సినిమా టైటిల్: క్రేజీ ఫెలో
నటీనటులు: ఆది సాయి కుమార్, దిగంగనా సూర్యవన్షి, మిర్నా మీనన్, నర్రా శ్రీనివాస్, సప్తగిరి, అనీష్ కురువిల్లా, వినోదిని వైద్యనాథ్ తదితరులు
ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల
సంగీతం: ఆర్ఆర్ ధృవన్
సమర్పణ: లక్ష్మీ రాధామోహన్
నిర్మాత: కె.కె. రాధామోహన్
రచన, దర్శకత్వం: ఫణికృష్ణ
విడుదల తేదీ: అక్టోబర్ 14, 2022
వరుస ఫ్లాప్స్ తో సతమతమవ్వుతున్న యంగ్ టాలీవూడ్ హీరో “ఆది సాయి కుమార్”. నటన లో ప్రేక్షకుల మన్ననలు పొందిన, సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో “క్రేజీ ఫెలో” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆది సరసన ఫస్ట్ టైమ్ దిగంగనా సూర్యవన్షి, మిర్నా మీనన్ ఇద్దరు ముద్దుగుమ్మలు నటించారు. కొత్త దర్శకుడు ఫణికృష్ణ వినూత్నమైన ప్రేమ కధాంశంతో తెరకెక్కిన్న ఈ సినిమా కి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కె.కె. రాధామోహన్ నిర్మాత గా వహించారు. ఈ క్రేజీ ఫెలో కి ఈ సారైనా హిట్ వరించిందా? తెలుసుకోవాలి అంటే కథలోకి వెళ్లాలిసిందే?
కథ: అభిరామ్ (ఆది సాయి కుమార్) సరదా గా ఉండే క్యారెక్టర్. చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు మరణించగా అన్నావదినలు పెంచుతారు. అభిరామ్ ఫ్రెండ్స్ తో సాగే సరదా అలవాట్లు ఎక్కువయ్యే సరికి, తమ్ముడిని దారిలో పెట్టాలని స్నేహితుడి కంపెనీలో ఉద్యోగానికి పంపిస్తాడు. కంపెనీ లో బెస్ట్ ఎంప్లాయ్ అయ్యిన మధుమిత (దిగంగనా సూర్యవన్షి) ను చూస్తాడు. కంపెనీ లో ఎప్పుడైతే ఒకరికి ఒకరు ఎదురు పడ్డారో అప్పటి నుంచి గొడవ పడుతూనే ఉంటారు. ఈ గ్యాప్ లో (నాని అలియాస్ అభిరామ్) డేటింగ్ యాప్ ఛాటింగ్ ద్వారా పరిచయమైన చిన్ని (మిర్నా మీనన్) అనే అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. ఆ విషయం తెలిసిన చిన్ని కుటుంభ సభ్యులు గెంటేయడంతో నాని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఈ విషయం తెలిసిన అభిరామ్ అన్నయ్య(అనీష్) తెలివి తేటలతో ఇద్దరు కుటుంభాలని కలిపి పెళ్లి దాకా తీసుకొస్తాడు. అభిరామ్ & మిర్నా మీనన్ పెళ్లి జరిగిందా? అసలు చిన్ని మధుమిత అని తెలుసుకున్నాడా? ఒకవేళ తెలిస్తే ఇద్దరిలో ఎవ్వరిని పెళ్లి చేసుకున్నాడు? ఎంతగానో ఇష్టపడే అన్న & వదిన మాట కాదని మధుమిత ని వదులుకున్నాడా? ఇవ్వన్నీ తెలుసుకోవాలి అంటే మీరు సినిమా థియేటర్ లో చుడాలిసిందే.
కధనం, విశ్లేషణ: టాలీవుడ్ దిగ్గజ నటుడు సాయి కుమార్ కుమారుడు ఆది సాయి కుమార్. వరుస పెట్టి సినిమాలు చేస్తున్న హిట్ లేదనే కొరత అలాగే ఉండిపోయింది. ఆది ఎప్పటి లాగే రొటీన్ కథ ఎంచుకోవడం, ‘క్రేజీ ఫెలో’ లాంటి ఓల్డ్ టైటిల్ పెట్టడం సినీ ప్రేక్షకుల ని కొంచెం కలవరపెట్టింది ఇదంతా, సినిమా కి ముందు…మరి సినిమా రీలిజ్ అయ్యిన తరువాత మాట ఏంటో తెలుసుకుందాం?
