చిత్రం: లైఫ్ ఆఫ్ ముత్తు
నటి నటులు: శింబు, సిద్ది ఇద్నానీ, రాధిక, నీరజ్ మాధవ్ తదితరులు..
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
ఛాయాగ్రహణం: సిద్ధార్ధ్ నుని
ఎడిటర్: ఆంథోని
నిర్మాత: ఇషారి కె.గణేష్
బ్యానర్: వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్
కథ: బీ జయమోహన్
దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్
విడుదల తేదీ: సెప్టెంబర్ 16, 2022
గ్యాంగ్ స్టర్ డ్రామాగా శింబు-గౌతమ్ మీనన్ టెర్రిఫిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం “ది లైఫ్ ఆఫ్ ముత్తు”. ఈ చిత్రం తమిళంలో రీలిజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని, తెలుగులో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ రెహమాన్ సంగీతం, గౌతమ్ మీనన్ టేకింగ్. తమిళ డబ్బింగ్ చిత్రం ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
నిడుదవోలు గ్రామానికి చెందిన “ముత్తు” తన తల్లి(రాధికా) కుటుంబం కోసం ముంబై కి వెళ్ళాలి అనుకుంటాడు. ప్రయాణం చేసే ఒకరోజు ముందు మేనమామ సూసైడ్ చేసుకోగా, ఒక్కడే ముంబై నగరానికి వెళ్తాడు. పరోటాలు చేసే హోటల్‌లో ఉద్యోగంమే కాకుండా, ఆజ్ఞాపిస్తే హత్యలు కూడ చేయాలనీ తెలుసుకుంటాడు. ఈ క్రమంలో పావని (సిద్ది ఇద్నానీ) ప్రేమలో పడతాడు. ఆ హోటల్ నుంచి ముత్తు తిరిగి ఇంటికి వెళ్ళిపొయ్యే సమయంలో హోటల్ లో విధ్వసం జరుగుతుంది. ఆ విధ్వంసం నుంచి “ముత్తు” బయట పడ్డాడా? లేదంటే విధ్వంసాన్ని ఎదిరించి గ్యాంగ్‌స్టర్‌గా మారాడా అనేది కధ?
కధనం,విశ్లేషణ: గ్యాంగ్ స్టర్ బ్యాక్డ్రాప్ లో తెలుగు లో రీలిజ్ అయ్యిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ గ్యాంగ్ స్టర్ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యాడా? ముంబై మాఫియాకి చెందిన కర్జి, కుట్టుభాయ్ రెండు వర్గాల మధ్య పోరులో శింబు ఎదురుకున్న సమస్యలు ఏంటి ఆ సమస్యల్ని ఎలా ఎదిరించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా కథ.
సినిమా ఓపెనింగ్ చాలా ఇంట్రస్టింగ్ గా సాగుతుంది. మాఫియా డాన్ కర్జి మీద జరిగిన ఎటాక్ కుట్టుముక్కుల చేయించాడని అందరు డౌట్ పడతారు. ఆ సమయంలో ఇంటి దగ్గర ఉన్న కుట్టుముక్కుల(ముత్తు మేనమామ) ప్రెజర్ తట్టుకోలేక ఉరేసుకొని చనిపోతాడు. ముత్తు ఫ్యామిలీ ది ఒక సాధారణమైన జీవితం. ఆ జీవితం నుంచి బయట పడి, అనుకోకుండా కుట్టుముక్కుల లెటర్ ద్వారా ముంబై మాఫియా ఉచ్చు లో పడతాడు. తొలి భాగం కాస్త బోర్ కొట్టిన, శింబు ఎమోషన్స్ & వేరియేషన్స్ బాగా ఆకట్టుకుంటాయి. పరోటా హోటల్ లో పాప మీద జరిగే ఎమోషనల్ సాంగ్ బాగుంటుంది. అక్కడక్కడ హోటల్ లో వచ్చే సన్నివేశాలు ట్రిమ్ చేస్తే బెటర్‌గా ఉండే అవకాశం ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో మాఫియా ఉచ్చు నుంచి బయట పడదాం అనుకున్న ముత్తు సడన్ గా గ్యాంగ్ స్టర్ గా మారడం ప్రేక్షకుడిని కొత్త అనుభూతిని కలిగిస్తాయి.
దర్శకుడు గౌతమ్ మీనన్ శింబును కొత్తగా చూపించిన విధానం బాగుంది. ఫస్టాప్‌ను కాస్త బోరింగ్ గా సాగిన సెకండాఫ్‌పై పట్టు సాధించిన విధానం బాగుంది. లైఫ్ ఆఫ్ ముత్తు అంటే మొదటగా గుర్తొచ్చేది శింబు విభిన్నమైన నటన, తన కెరీర్‌లో ది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. సిద్ది ఇద్నానీకి స్క్రీన్ మీద చూసినంత సేపు, జూనియర్ సమీరా రెడ్డి గుర్తుకు రావలిసిందే. శింబు కి సిద్ది ఇద్నానీకి మధ్య వచ్చే సాంగ్స్ లిప్ సింక్ చేసిన విధానం, అలాగే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ప్రేక్షకులు శ్రీధరన్ పాత్ర ని ఇలా ఉంటుందా అని ఎవ్వరు ఎక్సపెక్ట్ చేయరు. అతను స్క్రీన్ మీద ఉన్నంత సేపు ఏదైనా విధ్వంసం జరుగుతుందేమో అని ఎక్సపెక్ట్ చేస్తారు. క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ అండ్ ట్విస్ట్ అందరిని ఆశ్చర్య పరుస్తుంది.
నటి నటుల పెర్ఫామెన్స్: అసలు ఈ సినిమాకి శింబు వెయిట్ తగ్గాలిసిన అవసరం కూడ లేదు. కానీ, వెయిట్ తగ్గి బాడీ ల్యాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు శింబు. ఈ సినిమాలో అతడు చేసిన వేరియేషన్స్ & ఎమోషన్ అద్భుతం. హీరోయిన్ సిద్ధి నిడివి తక్కువే అయ్యిన సటిల్డ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. శింబు తల్లి పాత్రలో రాధిక ఓదిగిపోయింది. డాన్ క్యారెక్టర్ లో నటించిన కర్జి, కుట్టుభాయ్ పాత్రల్లో రక్తికట్టించారు. తదితర ఆర్టిస్టులు కూడా బాగానే ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం: దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ గ్యాంగ్ స్టర్ కధ రెగ్యులర్ గా ఉన్న సీన్స్ ఎక్సపెక్ట్ చేయని విధంగా తెరకెక్కించడం లో సక్సెస్ అయ్యారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్, నేపధ్య సంగీతాన్ని సన్నివేశానికి తగ్గట్లు తీర్చిదిద్దారు. సిద్ధార్ద్ సినిమాటోగ్రఫీ లైటింగ్ మరియు ఆర్ట్ వర్క్, డి.ఐ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. సినిమాలో వచ్చే కొన్ని సీన్స్ ఎడిటింగ్ లో పదును పెట్టాలిసింది. స్క్రీన్ మీద లావిష్ గా ఉండే లోకెషన్స్ లెకపొయ్యిన ప్రొడక్షన్ వాల్యూస్ ఏ మాత్రం తగ్గలేదు.
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: సక్సెస్ బాటలో “ముత్తు”
Review By: Tirumalasetty Venkatesh