ప్రముఖ సినీ కమెడియన్‌ అలీ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ సమాచార శాఖ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆలీకి మరో హోదా దక్కింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆర్వేన్సీస్ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కి ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌ గా వ్యవహరించబోతున్నారు. ఇది కేవలం కీర్తి కిరీటంలో కలికితురాయి మాత్రమే కాదు.. ఈ హోదా వెనుక ఓ మహోన్నత మానవతా దృక్పథం ఉందంటున్నారు. గత సంవత్సరం ఆలీ ఓ ప్రోగ్రాం నిమిత్తంలో భాగంగా ఆస్ట్రేలియాకు వెళ్లినపుడు అక్కడి తెలుగు వారు అందరూ సమిష్టిగా చేస్తున్న సేవల పట్ల ఆకర్షితులయ్యారట. ఆస్ట్రేలియాలో ఇంత మంచి సేవాకార్యక్రమాలు చేస్తున్న తెలుగువారిలో విష్ణు జగ్గిరెడ్డి, శశి కొలికొండలతో సమావేశమై.. ఈ సేవా కార్యక్రమాలు ఇండియాలో కూడా చేయొచ్చు కదా అని తన మనసులో మాట చెప్పారట. వారు ఆలీ మనసులో మాటను ఆలకించి తరువాతి రోజు 60 మందితో ఆలీ తో సమావేశమయ్యారట. ఇద్దరు ముగ్గురు వస్తారనుకుంటే ఇంత మంది ఇండియాలో సాయం చేసేందుకు ముందుకు రావడంతో ఆశ్చర్యపోయారట. బాగా చదువుకుని ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్ధులకు విద్య వైద్యం టెక్నాలజీ విభాగాల్లో సేవ చేయడానికి ఆర్వేన్సిస్‌ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌ ,సీఇఓ శశి కొలికొండ, విష్ణు జగ్గిరెడ్డిలు అక్కడున్న తెలుగువారు కంకణం కట్టుకోవడంతో స్పూర్తిని నింపిందంటున్నారు ఆలీ. అలాగే ఆస్ట్రేలియన్‌ బ్రూస్‌ మ్యాన్‌ఫీల్డ్ (డైరెక్టర్‌, గవర్నర్‌ అండ్ కంప్లెయన్స్) ఇండియాకి వచ్చి ఇక్కడి విద్యార్ధులకు సేవ చేసే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నన్ను నమ్మి ఇంతదూరం సేవ చేయడానికి ముందుకొచ్చిన ఆర్వేన్సిస్‌ కంపెనీ కి ఇండియా బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వ్యవహరించే బాధ్యతలు తీసుకున్నారు ఆలీ. తన ప్రయత్నం వల్ల పది కుటుంంబాలకు మేలు జరిగినా చాలు అంటున్నారు ఆలీ.

 

                 హైదరాబాద్‌ నుండి వెళ్లి ఆస్ట్రేలియన్ సిటిజన్ గా మారిన శశి కొలికొండ ఆలీ గారిని కలిసిన తర్వాత సేవ చేసే దృక్పథంలో మార్పు మరింత స్పూర్తి కలిగిందంటున్నారు. టాలెంట్ ఉండి ఆర్ధికంగా పేద విద్యార్ధులైన వారికి అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని సహాయాన్ని అందించడానికి ఆర్వేన్సిస్ కంపెనీ టీమ్‌ కంకణం కట్టుకుందని వెల్లడించారు. అందుకే మా టీమంతా కలిసి వైజాగ్‌లో మార్చి 3–4 తారీకుల్లో ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఏర్పాటు చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్‌ బిజినెస్‌ సమ్మిట్‌కు హాజరవుతున్నాం ’’ అన్నారు. బ్రూస్‌ మ్యాన్‌ఫీల్డ్‌ మాట్లాడుతూ–‘‘ అలీ లాంటి మంచి వ్యక్తి మాకు, మా కంపెనీకి అండగా నిలబడటం ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో వేత కుటుంబాలకు మా సేవలను అందిస్తాం’’ అన్నారు. ఇండియాలో మా కంపెనీ సాయం కోరి వచ్చిన అర్హులకు సాయం చేయటానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆర్వేన్సిస్‌ హెడ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ సుకన్య కంభంపాటి తెలిపారు.

 

 

Leave a comment

error: Content is protected !!