మూవీ టైటిల్: రాజయోగం
నటి నటులు: సాయి రోనక్, అంకిత సహా, బిస్మి నాస్, అజయ్ ఘోష్, సిజ్జు, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను తదితరులు
డైలాగ్స్: చింతపల్లి రమణ
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
డీఓపీ: విజయ్ సి కుమార్
మ్యూజిక్ డైరెక్టర్: అరుణ్ మురళీధరన్
కో ప్రొడ్యూజర్స్: డాక్టర్ శ్యామ్ లోహియా నటరాజ్, నందకిషోర్ దారక్
ప్రొడ్యూజర్: మని లక్ష్మణ్ రావు
డైరెక్టర్: రామ్ గణపతి

యంగ్ హీరో సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం “రాజయోగం”. నవబాలా క్రియేషన్స్ & వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మని లక్ష్మణ్ రావు నిర్మించగా, రామ్ గణపతి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా టీజర్ యంగ్ హీరో విశ్వక్ సేన్ చేతుల మీదగా గ్రాండ్ గా రీలిజ్ చేసారు. ఇప్పటికే, ఈ సినిమా ట్రైలర్ & టీజర్స్ లో రొమాంటిక్ సన్నివేశాలు ఓవర్ డోస్ పెరగడంతో ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అయ్యింది. కంప్లీట్ ‘ఏ’ సెన్సార్ సర్టిఫికెట్ తో రీలీజ్ అయ్యిన ఈ సినిమా ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.

కథ: రిషి(సాయి రోనక్) ఒక సాధారణ మెకానిక్. మెకానిక్ కావడం వళ్ళ లైఫ్ లో ఎంజాయిమెంట్ & అమ్మాయిలు లేకుండ పోతుంది. రిచ్ హోటల్ లో ఉండే ‘రవి ప్రకాష్’ బాగా డబ్బున్న వ్యక్తి. అతను నాలుగు రోజులు పాటు, ఔట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాడని తెలుసుకున్న రిషి అతని ప్లేస్ లోకి వెళ్లి హోటల్ లో రాజభోగాలన్నీఅనుభవిస్తాడు. అదే హోటల్ లో శ్రీ(అంకిత సహా) రిషి కి పరిచయమవ్వుతుంది. ఒకరికి ఒకరు పెద్ద కుటుంభం అని పరిచయం చేసుకుంటారు. ఆ పరిచయం ఘాటు రొమాన్స్ తో మొదలై, లవ్ కి దారి తీస్తుంది. తీరా ఒకరి వృత్తి ఒకరికి తెలిసాక డబ్బుతో ముడిపడి ఉందని విడిపోతారు. ఒక పక్క ‘అజయ్ ఘోష్’ తన అనుచరులతో కలిసి ఒక కుటుంబాన్ని మర్డర్ చేసి డైమండ్స్ కాజేస్తారు. అసలు ఆ కుటుంభం ఎవ్వరు? బిస్మి నాస్ ఆ కుటుంబానికి ఏమైనా సంబంధం ఉందా? చివరికి రిషి ఏ గుణపాఠం నేర్చుకున్నాడు? అంకిత సహా డైమండ్ కోసం ఎంత దూరం వెళ్ళింది? ఇవ్వన్నీ తెలియాలి అంటే, మీరు సినిమా తప్పకుండ థియేటర్ లో చుడాలిసిందే.

కథనం, విశ్లేషణ: గతంలో ఇలాంటి కథలతో వచ్చి బ్లాక్ బాస్టర్స్ కొట్టిన సినిమాలు కోకోల్లలు ఉన్నాయి. మరి, ఈ రాజయోగం కథ ప్రేక్షకులని అలరించిందో లేదో తెలుసుకుందాం.

ఫస్ట్ ఆఫ్ లో అజయ్ ఘోష్ రాయల్ గా ఎంట్రీ ఇచ్చినట్టే ఇచ్చి లైఫ్ రివర్స్ అవ్వుతుంది. హీరో సాయి రోనక్ ఇంట్రడక్షన్ ఫైట్ సీక్వెన్స్ అలాగే, దూకుడు ఐటెం ఫెమ్ మీనాక్షి ఎంట్రీ ఐటెం సాంగ్ బాగానే ఆకట్టుకుంటుంది. అలా కథలోకి వెళ్తే, హోటల్ లో హీరోయిన్ అంకిత సహా, హీరో సాయి రోనక్ కి పరిచయం అవ్వుతుంది. ఆ పరిచయం కాస్త శృతి మించిన ఘాటైన రొమాన్స్ విజ్యువల్స్ యూత్ ని బాగా డిస్టర్బ్ చేస్తాయి. అంకిత సహా & సాయి రోనక్ మధ్య 150 కు పైగా లిప్ లాక్ సీన్స్ నెస్ట్ లెవెల్ అసలు. కాకపోతే, అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపించడం. డైరెక్టర్ అనుకున్నంత కథ రీచ్ అవ్వకపోవడం, కథలో కొత్తదనం ఏమి లేకపోవడం కాస్త నిరాశే అని చెప్పవచ్చు. ఇంటర్వెల్ లో హీరో & హీరోయిన్ విడిపోయిన తీరు ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది.

