సినిమా రివ్యూ : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

నటీనటులు : అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిశోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, శ్రీతేజ్, కుమనన్ సేతురామన్, కామాక్షి భాస్కర్ల తదితరులు

మాటలు : అబ్బూరి రవి 

సంగీతం : శ్రీచరణ్ పాకాల

ఛాయాగ్రహణం : రామ్‌ రెడ్డి

నిర్మాణ సంస్థలు: హాస్య మూవీస్, జీ స్టూడియోస్

నిర్మాత : రాజేష్ దండా

రచన, దర్శకత్వం : ఏఆర్ మోహన్

విడుదల తేదీ: నవంబర్ 25, 2022

అల్లరి నరేష్ ఆనంది జతగా నటించిన తాజా సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఎన్నికల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తగా నిర్మించిన ఈ సినిమా కి రాజేష్ దండా నిర్మాత. గతేడాది ‘నాంది’తో ‘అల్లరి’ నరేష్ ఖాతాలో మంచి విజయం సాధించింది. ఇప్పటికే టీజర్ & ట్రైలర్ ప్రేక్షకులని అలరించింది. కాకపోతే, నెటిజెన్లు హిందీ లో వచ్చిన న్యూటన్ మూవీ కి రీమేక్ లా ఉందని అని భావిస్తున్నారు? ఈ సినిమా చూసాక మిరే చెప్పాలి.. మరి కథలోకి వెళ్లిపోదామా..?

 

కథ :

శ్రీనివాస్ శ్రీపాద (అల్లరి నరేష్) ఒక గవర్నమెంట్ టీచర్. నరేష్ కి మారేడుమిల్లి గ్రామంలో ఎలక్షన్ డ్యూటీ పడుతుంది. అప్పటివరకు అలాంటి పేరు తో ఒక గ్రామం ఉందని ప్రపంచానికి తెలియదు. నరేష్ గ్రామ ప్రజల చేత ఓటు వేయించడానికి వచ్చి, లక్ష్మి(ఆనంది) తో లవ్ లో పడతాడు. కొండ ప్రాంతంలో బ్రతికే ఆ గ్రామ ప్రజల ద్వారా తెలుసుకున్న వాళ్ళ కష్టాలను ప్రపంచానికి తెలియజేయాలని నరేష్ నిశ్చయుంచుకుంటాడు. దానికోసం, వాళ్ళతో కలిసి పోరాటం చేస్తాడు. అప్పుడే, సినిమా కథలో ఊహించని సంఘటనలు మొదలవ్వుతాయి. నరేష్ గ్రామ ప్రజల కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదురుకొన్నాడు? ఫైనల్ గా తాను అనుకున్నది గ్రామ ప్రజలతో కలిసి సాధించాడా లేదా..? అన్నది ఈ సినిమా కథ.

 

కథనం, విశ్లేషణ: 

గతంలో ఎన్నికల నేపథ్యంలో వచ్చిన సినిమాలు కోకోల్లలు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ నాయకులు, అధికారులకు ప్రజలు గుర్తొస్తారని ఆ తర్వాత వాళ్ళ సమస్యలు పట్టించుకోరని అందరికి తెలుసు. ఒకవేళ ఎన్నికల సమయంలో తమ సమస్యలు తీర్చమని ఓ ఊరు మొత్తం ఎదురు తిరిగితే ఎట్లుంటుంది అనేది? ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. 

 

ఫస్ట్ ఆఫ్ ఓపినింగ్ గ్రామంలో చనిపొయ్యిన అప్పన్న సీక్వెన్స్ ఎమోషనల్ గా పెద్దగా ఆకట్టుకోకపోయిన, నరేష్ ఎంట్రీ తో తెలుగుదనం ఉట్టిపడేలా తెలుగు ఖ్యాతి ప్రజలు గర్వపడే డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఒక తెలుగు టీచర్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడు చాటి చెప్పే క్యారెక్టర్. తెలుగు చాలా స్పెషల్. అక్కడక్కడ నరేష్ & వెన్నెల కిషోర్ మధ్య సాగే కామిడి బాగా నవ్విస్తుంది. ముఖ్యంగా, వాన వాన రైమ్, తలుపులు, సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. ప్రత్యేకంగా లక్ష్మి సాంగ్ లో ఆనంది పెర్ఫామెన్స్ & క్యూట్ నెస్ చాలా బాగుంటుంది. అంతే కాకుండా, పురిటి నొప్పి తో బాధపడుతున్న సీన్ సగటు ప్రేక్షకుడికి గూస్ బమ్స్ తెప్పిస్తాయి. ఇంటర్వెల్ సీన్ బ్యాగ్ అదిరిపోతుంది. 

