‘‘కొన్ని వందల గ్రామాల్లోని వేల మత్స్యకార కుటుంబాల జీవన శైలి, వారి కట్టుబాట్లతో ఈ జెట్టి సినిమా తెరకెక్కించాం. అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న వేల మత్య్సకారులున్న ఒక ఊరి కథ ఇది. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వంలో నందితా శ్వేత, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో రానున్న ఈ చిత్రానికి వేణు మాధవ్ కె. నిర్మించారు. ఈ నెల 4న థియేటర్ లో విడుదల కానుంది ఈ సినిమా.
ఈ సందర్భంగా హీరో మాన్యం కృష్ణ మాట్లాడుతూ –
నా పేరు కృష్ణ, నేను రాయలసీమ చిత్తూర్ జిల్లాలో జన్మించాను. సినిమా మీద ఫ్యాషన్ తో డిగ్రీ డిస్ కంటిన్యూ చేసి ఈ ఫీల్డ్ కి వచ్చాను. ఒక రోజు వెటర్నన్ యాక్టర్ కోట శ్రీనివాస్ గారు షాపింగ్ మాల్ కి గెస్ట్ గా వస్తున్నారని తెలుసుకొని, ఆయనతో సెల్ఫీ దిగడం కోసం వెళ్తే, నన్ను చూసి ఇంటికి రమ్మని చెప్పారు. ఇంటికి వెళ్తే, ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసి, హీరో గా సినిమా చెయ్ అని గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఆయన గైడెన్స్ తీసుకున్న నేను డిగ్రీ కంప్లీట్ చేసి, ఐటి బ్యాగ్రౌండ్ లో జాబ్ చేస్తూ ఉన్నాను. కానీ, నా మనసంతా సినిమా వైపు లాగుతుంది. ఆ టైం లో, వరసకు నాకు బావ అయ్యిన గల్లా అశోక్ చెన్నై లో డ్యాన్స్ నేర్చుకుంటున్నాడని తెలుసుకొని, నేను ఆ గ్రూప్ లో ఒక డ్యాన్స్ మెంబర్ గా వెళ్ళాను. డ్యాన్స్ తో పాటు, జిమ్నాస్టిక్స్ అండ్ స్టంట్ లు నేర్చుకోవడం నా కెరీర్ కి బాగా ప్లస్ అయ్యింది. అదే విధంగా, ఆంధ్రప్రదేశ్ లో గల్లా జయదేవ్ గారి ఆధ్వర్యంలో మేము కొన్ని సేవ కార్యక్రమాలు చేస్తుండగా “ఆర్గాన్” అనే ఒక షార్ట్ ఫిలిం చేసాం. ఆ ప్రాసెస్ లో పండు అని ఒక డైరెక్టర్ నన్ను చూసి హీరో గా ఫస్ట్ మూవీ నాకు ఆఫర్ చేయడం జరిగింది. ఒక పక్క హెచ్ పి లో జాబ్ చేస్తూనే, ఆ సినిమా చేశాను. కొన్ని రోజులు తరువాత ఆ సినిమా డిలే అవ్వుతున్నప్పుడు ఒక రోజు నా ఫ్రెండ్ అసోసియేట్ డైరెక్టర్ జగదీశ్, జెట్టి సినిమాలో హీరో గా అవకాశం ఇవ్వడంతో అక్కడ నుంచి నా కెరీర్ మలుపు తిరిగింది.
