వెండితెరపై హీరోగా అవతరించాడు. అతడే ఆసిఫ్‌ఖాన్. రీసెంట్ గా విడుదలయిన నేడే విడుదల తో కత్తిలాంటి కుర్రాడు ఇండస్ట్రీకి దొరికాడు అనిపించుకున్నాడు ఆసిఫ్‌ఖాన్. ఆసిఫ్ ఖాన్‌కు అభిమాన హీరోగా విక్టరీ వెంకటేష్ సినిమాల పట్ల ఆసక్తిని కలిగిస్తే.. పోకిరి సినిమాలో మహేష్ లుక్స్ హీరో కావాలన్న ఇన్స్పిరేషన్ కలిగించాయి.
సినిమా హీరో కావాలన్న లక్ష్యంతో మదనపల్లిలో చేసే ఇంజనీరింగ్ స్టడీని హైదరాబాద్‌కు షిఫ్ట్ చేసి ఓవైపు చదువుకుంటూనే ఫిలింనగర్ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాడు. కానీ ప్రయత్నాలు ఫలించలేదు. సినీ ప్రయత్నాలకు కామా పెట్టి ఎంఎస్ కోసం అమెరికా వెళ్లాడు. ఎంఎస్ చేస్తూనే వాషింగ్టన్లో ప్రఖ్యాత ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి ఫిల్మ్ మేకింగ్ లో డిప్లొమా చేసాడు. ఓ వైపు జాబ్ చేసుకుంటూనే అక్కడ సినీ ప్రయత్నాలు ప్రారంభించాడు. పట్టుదలతో అలా చేసిన ప్రయత్నం వృధా పోలేదు. ఆసిఫ్‌కు హీరోగా నేడే విడుదల తొలి అడుగు అయ్యంది.
2023 మార్చి 10 న రిలీజయన నేడే విడుదల చిత్రం లో ఆసిఫ్ ఖాన్ కు మంచి మార్కులు పడ్డాయి. ఎవరా కుర్రాడు లుక్స్ బావున్నాయి, యాక్టింగ్ బాగుంది, డాన్సులు, ఫైట్స్ ఇరగదీస్తున్నాడు అని ఇండస్ట్రీ వర్గాలు ఆరా తీసే స్థాయిలో నేడే విడుదల ఆసిఫ్‌కు మంచి పునాధి వేసింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉండగానే 919 అనే చిత్ర అవకాశం వచ్చింది. “919”తో శాండీ సాయి అనే ఓ డైనమిక్ ఎన్నారై వనిత దర్శకనిర్మాతగా పరిచయం అవుతుండటం విశేషం. చూడగానే కట్టి పడేసే స్ఫురధ్రూపానికి తోడు… నటన, నాట్యం, పోరాటాలు వంటి అన్ని విభాగాల్లో నిష్ణాతుడయిన అసిఫ్ ఖాన్… ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని మూడో చిత్రం కథా చర్చల్లో పాల్గొంటున్నాడు. ఆసిఫ్‌ఖాన్ అచిరకాలంలోనే అంచెలంచెలుగా మంచి హీరోగా ఎదగాలని కోరుకుందాం!!