‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలతో రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో వెండితెరపై మ్యాజిక్ చేసిన హిట్ జోడి నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే కళ్యాణి మాలిక్ సంగీతం అందించిన సాంగ్స్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తుంది. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది.
మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్ ‘చెక్’ సినిమా డిజాష్టర్ తో డీలా పడ్డ, ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, ‘ఇంటింటి రామాయణం’, ‘విద్య వాసుల అహం’ ఇలా వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. వీటితో పాటు మరో రెండు ‘వెబ్ సిరీస్’ లు ఖాతాలో ఉండటం విశేషం. ఏం సందేహం లేదు, ఆంధ్రుడు, ఐతే, అలా మొదలైంది, అష్టాచమ్మా ఇలాంటి గొప్ప మూవీస్ కి పాటలు అందించాడు ‘కళ్యాణ్ మాలిక్’. ఆ తర్వాత దానికి తగ్గ అవకాశం రాలేదు. కాకపోతే, ఇంకా బాగా కష్టపడాలి అనే దృక్పధంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. అలాగే, గతంలో అధినాయకుడు, బాస్ ఇలాంటి మాస్ సినిమాలకి మ్యూజిక్ అందించి, సినిమాలు బెడిసి కొట్టడంతో కమర్షియల్ సినిమాలు తగ్గుముఖం పట్టాయి. ఇకపై, కమర్షియల్ మూవీస్ చేస్తాను అని సరైన హిట్ కొడతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్క్ పరంగా సంతృప్తిగా ఉన్న సరైన హిట్ కోసం పరితపిస్తున్నారు.
20 ఏళ్లలో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గా ‘కళ్యాణ్ మాలిక్’ కి 19వ సినిమా. రీసెంట్ గా, ఈ మూవీ లో ‘కనుల చాటు మేఘమా’ పాట విడుదలై మంచి స్పందన రావడంతో తగ ఖుషి అవ్వుతున్నారు. మోహం లేని ‘ప్రేమ’ ఎంతో మధురమైనది అంటూ, ఇలాంటి పాట మునుపెన్నడు చేయలేదట. ఈ సాంగ్ హిట్ అవ్వడానికి శ్రీనివాస్ అవసరాల గారి అభిరుచి, లక్ష్మీభూపాల్ రాసిన లిరిక్స్, ఆభాస్ జోషి గాత్రం ముఖ్యపాత్ర పోషించాయి కాబోలు.
మ్యూజిక్ డైరెక్టర్ గా ‘కళ్యాణ్ మాలిక్’ గారి అన్నయ్య ‘గోల్డెన్ గ్లొబ్ అవార్డు గ్రహీత’ కీరవాణి అలాగే రాజమౌళి ఇద్దరు ఆస్కార్ బరిలో నిలవడం ఆ మూమెంట్ తనకి ఎంతో కిక్ ఇచ్చింది అంటూ సంతోషపడ్డారు. రాజమౌళి-కీరవాణి, సుకుమార్-దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్స్ తనకి ఎంతో ఇష్టమని వాళ్ళు చేస్తున్న సినిమాలు అద్భుతంగా రాణిస్తున్నప్పుడు, వాళ్ళ స్థానాన్ని భర్తీ చేద్దాం అని ఆలోచించడం అనవసరం అని అభిప్రాయపడ్డారు. సో, భవిష్యత్తులో రాజమౌళి గారి సినిమాల్లో ‘కళ్యాణ్ మాలిక్’ మ్యూజిక్ అందించను అని కళా ఖండిగానే చెప్పడంతో నెటిజెన్లు కాస్త అవ్వాక్ అయ్యారు. కాకపోతే, డైరెక్టర్ సుకుమార్ అంటే నాకెంతో ఇష్టం. సుకుమార్ రైటింగ్స్ లో నిర్మించే ఆయన సినిమాలకి సంగీతం అందించాలని ఉందని తన మనసులోని మాట చెప్పడం విశేషం.