2020 లో ఫెబ్ లో సెకండ్ మూవీ హీరో గా పూజా కార్యక్రమాలు చేసిన తరువాత లాక్ డౌన్ పడింది. కొన్ని నెలలు తరువాత సినిమా చీరాల లో లైవ్ లొకేషన్ లో స్టార్ట్ చేసాం. జెట్టి అంటే ఒక ఫిషింగ్ హార్బర్, సముద్ర తీరాన్ని మరియు సముద్ర ప్రాతాన్ని కలిపే ఒక వంతెన. ఆ కోస్టల్ కి ఎందుకు హార్బర్ కావలి? జెట్టి ఉంటె ఏంటి? లేకపోతే ఏంటి? అనేది ఈ సినిమా. ఈ సినిమా షూటింగ్ అంత కటారి పాలెం, రామాపురం షూట్ చేసాం. ఆధునిక ప్రపంచానికి, అక్కడ ఉన్న కట్లు బాట్లు కి ఈ రెండిటిని కంట్రోల్ చేసే పర్సన్ “కాపు”. కాపు కాసే వాణ్ణి కాపు అంటారు. ఈ సినిమా స్టార్టింగ్ లోనే మా టీం అందరు రియల్ లొకేషన్స్ కి వెళ్లి వాళ్ళు ఎలా జీవిస్తారు, వాళ్ళ బ్రతుకు తెరువు ఎలా ఉంటుంది అవ్వన్నీ స్టడీ చేసి తీసిన సినిమా జెట్టి. ఈ సినిమాలో ఫాదర్ & డాటర్ మధ్య ఉన్న రిలేషన్ చాల స్ట్రాంగ్ గా ఉంటుంది. సామాజిక కోణంలో ఆలోచించే ఒక తండ్రి అక్కడున్న సమస్యలన్నీ తన భుజాన వేసుకొని ఆ గ్రామానికి జెట్టి తీసుకురావడానికి ఏం చేసాడు అనేది స్టోరీ.
మత్స్యకార కుటుంబాల కథ వింటే, మన గుండె బరువు ఎక్కువైపోతోంది. ఫిషింగ్ కోసం సముద్రం లోకి వెళ్లి అక్కడే కొన్ని రోజులు ఉండి బయటికి వచ్చే వాళ్ళు చాల మంది ఉన్నారు. వాళ్ళు వస్తారా? లేదా? అని ఇంటి దగ్గర తన కుటుంభం ఎదురు చూస్తూ ఉంటుంది, ఇవన్నీ చాల ఎమోషనల్ గా సాగుతుంది. ఊరు సమస్యలతో పాటు, హీరో & హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవ్వుతారు. వీటన్నికంటే, క్లైమాక్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. జెట్టి సినిమాలో 3 ముఖ్యమైన ఫైట్స్ పాండ్యన్ మాస్టర్ ఆధ్వర్యంలో చేయడం నాకు ఎక్కడ లేని ఎనర్జీ ఇచ్చింది. సినిమా చుసిన తరువాత ఖచ్చితంగా ఫైట్స్ & క్లైమాక్స్ గురించి మాట్లాడతారు. కధకి తగ్గట్టుగా సాంగ్స్ అన్నీ తీర్చిదిద్దారు మ్యూజిక్ కార్తిక్ కొండకండ్ల. ఇప్పటికే, దూరం కరిగిన సాంగ్ 19 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాకి టాప్ లిరిసిస్ట్ లు యాడ్ అవ్వటం మాకు ప్లస్ అయ్యింది.
ఒక పక్క బడ్జెట్ పెరుగుతున్న మా డైరెక్టర్ సుబ్రహ్మణ్యం పిచ్చుక అలాగే ప్రొడ్యూజర్ వేణు మాధవ్ ఏ మాత్రం వెనకాడకుండా ఈ సినిమా చేసారు. ఈ మధ్యనే గోపీచంద్ మలినేని గారు ట్రైలర్ చూసి డీఓపీ వీరమణి పని తీరు చూసి అభినందించారు.
సినిమాలో మీ “క్యారెక్టర్” గురించి?
