తెలంగాణ మూవీ, ఆర్టిస్ట్ యూనియన్ పదోవ
” కుటుంబ కళోత్సవం ” వార్షికోత్సవ ఉత్సవాలు
కన్నుల పండుగగా ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించడం జరిగింది.
సంస్కృత కార్యక్రమాలు,డాన్సులు, కళా పోషక
నుత్యాలు తదితర కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ వార్షికోత్సవ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా లాంగ్వేజ్,కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొని ప్రసంగించారు…సినిమాకు కులం మతం, ప్రాంతాలు ఉండవని,ప్రజలకు వినోదాన్ని అందించే సాధనమే సినిమా అని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా పరిశ్రమ పదికలాలపాటు కొనసాగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కరోనా ఎఫెక్ట్ సినీ పరిశ్రమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని, దీంతో ఆర్టిస్టులు ఆర్థిక సంక్షోభంలో సతమతమవుతున్నారని వివరించారు.ప్రస్తుతం సినిమా షూటింగులు చాలావరకు తగ్గిపోయాయని, దీనివలన ఆర్టిస్టులు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు సినీ పరిశ్రమలను ఆదుకోవాలని,అప్పుడే జూనియర్ ఆర్టిస్టులు మునగడ సాధ్యమవుతుందని తెలిపారు.
ప్రభుత్వం సినీ ఆర్టిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించాలి..
కోవిడ్ మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ కుదేల్ అయిందని, ప్రభుత్వాలు ఆదుకోవాలని
తెలంగాణ మూవీ, ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుడు
రాజశేఖర్,30 ఇయర్స్ ఇండస్ట్రీ గౌరవ అధ్యక్షులు పృథ్వీరాజ్ లు కోరారు. ఈ పరిస్థితుల్లో పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇటు ప్రభుత్వం అటు సినిమా పరిశ్రమ పెద్దలు పరిశ్రమను కాపాడుకోవడానికి ఐక్యం కావాలని వారు పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు ఆర్టిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారి తోడ్పాటు అందించాలని వారు కోరారు. తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ యూనియన్ కొత్తగా ఆదివారం www.tmtau.org (తెలంగాణ మూవీ,ఆర్టిస్ట్ యూనియన్ ) ఓ వెబ్సైట్ ను ప్రారంభించింది..
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుమార్,
తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సిపిఎస్ఎన్ దొర,
ప్రముఖ నిర్మాత సామాజిక సంఘసంస్కర్త
ప్రశాంత్ గౌడ్, సినిమా యాక్టర్
ప్రదీప్, ప్రధాన కార్యదర్శి గోవింద్ శ్రీనివాస్,కార్యవర్గ సభ్యులు నండూరి రాము,పద్మ రేఖ,శ్రీనివాస్ రాథోడ్,మునీంద్ర బాబు,నూకరాజు,కేపీ రెడ్డి,గోంగూర శ్రీనివాస్,కనకదుర్గమ్మ,
వీరేష్,మాధురి,ఆళ్ల అరుణ,
స్వప్న,కావేరి,రవీందర్,సత్య ప్రకాష్,SRS ప్రసాద్,
రామ్మోహన్,ప్రేమ్ జీవన్,చీరల శ్రీనివాస్,
ర్యాలీ మోహన్ రావు,సంజీవరావు,కామేష్ గౌడ్
రజిని, శ్రీ కల,దశరద్. ప్రభు, సినీ ఆర్టిస్టులు, సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు..