• చిత్రం: 1948 అఖండ భారత్

నటి నటులు: ఆర్య వర్ధన్ రాజ్, అలేఖ్య శెట్టి, ఇంతియాజ్ ఖాన్, రఘునందన్

ఎడిటర్: రాజు జాదవ్

సినిమాటోగ్రాఫర్: చంద్రశేఖర్

మ్యూజిక్ డైరెక్టర్: ప్రజ్వాల్ క్రిష్

బ్యానర్: ఎం.వై.ఎం క్రియేషన్స్

నిర్మాత: మహర్షి

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: డాక్టర్ ఆర్య వర్ధన్ రాజ్

దర్శకత్వం: ఈశ్వర్ బాబు దూలిపుడి

ఆర్య వర్ధన్ రాజ్, అలేఖ్య శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 1948 అఖండ భారత్. ఎం.వై.ఎం క్రియేషన్స్ బ్యానర్ లో మహర్షి నిర్మాత గా, ఈశ్వర్ బాబు దూలిపుడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇండియా కి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్మ గాంధీ ని ఎందుకు చంపాలిసి వచ్చింది అనే కోణంపై ఈ సినిమా ను తెరకెక్కించారు. ఈ వారం థియేటర్ లో రీలీజైనా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో తెలుసుకుందాం?

కథ: మహాత్మ గాంధీ స్ఫూర్తి తో స్వాతంత్య్ర పోరాటాల్లో పాల్గోనే “నాథురాం గాడ్సే” ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. పాకిస్థాన్ & ఇండియా కి విభజన తరువాత పాకిస్థాన్ లో చాలా మంది హిందూ కుటుంబాన్ని అణిచి వేయటం, వేళ మంది ఆడవాళ్ళు రేప్ కి గుర్రవ్వటం, పాకిస్థాన్ పట్ల గాంధీ తీసుకునే సిద్ధాంతాలు దేశ భవిష్యత్తు కి ప్రమాదకరం అని అలోచించి గాంధీ కి వ్యతిరేకం అయ్యాడు నాథురాం గాడ్సే. నాథురామ్ గాడ్సే అతని బృందం నారాయణ ఆప్టే, విష్ణు కర్కరే, గోపాల్ గాడ్సే, మదన్ లాల్, కలిసి ఎలా గాంధీ ని హత్య చేశారనేది కథ.

కథ, కథనం: గాంధీ హత్యకు దారితీసిన పరిస్థితులే ఈ చిత్రం. కోర్టులో గాడ్సే చేసిన వాదనలే ఈ సినిమాకు ఆధారం. గాంధీ గురించి చరిత్రలో దాగివున్న కొన్ని వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసారు టీం యూనిట్. ముందుగా ఇలాంటి కథ ని తీసుకొన్నందుకు టీం అందరికి హ్యాట్సాఫ్. మహాత్మ గాంధీ స్ఫూర్తి తో స్వాతంత్య్ర పోరాటాల్లో పాల్గోన్న “నాథురాం గాడ్సే” ఎందుకు వ్యతిరేకిగా మారి చంపారు అనేది కథ.

ఇద్దరు భిన్నా అభిప్రాయాలు ఉన్న రచయితల ప్రేమ “పెళ్లి” గా మారాలి అంటే, గాంధీ గురించి ఒక బుక్ రాయాలిసి వస్తుంది. దాంతో, ఒక్కొక్కటి గా గాంధీ ని చంపినా బృందం తో మాట్లాడి నిజా నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో గాంధీ వళ్ళ దేశ భవిష్యత్తు పాతాల్లోకి వెళ్ళిపోతుందని గ్రహించి నాథురామ్ గాడ్సే అతని బృందం కలిసి గాంధీ చంపేస్తారు. ఆర్య వర్ధన్ రాజ్ (నాథురాం గాడ్సే) గా కథ ని నడిపించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అతని కళ్ళల్లో ఎంతో ఇంటెన్సిటీ, కాన్ఫిడెన్స్ ఉంటుంది. మహాత్మా గాంధీగా రఘునందన్ బాగా పెర్ఫామ్ చేసారు. ఇలాంటి కథ కి ఇంకాస్త బడ్జెట్ పెట్టి లావిష్ గా తీస్తే సినిమా మరో స్థాయిలో ఉండేది.

ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ ల్యాగ్ లేకుండా ప్రతి సీన్ అద్భుతంగా తీర్చిదిద్దారు. సెకండ్ ఆఫ్ లో గాంధీ ని చంపడానికి వేసిన ప్ల్యాన్ సగటు ప్రేక్షకుణ్ణి రక్తి కట్టించే విధంగా ఉంటాయి. అక్కడక్కడ కొంచెం స్లో అయ్యిన, స్టోరీ చాలా గ్రిప్పింగ్ గా రాసుకోవడం హైలైట్ అనే చెప్పాలి. సో, ఓవర్ ఆల్ గా ఇలాంటి సినిమా ని కుటుంబా సమెతగా చూడదగ్గ సినిమా.

నటి నటుల పెర్ఫామెన్స్: ఆర్య వర్ధన్ రాజ్ (నాథురాం గాడ్సే) గా ఓదిగిపోయాడు. అలేఖ్య శెట్టి (హీరోయిన్) ఒక రచయత గా నటన బాగుంది. ఇంతియాజ్ ఖాన్, రఘునందన్, సమ్మెత గాంధీ తదితర కాస్టింగ్ తమ పరిధి మేరకు బాగా రాణించారు.

సాకేంతిక విభాగం: ఇలాంటి సినిమా కథ ని స్క్రీన్ మీద బాగా హ్యాండిల్ చేసి ప్రేక్షకుల దాకా తీసుకొచ్చినందుకు డైరెక్టర్ ఈశ్వర్ బాబు దూలిపుడి కి హ్యాట్సాఫ్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఆర్య వర్ధన్ రాజ్ చాలా బాగా రీసర్చ్ చేసి సక్సెస్ఫుల్ గా తనవంతు కృషి చేసాడనే చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వాల్ క్రిష్ తన పరిధి మేరకు బాగా రాణించారు. చంద్రశేఖర్ డీఓపీ పని తీరు అద్బుతంగా ఉంది. ఎడిటర్ రాజు జాదవ్ పని తీరు బాగున్నా అక్కడక్కడ వచ్చే సన్నివేశాలు కొంచెం కత్తేరా పెట్టాలిసింది. ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గినప్పటికీ ఉన్నంత వరుకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండ చేసారని అర్ధమవ్వుతుంది.

రేటింగ్: 3.5/5

బాటమ్ లైన్: శభాష్ అనిపించిన “1948 అఖండ భారత్”

Leave a comment

error: Content is protected !!