‘క్రేజీ ఫెలో’ – ఈ జెనరేషన్ పిల్లలు యవ్వనంలో ఉన్నప్పుడు కనిపించే వ్యక్తులు కన్నా, కనిపించని వ్యక్తుల ప్రేమ కి దగ్గరవ్వటం. ఆ ప్రేమ ని పొందే క్రమంలో అతిగా ప్రేమించటం, ఊహించేసుకోవటం. ఆ ప్రాసెస్ లో చేసే మిస్టేక్స్ ఎదురయ్యే ఇబ్బందులే ఈ సినిమా.
ఇలాంటి కథలు ఇంతక ముందు రానే వచ్చాయి అందులో కొన్ని హిట్ అండ్ ఫ్లాప్స్ కూడ ఉన్నాయి. మరి ఈ సినిమా హిట్ – ఫట్టా అనేది తెలుసుకుందాం?
‘క్రేజీ ఫెలో’ ఫస్టాఫ్ కామిడి కి పెద్ద పీట వేశారు. ఆది & దిగంగనా సూర్యవన్షి ఇద్దరి మధ్య సాగే సన్నివేశాలు బాగుంటాయి. నర్రా శ్రీనివాస్, సప్తగిరి ఇద్దరితో సాగే కామిడి ట్రాక్ సూపర్బ్. ఆది సిచ్యువేషన్ కి తగ్గట్టుగా కొటేషన్స్ తో ఉండే టి షర్ట్స్ వెయ్యడం, ఫ్రెండ్ మ్యారేజ్ లో చెప్పే భారీ లెన్త్ డైలాగ్ యూత్ ని బాగా ఆకట్టుకుంటాయి. వినోదిని & ఆది ఇద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్ సినిమాకి హైలైట్. ముఖ్యంగా, సెకండ్ ఆఫ్ లో మ్యారేజ్ జరుగుతున్నప్పుడు ఆది ఇచ్చిన షాక్ కి, వినోదిని(వదిన) గారు ఇచ్చిన రిప్లై అదుర్స్. ఆమె డబ్బింగ్ మొదట కొంత ఇబ్బంది పెట్టిన, ఆ తరువాత కామెడీ జనరేట్ అయ్యే విధానం బాగుంటుంది. ఎవ్వరు ఊహించని విధంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది.
సెకండ్ ఆఫ్ లో మిర్నా తో జరిగే సీన్స్ బాగున్నా, బలమైన ఎమోషన్స్ ఇంకా చూపించి ఉంటె బాగుండేది. లవ్, ఎమోషన్స్, క్లైమాక్స్ కూడా రొటీన్ అనిపించడం. కాకపోతే సినిమాలో ఆది సాయి కుమార్ లుక్, న్యూ కాస్టింగ్, కామెడీ టైమింగ్ ప్లస్ అయ్యింది. అలాగే కథను కామెడీతో మిక్స్ చేసి చెప్పడం బావుంది, కథకు తగినట్టు పాటలు కుదిరాయి.
నటి నటుల పెర్ఫామెన్స్: ఎప్పటి లాగే హీరో ఆది మంచి నటన కనబర్చారు. ఈ సినిమా సక్సెస్ కొంత మేరకు ఆది కి ఊరటనిస్తుంది అనుకోవచ్చు. హీరోయిన్ దిగంగనా సూర్యవన్షి నటన చాలా హోమ్లీ గా ప్రేక్షకుల ని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా, సాల్సా డ్యాన్స్ అద్భుతంగా చేసిందనే చెప్పాలి. మిర్నా మీనన్ తొలి పరిచయం తోనే చబ్బీ & క్యూట్ యాక్టింగ్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ ని తన వైపు తిప్పుకుంది. ఇకపోతే, వదిన క్యారెక్టర్ చేసిన వినోదిని సెంటర్ ఆఫ్ ది ఎట్ట్రాక్షన్ గా నిలిచింది. సప్తగిరి, నర్రా శ్రీనివాస్, అనీష్, పవన్, ప్రియా హెగ్డే తదితరులు తమ పాత్ర మేరకు బాగా రాణించారు.
సాంకేతిక విభాగం: కామిడి, డైలాగ్స్, మేకింగ్ లో చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమాని గట్టెక్కించడంలో సక్సెస్ అయ్యాడు కొత్త దర్శకుడు “ఫణికృష్ణ”. కాకపోతే సినిమాలో అక్కడక్కడ వచ్చే కొన్ని సన్నివేశాలకి ఎడిటర్ పని చెప్పి ఉంటె బాగుండేది. ఆర్ఆర్ ధృవన్ మ్యూజిక్ పర్వాలేదు అనిపించాడు. డీఓపీ పని తీరు బాగుంది. సినిమాలో హీరో & హీరోయిన్ కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా బాగానే ఖర్చు పెట్టారు.
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: గట్టెక్కిన “క్రేజి ఫెలో”
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్