నా క్యారెక్టర్ సినిమా లో చాలా కూల్ గా ఉంటుంది. ఎక్కడికి వెళ్లిన, ఎక్కడ ఉన్న తన చుట్టూ పక్కల ఉన్న వాళ్ళు హ్యాపీ గా ఉండాలని కోరుకుంటాడు. తల్లి & తండ్రి లేని ఒక కుర్రాడు, ఏదైతే తన రియల్ లైఫ్ లో దక్కలేదో, ఎదుటి వ్యక్తి కి దక్కాలని కోరుకునేవాడు. అలాగే నమ్ముకున్న వ్యక్తులు ఇబ్బందుల్లో ఉంటే పోరాడే వ్యక్తి.
జెట్టి సినిమాలో “ఛాలెంజింగ్” గా అనిపించింది ఏంటి?
జెట్టి సినిమాలో వచ్చే క్లైమాక్స్, నా కెరీర్ లో ఇప్పటి వరుకు అలాంటిది చూడలేదు. ఇదే, విషయం హీరోయిన్ నందిత శ్వేతా కూడ అనడం జరిగింది. ఈ సినిమా కి హుక్ పాయింట్ క్లైమాక్స్. క్లైమాక్స్ జరుగుతున్నప్పుడు చుట్టూ పక్కల జనాలు దాదాపు 100 కు పైగా వచ్చి చూసారు. సీన్ కంప్లీట్ అయ్యినప్పటికీ కూడ జనాలు అందరు ట్రాన్స్ లో ఉన్నారు అంత అద్భుతంగా వచ్చింది ఈ సినిమా క్లైమాక్స్.
జెట్టి సినిమా “రియలిస్టిక్ (ఆర్) ఫిక్షన్”?
ఈ సినిమా మొత్తం చాలా రియలిస్టిక్ గా ఉండబోతుంది. కోస్టల్ బెల్ట్ లో జెట్టి లేకపోతే ఏంటి? ఈ విషయం అనే కాకుండా అక్కడున్న కటారి పాలెం, రామాపురం విలేజ్ లో జరిగే కట్టుబాట్లు, పద్ధతులు గురించి హీరోయిన్ ఫాదర్ ద్వారా ఈ సినిమా కథ పోట్రైట్ అవ్వుతుంది.
మీరు కొత్త హీరో కదా? ఫస్ట్ మూవీ లవ్ స్టోరీ కాకుండా ఎందుకు మెసేజ్ ఓరియెంటెడ్ కథ ఎంచుకున్నారు?
నా మొదటి సినిమా “మిష్టర్ కళ్యాణ్”. అది త్వరలోనే రీలిజ్ కానుంది. కానీ సెకండ్ మూవీనే, నా మొదటి సినిమా కావడం నాకు చాలా హ్యాపీ గా ఉంది. ఎందుకంటే, ఇప్పుడున్న ప్రేక్షకులు రూట్స్ ఉన్న కథలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మా జెట్టి సినిమా కూడా మన కల్చర్ కి తగ్గట్టుగా మూలాలు ఉన్న కథ. కాబట్టి, నేను ఇంకా చాలా దైర్యంగా ఉన్నాను. పైగా, నాకు సినిమా ఇండస్ట్రీ లో చిన్నప్పటి నుంచి విక్టరీ వెంకటేష్ అలాగే, రానా ఇద్దరు నాకు ఇన్స్పిరేషన్. వెంకటేష్ గారి సినిమాల్లో ఎక్కువ గా మెసేజ్ ఓరియెంటెడ్ ఉంటాయి. అలాగే రానా ఒక పెద్ద కుటుంభం నుంచి హీరో గా వచ్చి “లీడర్” అని ఒక మెసేజ్ సినిమాతో లాంఛ్ అయ్యారు. అలా వాళ్ళ లాగే నా జీవితంలో కూడ కనెక్ట్ అయ్యిందని అనుకుంటాను. అందుకే, వాళ్ళ ఇద్దరి పేర్లు నా చేతికి ట్యాటూ గా వేసుకొని సంతోష పడుతుంటాను.
మీ “కో హీరోయిన్ & కో ఆర్టిస్ట్” లు గురించి?
