దేశ సరిహద్దుల్లో సైనికులు తమ ప్రాణాలకు తెగించి ఒక బాధ్యతతో పోరాడతారు.. అలాగే వారి సతీమణులు కూడా అంతే బాధ్యతతో కుటుంబాలను చూసుకొని రక్షణగా నిలుస్తారు.. మరి అలాంటి తరుణంలో భార్యలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు.. అనే సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న చిత్రం “భారత్ కీ నారీ”. ఎం.డి. నజీర్ ఉద్దీన్ హీరోగా సీతా మహాలక్ష్మీ హీరోయిన్ గా అఖిల్ గంధం సమర్పణలో డి యస్ ఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ దర్శకుడు డి యస్ రాథోడ్ దర్శకత్వంలో యం డి. నమీర్ ఉద్దీన్ అహ్మద్ తెలుగు హిందీ భాషల్లో “భారత్ కీ నారీ” చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఆగస్ట్ 15 ఆజాధికా అమృత్ మహోత్సవ్ 75వ స్వాతంత్రం దినోత్సవం సందర్బంగా భారత్ కీ నారీ చిత్రం మోషన్ పోస్టర్ ని లాంఛ్ చేశారు.. ఈ కార్యక్రమం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో చిత్ర యూనిట్ సమక్షంలో ఘనంగా జరిగింది.. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ ముఖ్య అతిధిగా విచ్చేసి “భారత్ కీ నారీ” చిత్రం మోషన్ పోస్టర్ లాంఛ్ చేయగా మరో అతిధి కల్నల్ రామారావు చిత్రం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ కార్యక్రంలో హీరో యం. డి. నజీర్ ఉద్దీన్, హీరోయిన్ సీతా మహాలక్ష్మీ, దర్శకుడు డి.యస్. రాథోడ్, కాన్సెప్ట్ రైటర్ సుభద్ర రెడ్డి, డిఓపి. జగన్మోహన్, రచయితలు మహేందర్, మారి ప్రావీణ్కుమార్, ముఖ్య అతిధులు లెఫ్ట్నెంట్ కల్నల్ రామారావు, బెక్కం వేణుగోపాల్, చిత్రం నిర్మాత యండి. నమీర్ ఉద్దీన్ అహ్మద్, సంగీత దర్శకుడు మనీష్ కుమార్, పాల్గొన్నారు.. అనంతరం ఏర్పాటైన ప్రెస్ మీట్ లో..
సక్సెస్ ఫుల్ నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ” రీసెంట్ గా ఓటీటి ప్లాట్స్ ఫామ్స్ వచ్చాక కొత్త కంటెంట్స్ తో మంచి చిత్రాలు వస్తున్నాయి.. అలా ఎంతో మంది దర్శకులు తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్నారు. ఆకోవలో డిఎస్ రాథోడ్ కూడా చేరాలి.. సరికొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాడు.. మిలటరీ బాక్డ్రాప్ లో చాలా చిత్రాలు వచ్చాయి. ఎమోషనల్ ఫ్యామిలి ఎంటర్టైన్మెంట్స్ తో ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. డెఫినెట్ గా ఈ చిత్రం మంచి హిట్ అవుతుంది.. అవ్వాలని ఆశిస్తున్నాను.. భారత్ కి నారి వంటి మంచి కంటెంట్ ను ప్రేక్షకులకు చూపించాలని దర్శకుడు డి. యస్. రాథోడ్ ఒక చక్కని ప్రయత్నం చేశాడు.. ఈ సినిమా చిత్ర యూనిట్ అందరికీ బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అన్నారు.
దర్శకుడు డి. యస్. రాథోడ్ మాట్లాడుతూ.. “దేశ బార్డర్ లో సైనికులు ఏవిధంగా దేశాన్ని కాపాడడానికి బాధ్యత వహిస్తారో అదేవిధంగా తమ సతీ మణులు ఒంటరిగా వుంటూ తమ కుటుంబాన్ని కూడా అంతే బాధ్యత గా చూసుకుంటారు.
ప్రేమ, దేశ భక్తి వంటి కాన్సెప్ట్ తో మిలితమైన ఈ చిత్రాన్ని దేశ సైనుకుల సతీమణులకు, మరియు తల్లి తండ్రులకు అంకితం చేస్తున్నాము.. సెంటిమెంట్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా భారత్ కీ నారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.. ఇప్పటిదాకా యాభై శాతం షూటింగ్ పూర్తయింది. ఈ నెలాఖరుకు షూటింగ్ పూర్తిచేసి సెప్టెంబర్ చివరిలో సినిమాని రిలీజ్ చేస్తాం.. అన్నారు.
కథా రచయిత తెలుగు మహేందర్ అండ్ మారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ- “ఈ మూవీ దేశ భక్తి గురించి.. సైనికుల భార్యల గురించి ఉంటుంది. యువతకు దేశభక్తిని పెంపొందించే ఒక మంచి సందేశాత్మక సినిమా.. ఇది. ఇందులో స్త్రీలకు ఉన్న శక్తిని వెలికి తీసే టటువంటి కథను బాగా చేయించారు. ఇది అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.. అన్నారు.
కాన్సెప్ట్ రైటర్ సుభద్ర రెడ్డి మాట్లాడుతూ- “మూడు సంవత్సరాల క్రితం నేను ఈ కాన్సెప్ట్ రాయడం జరిగింది. దర్శకులు డి. యస్. రాథోడ్ గారు ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్లుగా మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం చాలా సంతోషంగా ఉంది.. అన్నారు.
హీరో యండి. నజీరుద్దీన్ మాట్లాడుతూ- ” మిల్ట్రీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాకాశం కల్పించిన దర్శకుడు రాథోడ్ కి నా థాంక్స్. సినిమా చాలా బాగా చేస్తున్నారు. ఫస్ట్ లుక్ ఎక్సలెంట్ గా ఉంది. మిలటరీ ఆఫీసర్ గా నటించడం చాలా హ్యాపీగా ఉంది.. అన్నారు.
హీరోయిన్ సీతా మహాలక్ష్మి మాట్లాడుతూ- ” సుభద్ర రెడ్డి మేడం రాసుకున్న మంచి కథకు రాథోడ్ గారు కమర్షియల్ అంశాలు జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నా మీద నమ్మకంతో దర్శక,నిర్మాతలు నన్ను నమ్మి నాకీ అవకాశం ఇచ్చారు. వారికి నా ధన్యవాదములు.. అన్నారు.
లెఫ్టినెంట్ కల్నల్ రామారవు మాట్లాడుతూ-” మిల్ట్రీ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు. రాథోడ్ కథ చెప్పగానే చాలా థ్రిల్ అయ్యాను. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.