చిత్రం: టాప్ గన్ మావెరిక్
నటి నటులు: టామ్ క్రూస్, వాల్ కిల్మర్, మైల్స్ టెల్లర్, జెన్నిఫర్ కొన్నెలి, ఎడ్ హరీష్, జాన్ హ్యామ్
సంగీతం: లేడి గాగ, హెరాల్డ్, జిమ్మర్, లొరెన్ బల్ఫీ
ఛాయాగ్రహణం: క్లొడియో మిరండా
నిర్మాత: జెర్రీ, టామ్ క్రూస్, క్రిస్టోఫర్, డేవిడ్
రచన, దర్శకత్వం: జోసెఫ్

హాలీవూడ్ హాలివూడ్…హాలివూడ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. హాలివూడ్ నుంచే వచ్చే చిత్రాలు, వాళ్ళు చేసే విన్యాసాలు, సాహసాలు, ఇట్టే అన్ని వర్గాల ప్రేక్షకులని కట్టి పడేస్తాయి. ది మమ్మి, జ్యాక్ రిచర్, మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లు, వరుస హిట్ లతో దూసుకెళ్తున్న హాలీవూడ్ సూపర్ హీరో “టామ్ క్రూస్”. టామ్ కి తెలుగు లో మామూలు ఫాలోయింగ్ కాదండోయ్. టామ్ చేసే రియల్ ఫైట్స్,పెర్ఫామెన్స్, క్యూట్ నెస్ కి ఆడియన్స్ ఫిదా అవ్వలిసిందే. 1986 లో వచ్చిన టాప్ గన్ మూవీ కి భారీ అంచనాలతో సీక్వెల్ గా వచ్చిన యాక్షన్ సినిమా “టాప్ గన్ మావెరిక్”. “ఎయిర్ ఫోర్స్” నేపథ్యంలో ఉత్కంఠ భరితంగా సాగే కథ ఇది. థియేటర్ లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా ప్రేక్షకులని అలరించిందా లేదా..!! తెలుసుకుందాం..?

కథ:
టెస్ట్ పైలట్ కెప్టెన్ పీట్ “మావెరిక్” మిచెల్ ఎయిర్ ఫోర్స్ కి 36 సంవత్సరాలు సేవలు అందిస్తాడు. ఆ తర్వాత కూడ ఎయిర్ ఫోర్స్ లో కొనసాగించడానికి, ఉద్దేశపూర్వకంగా ర్యాంక్లో పురోగతిని సాధిస్తాడు. ఒక రోజు, మావెరిక్ తన మాజీ ప్రత్యర్థి మరియు U.S. పసిఫిక్ ఫ్లీట్ కమాండర్ అయిన అడ్మిరల్ టామ్ “ఐస్మ్యాన్” కజాన్స్కీ ఆదేశాల మేరకు, ఒక ప్రత్యేక మిషన్ కోసం “టాప్ గన్” గ్రాడ్యుయేట్ల బృందానికి శిక్షణ ఇచ్చే బాధ్యతను అప్పగిస్తాడు. వారిలో లెఫ్టినెంట్ బ్రాడ్లీ “రూస్టర్” బ్రాడ్షా, మావెరిక్ యొక్క చివరి ప్రాణ స్నేహితుడు మరియు RIO నిక్ “గూస్” బ్రాడ్షా కుమారుడు. మావెరిక్ ఆధ్వర్యంలో సమావేశమైన బృందం “యురేనియం” సదుపాయాన్ని ముందుగానే నాశనం చేయాలని అనుకుంటారు. మావెరిక్ మరియు లెఫ్టినెంట్ బ్రాడ్లీ “రూస్టర్” బ్రాడ్షా లు కలుసుకున్నప్పుడు వారి మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడుతుంది. ఈ బృందం & కెప్టెన్ పీట్ “మావెరిక్” కలిసి యురేనియం ని ఎలా నాశనం చేసారు అనేది కథ? మిగతా కథ అంత తెలుసుకోవాలి అంటే మీరు థియేటర్ లో సినిమా చూడాల్సిందే ? 

కధనం,విశ్లేషణ:
మావెరిక్ ఆధ్వర్యంలో ఏర్పడిన బృందం “యురేనియం” సదుపాయాన్ని నాశనం చేయాలని, బృందం మొత్తానికి ఎన్నో కఠినమైన పరీక్షలు పెడుతూ టీం ని దృడంగా బలపరుస్తాడు. అదే సమయంలో బృందంలో ఉన్న లెఫ్టినెంట్ “రూస్టర్” తో తగాదాలు అవ్వుతుంటాయి. అసలు బృందాన్ని మావెరిక్ నడిపించగలడా, అనే సందేహాలు వస్తున్న సమయంలో అతని వైమానిక పోరాట నైపుణ్యాలను చూసి మెచ్చుకుంటారు. మిషన్ ప్రారంభించటానికి ముందు U.S. పసిఫిక్ ఫ్లీట్ కమాండర్ అయిన అడ్మిరల్ టామ్ “ఐస్మ్యాన్” కజాన్స్కీ అనారోగ్యం తో మృతి చెందుతాడు. బృందం ఇంకా రెడీ అవ్వకపొయ్యే సరికి, మిషన్ దగ్గర పడడంతో ” గ్రూప్ లో ఉన్న బాబ్, రూస్టర్, నటాషా వ్యక్తులతో “మావెరిక్” స్వయంగా పోరాటానికి సిద్ధమవుతాడు. సినిమా లో జరిగే లాస్ట్ థర్టీ మినిట్స్ యాక్షన్ సీక్వెన్స్ అత్యంత అద్భుతంగా టాప్ నాచ్ ఉంటాయి. ఎఫ్ ఫోర్టీన్ యుద్ధ విమానాలు 100 అడుగుల పైకప్పుతో భూమికి ఎగురుతాయి. అంతే కాకుండా యుద్ధ విమానాలతో చేసే విన్యాసాలు కళ్ల గట్టినట్టుగా చూపిస్తారు.

నటి నటుల పెర్ఫామెన్స్:
టామ్ క్రూస్ ఈ సినిమాలో ఎప్పటి లాగే తన డైన స్టైల్ లో సెట్టిల్డ్ గా యాక్షన్, ఎమోషన్స్ అదరకొట్టేసాడు.
టామ్ క్రూస్ ప్రాణ స్నేహితుడు కొడుకుగా “మైల్స్ టెల్లర్” కథ కి బాగా ప్లస్ అయ్యాడు. అంతే కాదు పెర్ఫామెన్స్ తో టాప్ నాచ్ అనిపించుకున్నాడు. హీరోయిన్ గా చేసిన “జెన్నిఫర్ కన్నెల్లీ” స్క్రీన్ స్పెస్ ఉన్నంత వరుకు బాగానే ఆకట్టుకుంది. వాల్ కిల్మర్, ఎడ్ హారిస్, జోన్ హామ్, టాప్ గన్ బృందం పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ని మెప్పించారు.

సాంకేతిక వర్గం:
జోసెఫ్ కోసిన్స్కి డైరెక్షన్ అదిరిపోయింది. ఇకపోతే ఈ సినిమా లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టాప్ నోచ్. టామ్ క్రూస్ ఒక ప్రొడ్యూజర్ గా ఈ సినిమాలో భాగం కావడం విశేషం. ప్రౌడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్ గా ఉంటాయి. మొత్తానికి ఈ సినిమా యాక్షన్ విజ్యువల్ వండర్ అనే చెప్పాలి.

రేటింగ్: 4/5
బాటమ్ లైన్: టాప్ నోచ్  “మావెరిక్”

Reviewed By: Tirumalasetty Venkatesh

Leave a comment

error: Content is protected !!