మూవీ టైటిల్: మసూద
విడుదల తేదీ : నవంబర్ 18, 2022
నటీనటులు: సంగీత, తిరువీర్‌, కావ్య, భాందవి, సుభలేఖ సుధాకర్‌, సత్యం రాజేష్‌, సత్య ప్రకాశ్‌, అఖిలా రామ్‌ తదితరులు
ఎడిటర్: జెస్మిన్‌ ప్రభు
సంగీత దర్శకులు: ప్రకాశ్‌ ఆర్‌ విహారి
సినిమాటోగ్రఫీ: నాగేష్‌
నిర్మాత: రాహుల్‌ యాదవ్
దర్శకుడు : సాయి కిరణ్‌

స్వధర్మ్ బ్యానర్ గతంలో నిర్మించిన మళ్లీరావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సినిమాలు నిర్మించిన నిర్మాత రాహుల్‌ యాదవ్. ఈ నిర్మాతకు ఈ రెండు చిత్రాలతో మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు, సంగీత, తిరువీర్‌, కావ్య, భాందవి కాంబినేషన్ లో హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న చిత్రం “మసూద”. ఈ చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు & ఇండస్ట్రీ వర్గాల మధ్య మంచి పాజిటివ్ టాక్ నడిచింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? మసూద కథ ఏంటి? ఆడియెన్స్‌ను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం?

కథ:
భర్త అబ్దుల్ (సత్య ప్రకాష్‌)కు దూరంగా నీలం (సంగీత) తన కూతురు నాజియా(బాంధవి శ్రీదర్) పెంచుతుంటుంది. నీలం ఉండే అపార్ట్మెంట్ లో పక్క ఇంట్లో ఉండే గోపీ (తీరువీర్) భయస్థుడు. కానీ, సగటు మనిషికి సహాయం చేసే గుణం ఉంటుంది. గోపీ తన కంపెనీ లో ఉండే మినీ (కావ్యా కళ్యాణ్‌ రామ్)ను ప్రేమిస్తాడు. నీలం, నాజియా ఇద్దరి గుణాలు నచ్చి వాళ్లకి కుదిరినప్పుడల్లా హెల్ప్ చేస్తుంటాడు. కొన్ని రోజులు తరువాత నాజియా వింతగా ప్రవర్తిస్తుంటుంది. దెయ్యం పట్టి ఉంటుందన్న అనుమానంతో, ఆమెను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు గోపి అలాగే నీలం. ఈ క్రమంలో గోపీకి ఎదురైన సవాల్ ఏంటి? మినీతో ప్రేమ వ్యవహారం ఎంత వరుకు సాగింది? నీలం కన్న కూతురిని రక్షించుకుందా? నాజియాకు దెయ్యం ఎలా పట్టింది? అసలు మసూద ఎవరు? అన్నది తెరపై చూడాల్సిందే.

కధనం, విశ్లేషణ:

గతంలో కొన్ని హర్రర్ సినిమాలు హిందూ సంప్రదాయం నేపథ్యంలో వచ్చాయి. కానీ, ‘మసూద’లో కథంతా ముస్లిం చేతబడి నేపథ్యంలో సాగుతుంది. అదే ఈ సినిమాకి ప్లస్ పాయింట్. పీర్ బాబాలు ఆత్మలను వదిలించడానికి ఇస్లాం నేపథ్యంలో చేసే పూజలు, మంత్రించిన కత్తితో దెయ్యాన్ని అంతం మొందించడం వంటి సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి.

ఇంట్రడక్షన్ లో ఇద్దరు అన్నదమ్ములు చనిపోయిన తీరు, ఆ లొకేషన్ ప్రేక్షకులని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అలా, కథలోకి వెళ్తుండగా అన్నదమ్ములని చంపిన మాసూద ని చంపేస్తాడు పెద్ద అన్నయ్య. సినిమాలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించిన తీరు కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా, మసూద కటౌట్, వైఖరి, భయపెట్టించిన తీరు సగటు ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది.

