బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్దాదాస్ మాయ అనే సైకియాట్రిస్ట్‌ (మానసిక వైద్య నిపుణురాలు) చుట్టూ తిరిగే కథతో ఆధ్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమే “అర్థం”. మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్దాదాస్ ప్రధాన పాత్రలో ‘దేవి’, ‘పెదరాయుడు’ చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ మహేంద్రన్, అమని, అజయ్, ఈటీవీ ప్రభాకర్, జబర్దస్త్ రోషిణి, లోబో, నందా దురైరాజ్, సాహితి నటీ నటులుగా ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి దర్శకత్వంలో డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్‌ కథగా తెరకెక్కిన ఈ సినిమాను తమిళం, తెలుగు భాషల్లో రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.అలాగే మళయాళ, కన్నడ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయ బోతున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ మ్యూజికల్ టీజర్‌ సూపర్ రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమా మ్యూజికల్ రైట్స్‌ని టిప్స్ ఫిల్మ్స్ & మ్యూజిక్ చేజిక్కించు కుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ చివరి వారంలో విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ఒక ప్రముఖమైన హోటల్ లో చిత్ర టీజర్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా

బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్దా దాస్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నిటికంటే ఈ సినిమా నాకు స్పెషల్..ఇలాంటి హార్రర్ మూవీలకు వి. యఫ్. ఎక్స్ ఇంపార్టెంట్.డి ఓ పి పవన్ గారు నన్ను చాలా అందంగా చూయించారు. దర్శకుడు మణికాంత్ గారు, మరియు నిర్మాతలు చక్కని కథను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమాను చాలా చక్కగా తెరకేక్కించారు.ఈ మూవీ లో గ్లామర్ రోల్ లో సైకరియటిస్ట్ గా నటించాను. ఇందులోని నా పాత్ర చాలా కు స్పెషల్ గా ఉంటుంది.. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో మంచి టీం తో నటించడం చాలా హ్యాపీ గా ఉందని అన్నారు.

చిత్ర నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ..ఇంతకుముందు నేను తీసిన నాటకం సినిమాకు అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు. అందరూ బాగా సఫోర్ట్ చేశారు .వి. యఫ్ ఎక్స్ లో అనుభవం ఉన్న మణికాంత్ తన ప్రొఫెషన్ ను పక్కనపెట్టి డైరెక్టర్ కావాలనే ప్యాషన్ తో ఉన్న తను చెప్పిన సైకలాజికల్ థ్రిల్లర్ కథ నచ్చడంతో ఈ సినిమాను కోవిడ్ టైమ్ లో స్టార్ట్ చేశాము..ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథాంశంతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. తెలుగులో ‘ఖైదీ’కి అద్భుతమైన మాటలు, పలు చిత్రాల్లో పాటలు రాసిన రాకేందు మౌళి మా సినిమాకి మాటలు, పాటలు రాశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ చక్కటి బాణీలు అందించారు” ఆర్ట్ డైరెక్టర్ మణి గారి చాలామంచి సెట్ వేశాడు . ఇందులో నటించిన వారందరూ ఆర్టిస్ట్ ల్లా కాకుండా ఫ్యామిలీ మెంబెర్స్ లా వర్క చేయడంతో సినిమా బాగా వచ్చింది..అజయ్ గారు, ఆమని గారు ఎంతో బిజీ ఉన్నా మా సినిమాకు డేట్స్ ఇచ్చారు వారికీ మా ధన్యవాదాలు. సుచిత్ర చంద్రబోస్ గారు చక్కని కోరి్యోగ్రఫీ చేశారు.అలాగే ఈ సినిమాకు ముగ్గురు ఫైట్ మాస్టర్ వర్క్ చేయడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ చివరి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత రాధికా శ్రీనివాస్ మాట్లాడుతూ..సైకలాజికల్ థ్రిల్లర్ కథకు వినోదం మేళవించి ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్న ఈ మూవీ కి సంహరించిన అందరికీ ధన్యవాదములు. ఇలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ తో మా సినిమాను బిగ్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు

కో ప్రొడ్యూసర్ సాయి దీప్ మాట్లాడుతూ..నాటకం సినిమా నుండి మా నిర్మాత శ్రీనివాస్ తో ట్రావెల్ అవుతున్నాను. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా నాటకం కంటే పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు మణికాంత్ తెల్లగూటి మాట్లాడుతూ…మా నాన్న ఒక సినిమా ఆపరేటర్. నేను ఈ రోజు ఈ స్టేజ్ పై ఉండడానికి మా నాన్నే ఇన్స్పిరేషన్. అర్థం అంటే ఏమిటి అనుకుంటున్నారు . కుటుంబ విలువలను కాపాడే, మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో మానవ సంబంధాలు గురించి ప్రతి ఒక్కరి రిలేషన్ గురించి ఇందులో చూయించడం జరిగింది .నిర్మాతకు సినిమా అంటే ఎంతో పిచ్చి. అత్యుత్తమ నిర్మాణ విలువలతో రాధికా శ్రీనివాస్ గారు సినిమా నిర్మించారు .డి. ఓ. పి.పవన్ మంచి అవుట్ పుట్ ఇచ్చారు.అర్జున్ రెడ్డికి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్ గారు ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమా కొరకు రాధికా శ్రీనివాస్ గారు ఎంతో కష్టపడ్డారు. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నిటికంటే శ్రద్దా దాస్ కు ఈ సినిమా మంచి టర్నింగ్ అవుతుంది.ఈ సినిమాకు పనిచేసిన .అజయ్, ఆమని, మహేంద్రన్ లతో పాటు నటించిన నటీనటులతో పాటు టెక్నీకల్ టీం ఇలా అందరూ ఈ సినిమా అని ఒన్ చేసుకొని వర్క్ చేసుకోవడం తో ఈ సినిమా బాగా వచ్చింది. అలాగే వి. యఫ్. ఎక్స్ టీం కూడా చాలా బాగా కష్టపడ్డారు.. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలని అన్నారు.

నటుడు మాస్టర్ మహేందర్ మాట్లాడుతూ.. కొంతమంది నిర్మాతలు మంచి కాన్సెప్ట్ సినిమాలు సెలెక్ట్ చేసుకొని తీసిన చిన్న చిన్న సినిమాలు పెద్ద హిట్ అయ్యి ఇండస్ట్రీ కి మంచి పేరు తెస్తాయి.. అలాంటి మంచి కాన్సెప్ట్ చిత్రాలు నిర్మించే నిర్మాత శ్రీనివాస్ గారని నమ్ముతున్నాను. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

డి. ఓ. పి.పవన్ మాట్లాడుతూ.. నా..కిలాంటి మంచి సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ మణి మాట్లాడుతూ.. సైకలాజికల్ థ్రిల్లర్‌ కథగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు

నటీ నటులు

మాస్టర్ మహేంద్ర, శ్రద్దా దాస్, అజయ్, ఆమని, సాహితీ అవంచ, నందన్ తదితరులు

సాంకేతిక నిపుణులు

నిర్మాత: రాధికా శ్రీనివాస్,
సహ నిర్మాతలు: శ్రీ సాయిదీప్ చాట్ల, వెంకట రమేష్, పవన్
రచన-కూర్పు-దర్శకత్వం: మణికాంత్ తెల్లగూటి
పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి,
ఛాయాగ్రహణం: పవన్ చెన్నా,
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
మాటలు-పాటలు: రాకేందు మౌళి,
నృత్యాలు: సుచిత్రా చంద్రబోస్,
పోరాటాలు: నందు – అంజి – డైమండ్,

Leave a comment

error: Content is protected !!