యమ్ .యమ్ ప్రోడక్షన్ బ్యానర్ పై హీరో సుమన్ , అక్సాఖాన్ , శ్రీను ప్రధాన పాత్రధారులుగా మను తెరకెక్కిస్తున్న చిత్రం సిద్దన్న గట్టు. ఎన్ శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుద్రవరం జెబి , మధు , మహేష్ , మెహాబూబ్ , మీనాక్షీ రెడ్డి , వెంకట్రాముడు చిన్ననరసింహులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.. ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లాంచ్ హైద్రాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది..ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లాంచ్ కి ముఖ్య అథితులుగా హజరైన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ , నిర్మాత రామసత్యనారాయణ చిత్రయూనిట్ ను అభినందించారు…అనంతరం
హీరో సుమన్ మాట్లాడుతూ – సిద్దన్న గట్టు చిత్ర దర్శకనిర్మాతలు కొత్తవాళ్లైన చాలా బాగా తీశారని అన్నారు..ఆ టీమ్ అందరికి మంచి భవిష్యత్ ఉందని అన్నారు.. ఈ కథ రాయలసీమ నేపధ్యంలో నడుస్తోందని, తన ఏజ్ కి , ఇమేజ్ కి తగ్గట్టు పాత్రను డిజైన్ చేశారని తెలిపారు.. కొత్త ఆలోచనలతో వస్తున్న యంగ్ టాలెంట్ ను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు…
చిత్ర దర్శకుడు మను మాట్లాడుతూ – పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రవర్తన ఎలా ఉండాలనే కథాంశంతో సిద్దన్న గట్టు చిత్రం రూపోందించామని అన్నారు.. ఈ సినిమా ప్రతి తల్లిదండ్రులకు నచ్చుతుందని తెలిపారు.. ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న సుమన్ గారు ఎంతో సపోర్ట్ గా నిలిచారని అన్నారు…కర్నూలు లో షూటింగ్ కి సపోర్ట్ చేసిన రవిందర్ రెడ్డి , టిజి భరత్ గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు…
నటీ అక్సాఖాన్ మాట్లడుతూ- సిద్దన్న గట్టు చిత్రంలో ఓ చాలెంజింగ్ పాత్ర చేశానని అన్నారు..ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు..సీనియర్ నటులు సుమన్ గారి తో నటించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.. అంతేకాకుండా తన బర్త్ డే రోజే సిద్దన్నగట్టు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లాంచ్ కావడం సంతోషంగా ఉందని అన్నారు..
నేశినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ – మను చెప్పిన కథ నచ్చి సినిమా చెయ్యడానికి ముందుకొచ్చామని అన్నారు.. సుమన్ గారు , సినిమా టీమ్ అంతా బాగా సపోర్ట్ చేశారని అన్నారు..
వీరితో పాటు ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ కూడా పాల్గోన్నారు.
నటీనటులు – సుమన్ , ఆక్సాఖాన్ ,శ్రీను , రుద్రవరం జెబి, మధు , మహేష్ , మహెబూబ్ , మీనాక్షి రెడ్డి , నరసింహులు తదితరులు
బ్యానర్ – యమ్ యమ్ ప్రోడక్షన్స్
చిత్రం – సిద్దన్న గట్టు
కథ ,స్ర్కీన్ ప్లే , డైరెక్షన్ – మను
నిర్మాత – నేశినేని శ్రీనివాస్ రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్ – నాని జాన్
డైలాగ్స్ – వినోద్ వద్దిరాల
మేనేజర్ – చిన్న నరసింహులు