చిత్రం: అంటే..సుందరానికీ
నటి నటులు: నాని, నజ్రియా నజీమ్‌, నరేశ్‌, అళగమ్ పెరుమాళ్, హర్షవర్థన్‌, నదియా, రోహిణి, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, అనుపమ పరమేశ్వరన్, సాయి రోనక్ తదితరులు
సంగీతం: వివేక్‌ సాగర్‌
ఛాయాగ్రహణం: నికేత్‌ బొమ్మి
నిర్మాత: మ్రైతీ మూవీ మేకర్స్‌
రచన, దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ
విడుదల తేది : జూన్‌ 10,2022

విభిన్నమైన కథలని ఎంచుకుంటూ, ఎప్పటికప్పుడు తన పాత్రలో వేరియేషన్‌ మెయింటైన్ చేస్తూ వరుస హిట్స్ ఇస్తున్న న్యాచ్యురల్ ఫ్యామిలీ స్టార్ “నాని”. ఈ మధ్య యాక్షన్‌ డ్రామా చిత్రాలు చేసిన నాని.. ఈ సారి కామెడీ జానర్‌తో ‘అంటే.. సుందరానికీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాని కాంబినేషన్ లో మలయాళ కుట్టి నజ్రియా నజీమ్‌ టాలీవుడ్‌కు పరిచయం చేసారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలకు రెస్పాన్స్‌ సూపర్బ్..దానికి తోడు ‘అంటే.. సుందరానికీ’ ఆడియో ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ రావడంతో హైప్‌ క్రియేట్‌ అయింది. సో, భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో చూద్దాం.

 

 

కథ:
నరేశ్‌ కుటుంబానికి చెందిన ఏకైక బ్రాహ్మణ వంశోద్దారకుడు సుందర్ ప్రసాద్(నాని). క్రిస్టియన్ ఫ్యామిలీ కి చెందిన లీలా థామస్ (నజ్రియా నజీమ్) వీళ్లిద్దరు చిన్నప్పటి నుంచి స్కూల్ మేట్స్. లీలా అంటే సుందర్ కి బాగా ఇష్టం. లీలా కూడ సుందర్ ని ఇష్టపడుతుంది అని తెలుసుకున్నాక, పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. కానీ, ఇరు కుటుంబాల కఠినంగా ఉండే పద్ధతులు, పట్టింపులు ఉన్న మనుషులు కావడం వళ్ళ , పెద్ద వాళ్ళని ఒప్పించడానికి సుందర్, లీలా రెండు అబద్ధాలు ఆడతారు. ఆ ఇద్దరు ఆడిన ఆ రెండు అబద్ధాలు ఏంటి? వీళ్ళు చెప్పింది అబద్ధమని తెలిసాక ఎలా స్పందించారు? ఫైనల్ గా సుందర్ – లీలా పెళ్లి జరిగిందా? లేదా? వీళ్ళ ప్రేమ ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగింది? అనేది మిగతా కథ.

కధనం,విశ్లేషణ:
ప్రేమ‌, కుటుంబ నేపథ్యంలో వచ్చే కథలంటే ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. వివేక్ ఆత్రేయ గత రెండు సినిమాలు కుటుంభ నేపధ్యమైన కధలే. అంటే సుంద‌రానికీ! సినిమాలోని పాత్ర‌లు, వాటి బేస్‌ చేసుకొని అల్లుకున్న స‌న్నివేశాలు చాలా ఎంట‌ర్‌టైనింగ్ ఉంటాయి. సుంద‌ర్ పాత్ర‌లో నాని నటించిన తీరు చూస్తే త‌ను త‌ప్ప ఎవ్వరు చేయ‌లేర‌నేలా పాత్ర‌లో ఇమిడిపొయ్యాడు. సాంప్రదాయ కుటుంబంలో పుట్టడం వళ్ళ హోమాలు, జోతిష్యాలు, అంటూ ఇబ్బంది పెట్టె స‌న్నివేశాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ సన్నివేశాల్లోనూ భావోద్వేగాలను చక్కగా పండించారు నాని.

లీలా థామస్ పాత్రలో నజ్రియా నజీమ్ అద్భుతంగా రాణించింది. పక్కింటి అమ్మాయిలా ఆ పాత్రకు యాప్ట్ అయ్యింది. ఎమోషనల్ ఫీలింగ్‌ను క్యారీ చేసే పాత్ర‌లో ఆమె చేసిన నటన ప్రశంసనీయం. సీనియ‌ర్ నటుడు న‌రేష్ & నాని కాంబినేషన్ సీన్స్ థియేటర్ లో పూనకాలు వస్తాయి. కన్న కొడుకుని ప్రయోజకుడుగా చూద్దాం అనుకునే ఎమోష‌న‌ల్ మ‌ద‌ర్ రోల్‌లో రోహిణి నటన అద్భుతం. న‌దియా మ‌రో వైపు బ్యాలెన్స్ చేస్తూ వ‌చ్చారు. న‌జ్రియా తండ్రి పాత్ర‌లో కోలీవుడ్ యాక్ట‌ర్ అల‌గం పెరుమాల్‌ బాగా ఆకట్టుకున్నాడు.ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాలిసిన పాత్ర అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, కాస్త స‌ర్‌ప్రైజ్ ఎలిమెంట్ అనే చెప్పాలి. శేఖర్ మాస్టర్ కుమారుడు విన్నీ, చిరంజీవి గారి స్టెప్స్ తో కేక పుట్టిస్తాడు.

సినిమా మొదటి భాగంలో అంత చాలా వరుకు సీన్స్ చాలా స్లో గా అనిపిస్తాయి. హర్షవర్ధన్, నాని మధ్య వచ్చే సీన్స్ హిల్లరీయస్ గా ఉంటాయి. జ్యోతిష్యుడు జోగారావు(శ్రీకాంత్‌ అయ్యంగార్‌) పాత్ర స్క్రీన్ మీద కామిడి పండిస్తోంది. ప్రి క్లైమాక్స్, క్లైమాక్స్ లో సాగే సస్పెన్స్ ప్రేక్షకులని కట్టిపడేస్తుంది.

నటి నటుల పెర్ఫామెన్స్:
సుందర్ పాత్రలో నాని “వావ్” అనిపించాడు. ఒక విధంగా చెప్పాలి అంటే సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకున్నాడు. నజ్రియా నజీమ్ క్యారెక్టర్ లో మరెవ్వరిని ఉహించుకోలేనంతగా ఎక్సట్రార్డినరీ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఇకపోతే అనుపమ పరమేశ్వరన్ ఒక హీరోయిన్ అయ్యుండి ఇంపార్టెంట్ రోల్ చేయడంతో సినిమాకి ఇంపాక్ట్ పెరిగింది. హీరో సాయి రోనాక్ తలుక్కుమని మేరీసి మెప్పించాడు. శేఖర్ మాస్టర్ కుమారుడు విన్నీ స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. నరేష్, రోహిణి, నదియా, అళగమ్ పెరుమాళ్… హీరో హీరోయిన్లు తల్లిదండ్రులుగా నటనతో రక్తి కట్టించారు. సినిమాలో గుర్తుండిపోయ్యే క్యారెక్టర్ హర్షవర్ధన్ ది.

 

సాంకేతిక వర్గం:
సినిమాలో అక్కడక్కడ బోరింగ్ సీన్స్ ఉన్నా, అద్భుతమైన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో బ్యాలెన్స్ చేయగలిగాడు డైరెక్టర్ “వివేక్ ఆత్రేయ”. ఈ సినిమాకి వివేక్‌ సాగర్‌ ఇచ్చిన మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్ గా ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటె బాగుండేది. నికేత్‌ బొమ్మి సినిమాటోగఫీ సూపర్బ్.

రేటింగ్: 3/5

బాటమ్ లైన్:  ఫ్యామిలితో చూడదగ్గ “అంటే..సుందరానికీ”

Review – TirumalaSetty Venkatesh Naidu

Leave a comment

error: Content is protected !!