Shopping Cart 0 items - $0.00 0

క్యాట్ వాక్ చేసిన అందాల హంస

కథానాయికలు గా కాలం చెల్లిన భామామణులు.. సోషల్ మీడియా వచ్చాకా.. అవకాశాలు రావడం లేదని ఏ మాత్రం డీలా పడ్డంలేదు. వెండితెరమీద వడ్డించని అందాల్ని ఇన్ స్టాకు షిఫ్ట్ చేసి.. నెటిజెన్స్ ను వేడెక్కించడమే పనిగా పెట్టుకున్నారు. అందులోనూ మోడల్స్ గా కెరీర్ ప్రారంభించి.. హీరోయిన్స్ అయినవారైతే.. తమ ఒంపు సొంపుల ఆరబోతకు నియమ నిబంధనలేమీ పెట్టుకోవడం లేదు. అలాంటి భామల్లో హంసానందిని ఒకరు. ముంబై అమ్మాయి అయినప్పటికీ..  ఆవిడగారు తెలుగు సినిమాల్లోనే ఎక్కువ నటించి ప్రేక్షకుల్ని తన అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం సినిమాలేమీ చేతిలో లేకపోవడంతో ..  ఇన్ స్టా గ్రామంలో హాయిగా సేదతీరుతోంది.

లేటెస్ట్ గా హంసానందిని తన ఇన్ స్టా ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఏదో ఫారెన్ లొకేషన్ లో అనుకుంటా.. కొంత  క్యాట్ వాక్ చేసి దాన్ని మళ్లీ రివర్స్ చేసి..  ‘కొన్ని సార్లు మీరు వెనక్కి వెళుతున్నాం అనుకుంటారు. కానీ మీరు నిజానికి వెళ్లేంది ముందుకే’ అని అర్ధం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చి షాకిచ్చింది. అందులో అమ్మడు ఒక కలర్ ఫుల్ డ్రెస్ ధరించి.. కాళ్ళు కనిపించేలా ఎక్స్ పోజ్ చేస్తూ..  తన క్యాట్ వాక్ ను వీడియో గా తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఆ వీడియో కు భారీ ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 55వేలకు పైగానే లైక్స్ వచ్చి పడ్డాయి. అందాల హంస అవకాశాలు రాలేదని కుంగిపోకుండా..ఇలా క్యాట్ వాక్ చేయడం విశేషం అని చెప్పాలి. మరి అమ్మడికి ఈ విధంగానైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి.

ఇన్ స్టా వీడియో కోసం కింద లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.instagram.com/p/B7oKQOXhlV3/

 

Leave a comment

error: Content is protected !!