చిత్రం: కొండా
నటి నటులు: త్రిగున్, ఇర్రా మోర్, పృథ్వి రాజ్, ఎల్ బి శ్రీరామ్, తులసి శివమని
సంగీతం: బాలాజీ
ఎడిటర్: మనీష్ ఠాకూర్
ఛాయాగ్రహణం: మల్హర్ భట్ జోషి
నిర్మాత: సుష్మిత పటేల్
రచన, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
విడుదల తేదీ: జూన్ 23, 2022

కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కధ ఆధారంగా రూపొందిన సినిమా “కొండా”. ఈ సినిమా ని రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. కొండా మురళి పాత్రలో త్రిగుణ, ఇర్రా మోర్ నటి నటులు నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై సినిమా రూపొందింది. సుష్మిత పటేల్ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు విడుదలైనది. ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుందో లేదో తెలుసుకుందాం?

కథ: త్రిగున్(కొండా మురళి) తన కళ్ళ ముందు ఎలాంటి అన్యాయం జరిగిన ఎదురు తిరిగి పోరాటం చేసే వ్యక్తి. కొడుకు ఆవేశం చూసి తల్లి(తులసి శివమని) పై చదువులు కోసం కాలేజ్ కి పంపిస్తుంది. అక్కడ, ఇర్రా మోర్(కొండా సురేఖ) అనే అమ్మాయి తో లవ్ లో పడి పెళ్లి చేసుకుంటాడు. కాలేజ్ లో “ఆర్కే” అనబడే ఒక ఉద్యమ కారుడితో త్రిగున్(కొండా మురళి) చేతులు కలిపి సొసైటీ కి పట్టిన చీడ పురుగులని చంపుతారు. ఆ విధంగా కొండా మురళి కి ఫాలోయింగ్ పెరగడంతో, ప్రజల మంచి కోసం పృథ్వి రాజ్(పొలిటీషియన్) తో చేతులు కొలుపుతాడు. కొన్ని రోజులు తరువాత పృథ్వి రాజ్ కూడ సోసియేటి కి పట్టిన చీడ పురుగు అని తెలుసుకొని పోరాటం చేస్తాడు. ఒక సామాన్యుడు నుండి రాజకీయ నాయకుడు గా శక్తివంతంగా ఎలా ఎదిగాడు అనేది కధ.

కథనం, విశ్లేషణ:

ఈ చిత్రం ఒక యువకుడు వ్యవస్థకు వ్యతిరేకంగా వెళ్లడం, ఒక సామాన్యుడు నుండి రాజకీయ నాయకుడు శక్తివంతంగా ఎలా ఎదిగాడు అనేది కధ.  24 కిస్సెస్, www, మూవీస్ తో బాగా ఆకట్టుకున్న త్రిగున్ కొండా మూవీ తో తన లో ఉన్న యాక్షన్ ఇంటెన్సిటి తో బాగా చేసాడు.
ఇప్పటి వరకు త్రిగుణ్ చేసిన సినిమాల్లో లేని ఓ ఇంటెన్స్ యాక్టింగ్ ఇందులో చేసారనే చెప్పొచ్చు. పోలీస్ స్టేషన్ సీన్స్ లో ఐతే కళ్ల తోనే మెప్పించాడు. కొండా యాటిట్యూడ్‌ని డీసెంట్‌గా చూపిస్తూ సినిమా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ లో కొండాగా త్రిగుణ కాలేజ్ కుర్రాడు గా డీసెంట్ గా కనిపిస్తాడు. 30 ఇయర్స్ పృధ్వి మెయిన్ విలన్‌గా నటించి తన యాక్టింగ్ తో మెప్పించాడు. ఆటో రామ్ ప్రసాద్‌కి చాలా మంచి పాత్ర లభించింది కానీ పెద్దగా మెప్పించలేక పోయాడు . కొండా సురేఖగా నటించిన ఇర్రా మోర్ ఈ చిత్రానికి మేజర్ హైలైట్. ఆమె పాత్ర లో చాలా నిజాయితీ, అమ్మతనం కనిపిస్తుంటుంది. ఇర్రా మోర్ తనదయిన స్టైల్ యాక్టింగ్ తో అదరకొట్టింది. ఈ సినిమాలో వచ్చే లిరిక్స్ ఎంతో బాగున్న సరైన ఎలివేషన్స్ తో కూడిన బిజెఎం పడితే మరోలా ఉండేది.

RGV తన సినిమాల్లో కాస్టింగ్‌లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది . ఈ సినిమాలో కూడ మెయిన్ లీడ్ కి మంచి ఆర్టిస్ట్స్ నే సెలెక్ట్ చేసారు. ఐతే ఈ సినిమా లో పోలీసులు, నక్సల్స్, జూనియర్ ఆర్టిస్టులు విషయం లో కొంచెం జాగ్రత్త తీసుకొనింటే బాగుండు. సినిమాటిక్ లిబర్టీ తో చాలా సీన్స్ చేసినప్పటికి ఐతే కొన్ని సీన్స్ మాత్రం ఎంతో రియలిస్టిక్ గా తీసారు. ముఖ్యంగా నక్సలైట్స్ తో జరిగే ఫైట్స్ ఇక ఇంటర్వెల్ షాట్  కొండ పై జరిగే బుల్లెట్ ఫైర్ ఐతే మూవీ కే హైలెట్. 

నటి నటుల పెర్ఫామెన్స్: త్రిగున్(కొండా మురళి) గా పరకాయ ప్రవేశం చేసాడు. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో గా ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇర్రా మోర్(కొండా సురేఖ) ఎమోషన్స్ తో యాక్టింగ్ పర్వాలేదు అనిపించింది. ఇకపోతే తదితర ఆర్టిస్ట్ లు పృథ్వి రాజ్, ఎల్ బి శ్రీరామ్, తులసి శివమని తమ క్యారెక్టర్ మేరకు బాగా రాణించారు.

సాంకేతిక వర్గం: రామ్ గోపాల్ వర్మ మేకింగ్ లో కింగ్ అని అందరికి తెలుసు. ఇందులో కూడ తనదైన స్టైల్ ఆఫ్ ఫ్రేంస్ అండ్ ఎమోషన్స్ తో మెస్మరైజ్ చేసారు. ఐతే ఈ మ్యాజిక్ అక్కడక్కడే వర్కౌట్ అయ్యింది. రక్తి కట్టించే ఎలిమెంట్స్ తో ఇంకా బాగా తీసి ఉంటె బాగుండు అనిపిస్తుంటుంది.సినిమాలో అక్కడక్కడ కొంచెం ల్యాగుల విషయం లో ఎడిటింగ్ కి కొంచెం పని పెట్టాలసింది.మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ బీజీఎమ్ బాగానే కొట్టిన, ముఖ్యమైన సన్నివేశాలలో బిజెఎం రిజిస్టర్ అయ్యే విధంగా ఎక్కువ కేర్ తీసుకొని ఉంటె సినిమా మరో లెవెల్ లో ఉండేది. బట్ కొన్ని సీన్స్ లో మాత్రం మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యింది.డీఓపీ పనితనం పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

రేటింగ్: 2.75/5

బాటమ్ లైన్:  ఎమోషన్స్ తో ఫిదా చేసిన  “కొండా”

Review By : Tirumalasetty Venkatesh

Leave a comment

error: Content is protected !!