చిత్రం: “గాడ్సే”
నటి నటులు: సత్య దేవ్, ఐశ్వర్య లక్ష్మి, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, నాగబాబు కొణిదెల, ప్రియదర్శి, చైతన్య కృష్ణ తదితరులు
సంగీతం: శాండీ
ఛాయాగ్రహణం: సురేష్ ఎస్
నిర్మాత: సి కళ్యాణ్
రచన, దర్శకత్వం: గోపీ గణేష్ పట్టాభి
విడుదల తేదీ: జూన్ 17, 2022

మినిమమ్ గ్యారంటీ అండ్ టాలెంట్ ఉన్న హీరోల్లో నటుడు సత్యదేవ్ ఒకరు. బ్లఫ్ మాస్టర్ అందించిన గోపి గణేష్ తో మరోసారి కలిసి చేసిన చిత్రం “గాడ్సే”. మరి ఈరోజు రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పించిందో లేదో తెలుసుకుందాం రండి.

కథ:
వైశాలి(ఐశ్వర్య లక్ష్మీ) అసిస్టెంట్ పోలీస్ నెగోషియేషన్ డిపార్టుమెంట్ లో పని చేస్తుంటుంది. డ్యూటీ అంటే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమయ్యే వ్యక్తి. పెళ్లి చూపులు కూడ లెక్క చెయ్యకుండా, ఒక రాబరీ కేస్ ఆపరేషన్ లో ఇన్వాల్వ్ అవ్వుతుంది. దుర్దుష్టవస్థాత్తు ఒక హాస్టేజ్ నిండు గర్భిణి స్త్రీ ఆమె వళ్ళ చనిపోవడంతో వైశాలి రాజీనామా చేస్తుంది కానీ, అధికారులు యాక్సెప్ట్ చెయ్యరు. ఇంతలో, గాడ్సే (సత్యదేవ్) ఆకస్మికంగా కొంతమంది బడా వ్యక్తులను కిడ్ న్యాప్ చేస్తారు. దింతో ఒక్కసారిగా పోలీస్ వ్యవస్థ హై అలర్ట్ అవ్వుతుంది. ఈ కేసును వైశాలి(ఐశ్వర్య లక్ష్మి) టేకప్ చేస్తుంది. అసలు ఈ గాడ్సే ఎవరు? ఎందుకు ఇలా చేసాడు? తాను చేసిన డిమాండ్స్ ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.

కధనం,విశ్లేషణ:
సత్యదేవ్ సాలిడ్ పెర్ఫామెన్స్ తో గాడ్సే సినిమాలో మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో నటనతో పాటు స్టైలిష్ లుక్స్ తో అదరకొట్టారు. అంతేకాదు, తన పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీ తో థియేటర్ లో క్లాప్స్ కొట్టించాడు. క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సీన్స్ అయ్యితే సత్యదేవ్ అద్భుతంగా పెర్ఫార్మ్ టాప్ నాచ్ అని చెప్పాలి. ఫీమేల్ లీడ్ గా చేసిన ఐశ్వర్య లక్ష్మి నటనతో ఆకట్టుకుంది. ఫస్ట్ సినిమా అయినా డీసెంట్ లుక్స్ మరియు నటనతో మెప్పించింది. ఈ సినిమాలో కొన్ని థ్రిల్లింగ్ విషయాలు ఉన్న, హీరో పాత్ర ప్రస్తుత సమాజాన్ని ప్రశ్నించే విధంగా ఉంటూ, సూటిగా అడిగే కొన్ని పాయింట్స్ ఆడియెన్స్ ని ఆలోచించేలా చేస్తాయి.

సినిమాకి డ్రా బ్యాక్ ఏంటి అంటే, ఎక్కడా సరైన కీ పాయింట్స్ హైలైట్ అవ్వలేదు. సత్యదేవ్ క్యారెక్టర్ కూడ అంత బలంగా కనిపించదు. దింతో ఆడియెన్స్ కి సినిమా చూసాక పెద్ద ఎఫెక్ట్ అనిపించదు. చాలా లాజిక్స్ మిస్ అవ్వుతాయి.

నటి నటుల పెర్ఫామెన్స్:
సత్యదేవ్ ప్రెజెంట్ తెలుగు ఇండస్ట్రీ కి ఒక గిఫ్ట్. అతను ఈ సినిమాని తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. తమిళ హీరోయిన్ ఐశ్వర్య తన పాత్రకు న్యాయం చేసారు. చాలా కాలం తరువాత సింగర్ నోయల్ కి, ఈ సినిమాలో నటనకి మంచి స్కోప్ దొరికింది. రాహుల్ రామకృష్ణ, నాగబాబు గారు కొన్ని సీన్స్ కి పరిమితమైనారు. పృథ్వి రాజ్ కామిడి బాగుంది.

సాంకేతిక వర్గం:
ఈ సినిమా ట్రైలర్ లో రిచ్ నెస్ కనిపించినంత ఖ్వాలిటీ మేకింగ్ సినిమాలో యావరేజ్ గా ఉందనే చెప్పాలి. దర్శకుడు గోపి గణేష్ డైలాగ్స్ తో మెప్పించిన, మిగతా విషయాల్లో మెప్పించలేకపోయాడు. శాండీ సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకా బాగా చేసి ఉంటె బాగుండు.

రేటింగ్: 2.50/5

బాటమ్ లైన్:  డైలాగ్స్ వరకు బాగున్న  “గాడ్సే”

Leave a comment

error: Content is protected !!