సెకండ్ ఆఫ్ లో షకలక శంకర్ & తాగుబోతు రమేష్ కామెడీ అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది. అజయ్ ఘోష్ ప్రెజర్ లో ఉన్నప్పుడు ప్రెజర్ తగ్గించడానికి వాడే బాల్ దాంతో సాగే కామిడి బాగా ఆకట్టుకుంటుంది. సాయి రోనక్ తన ప్రేమ ని దక్కించుకోవడానికి పడే ఆవేదన కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు. కాకపోతే, అంత ఎమోషనల్ గా అనిపించవు. అదే టైం లో ఐశ్వర్య(బిస్మి నాస్) పరిచయం కాగా, హీరో ఆలోచనలో మార్పు వస్తుంది. అజయ్ ఘోష్ కాజేసిన డైమండ్స్, సిజ్జు దగ్గరకి ఎలా వచ్చాయి. సిజ్జు నుంచి డైమండ్స్ తీసుకోవడానికి అంకిత సహా తో కలిసి అజయ్ ఘోష్ ఎలాంటి ప్ల్యాన్ లు వేశారు. చివరికి సాయి రోనక్ & అంకిత సహా కలిసారా? అనేది తెలియాలి అంటే, మీరు ఈ సినిమా తప్పకుండ చుడాలిసిందే. కొన్ని వర్గాల ప్రేక్షకులకి జబర్దస్త్ చూస్తున్నట్టు అనిపించిన ఈ సినిమా చూడవచ్చు.

నటి నటులు పెర్ఫామెన్స్: మొదటి సినిమాతో నే ‘అంకిత సహా’ ఘాటైన రొమాన్స్ & పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులని థియేటర్ లో క్లీన్ బౌల్డ్ చేసింది. బహుశా, ఈ అమ్మాయి తప్ప మరెవ్వరు ఈ క్యారెక్టర్ చేయడానికి డేర్ చేయలేరేమో. ఇకపోతే, సాయి రోనక్ డ్యాన్స్, యాక్టింగ్, మార్షల్ ఆర్ట్స్ ఇలా ఆల్ రౌండర్ పెర్ఫామెన్స్ ఇచ్చి ఈ మూవీ తో మరింత ప్రూవ్ చేసుకున్నాడు. ఈ హీరో కి సరైన సినిమా పడితే అగ్ర హీరోలోకి పోటీ ఇవ్వడం పక్క. అజయ్ ఘోష్ విలనిజం తో కూడిన కామిడి అదరకొట్టేసాడు. భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేష్ చేసిన సన్నివేశాలు ప్రేక్షకులని నవ్విస్తాయి. తదితర స్టార్ కాస్టింగ్ అందరు బాగానే రాణించారు.

సాంకేతిక విభాగం: డైరెక్టర్ రామ్ గణపతి ఘాటైన రొమాన్స్ తో పాటు కామిడి ని బాగానే పోట్రైట్ చేసిన, కథ మీద పట్టు సాదించలేకపొయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్ మురళీధరన్ తన పరిధి మేరకు బ్యా గ్రౌండ్ మ్యూజిక్ బాగానే అందించారు. ఇకపోతే, డీఓపీ విజయ్ సి కుమార్ పనితీరు బాగున్నా కొన్ని సన్నివేశాలలో ఇంకా బాగా చేసి ఉండాలిసింది. ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ కొన్ని సన్నివేశాలు తేలిపోయ్యాయి, అదే విధంగా ఇంకా బాగా కట్ చేసి ఉండాలిసింది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

రేటింగ్: 2.75
బాటమ్ లైన్: మాస్ మసాలా రొమాంటిక్ బిరియాని “రాజయోగం”
Review By: Tirumalasetty Venkatesh

 

Leave a comment

error: Content is protected !!