మా సినిమాలో హీరోయిన్ “నందిత శ్వేతా” తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలు. సినిమాలో ఆవిడ పాత్ర చాల చక్కగా ఉంటుంది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడ బాగుంటుంది. సెట్స్ లో నాకు తెలియనవి ఆవిడ ద్వారా తెలుసుకోవడం జరిగింది. చాలా ఫ్రెండ్లి కో స్టార్..కాంతారా లో యాక్ట్ చేసిన కిషోర్ ఈ సినిమా లో ఇంపార్టెంట్ రోల్ చేసారు. అదే విధంగా మైమ్ గోపి గారు, ఆయన దగ్గర నేను మైమ్ నేర్చుకోవడం జరిగింది. ఆయన కూడ యాక్టింగ్ అద్భుతంగా చేసారు.ఆయన ఈ సినిమా కథ నచ్చి చేసారు.
జెట్టి సినిమా “బై లింగ్యువల్” లో షూట్ చేసారా?
మేము షూటింగ్ టైం లో తెలుగు & తమిళ్ బై లింగ్యువల్ లో చేసాం. కొన్ని రీజన్స్ వళ్ళ థియేటర్స్ లో, ఓన్లీ తెలుగు లో మాత్రమే నవంబర్ 4న రీలిజ్ కానుంది. కొన్ని రోజులు తరువాత తమిళ్ లో రీలిజ్ చేస్తాం. అలాగే, ఓటిటి ప్ల్యాట్ ఫామ్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ల్యాంగ్వేజ్ లో రీలిజ్ అవ్వుతాయి.
డైరెక్టర్ “సుబ్రహ్మణ్యం పిచ్చుక” గురించి?
స్వామీ రారా, మోసగాళ్లకు మోసగాడు అలా చాలా సినిమాలకి ఆయన కో డైరెక్టర్ గా పని చేసారు. ఈ సినిమా ని అయ్యన చాలా బాగా హ్యాండిల్ చేసారు. అనుకున్న దాని కన్నా మంచి ఔట్ ఫుట్ వచ్చింది.
“నవంబర్ 4న” మీ సినిమా ఎందుకు చూడాలి?
మా సినిమా కల్చర్ కి దగ్గర గా ఉండే కంటెంట్ కాబట్టి ప్రేక్షకులు చూడాలిసిన సినిమా. అన్ని సినిమాలతో పాటు మా సినిమా కూడ చూస్తారని మా టీం కి చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే, మా సినిమా జానర్ డిఫ్ఫరెంట్. పైగా, మేము దాదాపు 200కు పైగా థియేటర్ లు రీలిజ్ చేస్తున్నాం.
మీరు ఫ్యూచర్ లో “విలన్’ గా చేసే అవకాశం ఉందా?
ఫ్యూచర్ లో హీరో గానే కాకుండా, పెద్ద సినిమాల్లో మంచి అవకాశం వస్తే విలన్ గా కూడ చేస్తాను. సూర్య నటించిన ఈటి లో విలన్ గా అవకాశం మిస్ చేసుకున్నాను. ఇక మీదట, అలాంటి అవకాశాలు వస్తే వదులుకొను. ఈ మధ్యనే తమిళ్ లో హీరో గా ఒక ఫిల్మ్ కి సైన్ చేశాను. పైగా నాకు అన్ని ల్యాంగ్వేజ్ లు వచ్చు. అది నాకు అడ్వాంటేజ్ గా ఫీల్ అవ్వుతాను. సో, సౌత్ లో ఏ ల్యాంగ్వేజ్ అయ్యిన సినిమా చెయ్యడానికి నేను రెడీ.
ఫ్యూచర్ లో “డైరెక్టర్” గా చేసే ఆలోచన ఉందా?
100 పైపర్స్ అని ఒక సినిమా కథ రాసుకున్న. ఆ సినిమా కి నేను డైరెక్ట్ చేద్దామని అనుకుంటున్నాను. త్వరలోనే ఆ సినిమా సెట్స్ మీద కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను.