సినీ ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇవ్వడం కామనే. కానీ వారు సక్సెస్ ట్రాక్‌లో దూసుకెళ్తూ లాంగ్రన్ హీరోలుగా నిలబడి సత్తా చాటడమే కష్టం. అలా సత్తా చాటడానికి ఆలీ క్యాంప్ నుంచి ఓ హీరో వస్తున్నాడు. కమెడియన్ కమ్ పొలిటిషియన్ అలీకి వరుసకు సోదరుడు బాబా తనయుడు సదన్.. హీరో గా ఎంట్రీ ఇస్తున్న మూవీ భారీ తారగణం. శేఖర్ ముత్యాల దర్శకత్వంలో బివిఆర్ బ్యానర్‌పై బివి రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న ఈమూవీలో సదన్ కు జోడీగా దీపికా రెడ్డి, రేఖా నిరోషాలు నటిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఆలీ, ఎస్వీ కృష్ణారెడ్డి, కె అచ్చిరెడ్డిలు ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేసారు.
ఈ ట్రైలర్ లాంచ్ వేడుకకు ఆలీ దంపతులతో పాటు వారి బంధువులు హాజరయ్యారు. అలాగే ఆలీని కమెడియన్ స్థాయి నుంచి యమలీల మూవీతో హీరోని చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి, కె అచ్చిరెడ్డి గార్లు విచ్చేసి చిత్ర నటీనటులను, టెక్నిషియన్స్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రేమ తత్వానికి ప్రతీక ఆలీ అంటూ కె అచ్చిరెడ్డి ఆలీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. యమలీల వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ ఆలీ తమ పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటాడనీ, ఏదైనా క్యారెక్టర్ ఆఫర్ చేసి రెమ్యునరేషన్ ఎంతో చెప్పమంటే.. మీరెంత ఇస్తే అదే చాలు అంటూ ఆప్యాయంగా ప్రేమతో చెప్తాడని అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు కె అచ్చిరెడ్డి . హీరో సదన్ లో ధనుష్, లవ్‌టుడే ఫేమ్ ప్రదీప్ తరహా క్వాలిటీస్ ఉన్నాయనీ.. పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడని చక్కని భవిష్యత్తు ఉందని ఎస్వీ కృష్ణారెడ్డి ఆశీర్వదించారు. ఆలీ వేడుకకు వచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డి, కె అచ్చిరెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. భారీ తారాగణం చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేసారు. వరుసకు కొడుకైన సదన్ గొప్ప హీరోగా ఎదగాలని కాంక్షించారు. అలాగే తనకు మంచి క్యారెక్టర్ ఇచ్చి, అద్భుతంగా తీర్చి దిద్దిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేసారు.
దర్శకుడు శేఖర్ ముత్యాలకు ఓపిక ఎక్కువనీ.. నిర్మాత బివి రెడ్డికి అస్సలు కోపం రాదని.. వారు యాక్టర్స్‌తో, యూనిట్‌తో వ్యవహరించే విధానం అద్భుతం అంటూ కొనియాడాడు హీరో సదన్.ఆద్యంతం రసవత్తరంగా ట్రైలర్ లాంచ్ వేడుక జరిగింది.