చిత్రం: టెన్త్ క్లాస్ డైరీస్
నటి నటులు: శ్రీరామ్, అవికా గోర్, శ్రీనివాస్ రెడ్డి, అచ్యుత రామారావు, అర్చన, హిమజ, శివబాలాజీ, నాజర్, నిత్య(చైల్డ్ ఆర్టిస్ట్),జెమినీ సురేష్, వేణు టీల్లు తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
దర్శకత్వం, ఛాయాగ్రహణం: ‘గరుడవేగ’ అంజి
నిర్మాతలు: అచ్యుత రామారావు, రవితేజ మన్యం, రవి కొల్లిపార
విడుదల తేది: జులై 1, 2022
ఒకరికి ఒకరు ఫెమ్ హీరో శ్రీరామ్, అవికా గోర్ ముఖ్య పాత్రలుగా, కొన్ని యధార్థ సంఘటనలతో ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం ప్రముఖ- సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి ఈ సినిమాతో దర్శకుడిగా తోలి పరిచయం. పి, రవితేజ మన్యం, అచ్యుత రామారావు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ శుక్రువారం రీలిజ్ అయ్యిన ‘టెన్త్ క్లాస్ డైరీస్’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో రివ్యూలో చూద్దాం.
కథ:
సోముయాజ్(శ్రీరామ్) అమెరికాలో టాప్ బిజినెస్ మ్యాన్, కొన్ని కారణాలు వళ్ళ కట్టుకున్న భార్య కూడ వదిలేస్తుంది. డబ్బు, లగ్జరీ, అమ్మాయిలు అన్నీ ఉన్నా కానీ జీవితంలో ఎదో కోల్పోయాను అనే బాధ. తాను పోగుట్టుకున్న హ్యాపీనెస్ ఏంటి? ఆ హ్యాపీనెస్ ఎక్కడుంది? అని వెతికే క్రమంలో, స్కూల్ టైమ్‌లో గాఢంగా ప్రేమించిన ఫస్ట్ లవ్ చాందిని(అవికా గోర్) దగ్గరుందని రిలైజ్ అవ్వుతాడు. ఈ వంకతో ఇండియా కి తిరిగి వచ్చి స్కూల్ ఫ్రెండ్స్ తో రీయూనియన్ అవ్వుతాడు కానీ చాందిని రాదు. అసలు చాందిని ఎందుకు రాలేదు? చాందినీని వెతికే క్రమంలో కొన్ని నిజాలు తెలుసుకుంటాడు సోముయాజ్(శ్రీరామ్). అసలు ఆ నిజాలు ఏంటి? చాందినీకి ఏమైంది? ఈ విషయాలన్నీ తెలియాలంటే ‘టెన్త్ క్లాస్ డైరీస్’కు సినిమా తప్పకుండ చుడాలిసిందే.
కధనం,విశ్లేషణ:
సినిమా కథ ని ఒక్క మాటలో చాలా గొప్పగా చెప్పారు దర్శకుడు ‘గరుడవేగ’ అంజి. ప్రేమికుడి నిర్లక్ష్యం, తండ్రి అతి ప్రేమ ఒక అమ్మాయి జీవితాన్నిఎలా నాశనం అయ్యింది అనేది కథ. మూవీ నిర్మాత అచ్యుత రామారావు లైఫ్‌లో తాను దగ్గర గా చూసిన రియల్ ఇన్సిడెంట్స్ ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు. ఇలాంటి కథ ని ఎంచుకోవడం విషయంలో టీం ని అభినందించాలి.