 

సెకండ్ ఆఫ్ అల్లరి నరేష్ వేసే స్కెచ్ లు, గ్రామ ప్రజలతో తో ఆడించే ఆటలు బాగున్నప్పటికీ రొటీన్ గా అనిపిస్తాయి. అక్కడక్కడ కొన్ని సీన్స్ సాగదీత గా అనిపిస్తాయి. ఆనంది పాత్ర కి స్కోప్ ఉన్న, డైరెక్టర్ సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు అనే చెప్పాలి. రాజకీయ నాయకులు ఓట్ల కోసం ప్రజలను ఏ విధంగా వాడుకుంటారు. అనేదాన్ని, ఈ సినిమాలో చక్కగా చూపించారు. సినిమాలో కొన్ని చలించిపోయే సన్నివేశాల్లో మరింత భావోద్వేగం, బలం ఉండుంటే సినిమా ఫలితం మరోలా ఉంటుంది.. కానీ, ఫ్యామిలీ అంతా హ్యాపీగా చూడవచ్చు. ముఖ్యంగా, సినిమా చూసాక బిసి సెంటర్ లో ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. 

నటి నటులు పెర్ఫామెన్స్: ఈ మధ్య అల్లరి తగ్గించి టాప్ మార్క్స్ తెచ్చుకోవడానికి తగ కసరత్తులు చేస్తున్నాడు “అల్లరి నరేష్”. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చూసాక మెరిట్ లో పాస్ అయ్యాడు అని మిరే అంటారు, అలా చేసాడు పెర్ఫామెన్స్. ఇన్నోసెన్స్, సిన్సియారిటీ, హ్యూమన్ బీయింగ్, సాయం చేసే గుణం ఇలా ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ తో చితకొట్టేశాడు. మన తెలుగింటి అమ్మాయి ఆనంది(లక్ష్మి) పాత్రలో ఒదిగిపోయింది. అంతే కాదు, చాలా సెట్టిల్డ్ గా పెర్ఫామ్ చేస్తూ ది బెస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి. వెన్నెల కిశోర్ ఉన్నంత సేపు నవ్వుతుంటారు ఆడియెన్స్. ప్రవీణ్ చాలా చక్కగా చేసారు. కలెక్టర్ పాత్రలో నటించిన సంపత్ రాజ్ ఈ సినిమాలో కీలకం. అయన పెర్ఫామెన్స్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీతేజ్ కెరీర్ లో ఒన్ ఆఫ్ ది బెస్ట్ మెట్యూర్డ్ పెర్ఫామెన్స్ అని చెప్పచ్చు. కుమనన్ సేతురామన్ గ్రామానికి పెద్దయ్య క్యారెక్టర్ లో బాగా రాణించారు…

 

సాంకేతిక విభాగం: దర్శకుడు అన్ని రంగాల్లో బాగా రాణించారు. కాకపోతే, సినిమా లో కొత్తధనం లేదు కదా అనిపిస్తుంటుంది సగటు ప్రేక్షకుడికి. ఏదైమైనా డైరెక్టర్ పని తీరు బాగుంది. శ్రీచరణ్ పాకాల బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే బీజీఎమ్ వేరే లెవెల్ అసలు. రామ్‌ రెడ్డి ఛాయాగ్రహణం కళ్ళకి కట్టినట్టు చాలా న్యాచురల్ గా తీర్చిదిద్దారు. ఇకపోతే, ఎడిటింగ్ లో కత్తరా పెట్టడానికి స్కోప్ ఉన్నప్పటికీ పర్వాలేదు అనిపించారు. అబ్బూరి రవి డైలాగ్స్ బాగున్నా, పెద్దగా పేలలేదు. నిర్మాణ విలువలు ఏ మాత్రం తగ్గకుండా నిర్మించినట్టు తెలుస్తుంది.  

 

రేటింగ్: 3/5

బాటమ్ లైన్: ఆలోచింపచేసే “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” 

రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్

Leave a comment

error: Content is protected !!