కథ విషయానికి వస్తే…ఫస్ట్ ఆఫ్ మొత్తం కథ ఎక్కడ రివీల్ చెయ్యకుండ చాలా జాగ్రత్త పడుతూ ఇంటర్వెల్ బ్యాంగ్ తో షాక్ ఇస్తారు. కథను నడిపించిన తీరు బాగున్నా కొన్ని చోట్ల సాధారణంగా ఉంటాయి. అలాగే కొన్ని చోట్ల నిడివి ఎక్కువైనా సన్నివేశాలు ఎంగేజింగ్ గా ఉంటాయి. సెకండ్ ఆఫ్ నుంచి సినిమా పరిగెడుతూ ఉంటుంది, ముఖ్యంగా చివరి అరగంట ఉత్కంఠభరితంగా సాగుతుంది. దీనికి ప్రధాన కారణం ఛాయాగ్రహణం, సంగీతం. సీన్ టు సీన్ తరువాత ఏదో జరగబోతుంది అనే ఉత్కంఠను క్రియేట్ చేసారు. మసూద’తో హారర్ సినిమాలకు కూడా సంగీతం అందించగలడని నిరూపించుకున్నాడు. పలు సన్నివేశాల్లో ఆయన సౌండ్ డిజైనింగ్ బాగుంది. భయం కలిగిందంటే ఆయన నేపథ్య సంగీతం ప్రధాన కారణం.

సినిమా మొత్తంలో ఎక్కడ ఏడవని సంగీత, తన కన్న కూతురిని గొలుసులతో కట్టిపడేస్తున్న టైం లో ఏడ్చిన విధానం సగటు తల్లులకి బాగా కనెక్ట్ అవ్వుతుంది. తెలుగు అమ్మాయి బాంధవి నాజియా పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులని భయపెట్టిస్తుంది. ఒక దెయ్యం చచ్చి ఆవహించాలనుకుంటే అది బాంధవి లాంటి అమ్మాయే కరెక్ట్ అనేంతలా ఆకట్టుకుంది. గంగోత్రి లో చైల్డ్ క్యారెక్టర్ చేసిన కావ్య ఈ సినిమాలో మినీ పాత్ర తో ప్రేక్షకులకి మరింత దగ్గరైయింది. మాసూద క్యారెక్టర్ లో చేసిన లేడి మంత్రగత్తె అంటే ఇలాగే ఉంటుందా? ఇలాగే బిహేవ్ చేస్తుందా? అనేంతలా ఫేస్ కనిపించకుండానే జనాలని భయపెడుతుంది. ముఖ్యంగా, పాడు బడ్డ ఇంట్లో జరిగే సీన్స్, స్మశానం శవాన్ని అంతమొందించే సీన్స్, ఇంటర్వెల్ బ్యాగ్ కెవ్వు కేక….

నటీనటులు పెర్ఫామెన్స్:

మొదట గా గోపీ పాత్ర లో తిరువీర్ చాలా బాగా నటించాడు. గతంలో తిరువీర్ అంటే విలనిజం కి మారు పేరు. కానీ ఇందులో మాత్రం పూర్తి భిన్నంగా భయస్తుడుగా, మొహమాటస్తుడిగా నటించాడు. కొన్ని సీన్స్ లో అయ్యితే అదరకొట్టేసాడు. చాలా కాలం తరువాత సంగీత గారిని మధ్య తరగతి టీచర్ పాత్రలో అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించేసారు. కావ్యా కళ్యాణ్‌ రామ్‌ పాత్ర ఉన్నంత వరకు బాగుంది. ఇక, నాజియా పాత్రలో నటించి బాంధవి మాత్రం నిజంగానే భయపెట్టేసింది. ఈ సినిమా కధ ఆమె చుట్టే తిరుగుతుంటుంది. తెల్ల గా ఉండే ఒక అమ్మాయికి దెయ్యం పట్టి మనుషులని భయపడితే ఎలా ఉంటుంది మీరే ఊహించుకోండి. మసూద పాత్ర ఈ సినిమాకి ప్రాణం. ఆ క్యారెక్టర్‌లో ఎవరు నటించారన్నది తెలియకుండ సస్పెన్స్ క్యారీ చేసారు. మిగిలిన పాత్రల్లో సత్యం రాజేష్‌, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్‌ తదితరులు బాగానే ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం:

దర్శకుడు సాయి కిరణ్ అన్ని క్రాఫ్ట్స్ లో అదరకొట్టేసాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే తో గ్రిప్పింగ్ గా తీర్చిదిద్దారు. సంగీత దర్శకుడు ప్రకాశ్‌ ఆర్‌ విహారి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సినిమాలో సీన్‌ కి తగ్గట్టు గా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశారు. సినిమా ఎడిటింగ్‌లో జెస్మిన్‌ ప్రభు పనితన బాగుంది కానీ, అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. నాగేష్‌ కెమెరా పనితనం సినిమాని మరో లెవల్‌కు తీసుకెళ్లింది. కొన్ని విజ్యువల్స్ తో సినిమాని మరింత భయపెట్టేలా తీర్చిదిద్దారు. నిర్మాణ విలువలు బావున్నాయి.

రేటింగ్: 3.5/5

బాటమ్ లైన్:  భయపెట్టి మెప్పించిన “మసూద”

రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్

Leave a comment

error: Content is protected !!