ప్రేమించిన అమ్మాయి కోసం ప్ల్యాన్ చేసిన రీయూనియన్ లో వచ్చే కొన్ని సీక్వెన్స్ లు ఇంతకుముందు రీలిజ్ అయ్యిన “త్రీ ఇడియట్స్”, “96`(జాను)”, “నా ఆటోగ్రాఫ్” వంటి చిత్రాలు గుర్తుకొస్తాయి. ఫస్టాఫ్ ఓపెనింగ్ లో వచ్చిన కొన్ని సీన్స్ బోరింగ్ అనిపించిన రీయూనియన్ స్టార్ట్ అయ్యాక గౌరవ్ నిర్మాత (అచ్యుత రామారావు), హాఫ్ బాయిల్ (శ్రీనివాస్ రెడ్డి) మధ్య వచ్చే సీన్లు బాగా ఆకట్టుకుంటాయి. వీరిద్దరి నటనతో ప్రేక్షకులు థియేటర్ లో పడి పడి నవ్వుకుంటారు. ఆవికా గోర్ చిన్నప్పటి పాత్రలో నటించిన ఓ మై గాడ్ గర్ల్ నిత్య పెర్ఫామెన్స్ తో ఎంతో అద్భుతంగా రాణించింది. పైగా, ఈ అమ్మాయికి పెద్ద హీరోయిన్ కి కావలిసిన ఫ్యూచర్స్ పుష్కలంగా ఉన్నాయ్. సోమయాజ్, చాందినీ మధ్య జరిగే ప్రేమ సన్నివేశాలు రొటీన్ గా ఉన్నప్పటికీ, సెకండాఫ్‌లో హీరోయిన్ కోసం వెతికే ట్రాక్ బాగుంటుంది. రీసెంట్ గా రెక్కీ వెబ్ సిరీస్ తో హిట్ కొట్టిన బాలాజీ, శ్రీరామ్. మళ్ళీ వీళ్లిద్దరు కలిసి ‘టెన్త్ క్లాస్ డైరీస్’ చిత్రంలో స్క్రీన్ స్పెస్ షేర్ చేసుకోవడం, బాలాజీ ముఖ్యమైన పాత్ర పోషించడంతో మరో హిట్ వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు. ఊహించని విధంగా క్లైమాక్స్ ఉండటం, క్లైమాక్స్ లో అవికా గోర్ చేసిన నటన మరో స్థాయికి తీసుకెళ్తుంది. అందరు అనుకోవచ్చు రొటీన్ లైన్ ఏ కదా అని, కానీ ఈ సినిమా చూస్తున్నంత సేపు కడుపుబ్బా నవ్వుకుంటారు ప్రేక్షకులు. అంతే కాదు, రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని చూపించిన విధానమే సినిమాకి ప్రధాన బలం.
నటి నటుల పెర్ఫామెన్స్: ఒకరికి ఒకరు మూవీ తరువాత (శ్రీరామ్) ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడనే చెప్పాలి. ఆవికా గోర్ స్క్రీన్ స్పెస్ నిడివి తక్కువే అయ్యిన నటన పరంగా ఎక్సట్రాడినరీ. శ్రీనివాస్ రెడ్డి(హాఫ్ బాయిల్) క్యారెక్టర్ థియేటర్ లో ప్రేక్షకుల కి కిక్ ఇస్తుంది. అచ్యుత రామారావు కామిడి స్లాంగ్ తో బాగా ఆకట్టుకుంటాడు. ఇకపోతే, అర్చన, హిమజ, నాజర్, నిత్య(చైల్డ్ ఆర్టిస్ట్) తమ క్యారెక్టర్ పరిధి మేరకు బాగా చేసారు. ముఖ్య పాత్రలో పోషించిన బాలాజీ అద్భుతంగా రాణించారు.
సాంకేతిక వర్గం: ప్రముఖ- సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి ఈ సినిమాతో ఫిఫ్టీ సినిమాలు కంప్లీట్ చేసుకొని, దర్శకుడిగా తోలి అడుగు వేశారు. రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని చూపించిన విధానం బాగుందనే చెప్పాలి కానీ, అక్కడక్కడ వచ్చే సీన్స్ మీద ఇంకా దృష్టి పెట్టి ఉంటె బాగుండేది. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి అదరకొట్టారు. ఛాయాగ్రహణం ‘గరుడవేగ’ అంజి ఈ సినిమాకి ఇచ్చిన విజ్యువల్స్ నెస్ట్ లెవెల్. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా గ్రాండియర్ గా చాలా ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: హృదయానికి తాకిన “టెన్త్ క్లాస్ డైరీస్”
Review By: Tirumalasetty Venkatesh