పాన్ ఇండియా స్టార్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి – హరీష్ ఈ చిత్రానికి దర్శకులు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు.
 
‘యశోద’లో సమంత గర్భవతిగా కనిపించనున్నారని టీజర్ ద్వారా చెప్పారు. గర్భిణీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో లేడీ డాక్టర్ ఆమెకు చెబుతుంటే… అందుకు విరుద్ధంగా ఆమె జీవితంలో ఘటనలు జరుగుతున్నట్లు టీజర్‌లో చూపించారు. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ డాక్టర్ రోల్ చేస్తున్నారు. టీజ‌ర్‌లో కంటెంట్ మాత్రమే కాదు, క్వాలిటీ అవుట్‌పుట్ కూడా ఉంది. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. లొకేషన్స్ అట్ట్రాక్ట్ చేశాయి. మణిశర్మ నేపథ్య సంగీతం ఉత్కంఠ పెంచింది. ఇందులో సమంత చాలా కొత్తగా కనిపించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ”జాతీయ స్థాయిలో అన్ని భాషల ప్రేక్షకుల నుంచి టీజర్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ లభించింది. జాతీయ స్థాయిలో దాదాపు 1400లకు పైగా థియేటర్లలో టీజర్ విడుదల చేశాం. సాధారణంగా థియేటర్లలో ట్రైలర్ విడుదల చేస్తారు… ఇన్ని థియేటర్లలో ఈ విధంగా టీజర్ విడుదల చేయడం ఇదే ప్రథమం. థియేటర్లలో, సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. సమంత నటన, చిత్ర నిర్మాణ విలువల గురించి మాట్లాడుతుంటే సంతోషంగా ఉంది. సమంత ఎంతో అకింత భావంతో యాక్షన్ సీన్స్ చేశారు. ఇదొక సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్. కథా పరంగా ఇంత వరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ ఇది.  టీజ‌ర్‌కు మించిన థ్రిల్ థియేటర్లలో ఇస్తుంది. సాంకేతికంగా ఎక్కడా రాజీ పడకుండా, ఖర్చుకు వెనుకాడకుండా భారీ నిర్మాణ వ్యయంతో 100 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశాం. డబ్బింగ్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఎఫెక్ట్స్, రీ రికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్రాన్ని పూర్తిగా సిద్ధం చేస్తున్నాం. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం” అని చెప్పారు.

సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి  సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: చంద్రబోస్,రామజోగయ్య శాస్త్రి, కెమెరా: ఎం. సుకుమార్,  ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, దర్శకత్వం: హరి – హరీష్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.

Leave a comment

error: Content is protected !!