చిత్రం: శేఖర్
నటీనటులు: రాజ్ శేఖర్, శివాని రాజ్ శేఖర్ , ఆత్మీయ రాజన్, ముస్కాన్, అభినవ్, కిషోర్, సమీర్, ప్రకాష్ రాజ్, రవి వర్మ
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటర్: గ్యారీ బి హెచ్
ఛాయాగ్రహణం: మల్లికార్జున నరగని
నిర్మాత: శివాని & శివాత్మిక రాజ్ శేఖర్, భీరం సుధాకర్ రెడ్డి, భోగారం వెంకట శ్రీనివాస్
రచన, దర్శకత్వం: జీవిత రాజ్ శేఖర్
పీఆర్వో: ఫణి – నాయుడు ( బియాండ్ మీడియా )
తెలుగు ఇండస్ట్రీ లో లేడి డైరెక్టర్స్ ని చాలా అరుదుగా చూస్తుంటాం. శేషు మూవీ తరువాత మల్లి ఆ స్థాయిలో కమ్ బ్యాక్ ఇస్తున్న డైనమిక్ డ్యాషింగ్ డైరెక్టర్ జీవిత రాజ్ శేఖర్. ప్రేక్షకుల బ్లెస్సింగ్స్ తో డెత్ బెడ్ నుంచి కమ్ బ్యాక్ ఇచ్చి ఆడియెన్స్ ని మెప్పించడానికి వస్తున్నా యాంగ్రీ యుంగ్ మ్యాన్ “రాజ్ శేఖర్”. వీల్లద్దరి కలయిక లో వచ్చిన ఈ రెండో సినిమా థియేటర్ లో అదరకొట్టిందా..? లేదా..? తెలుసుకుందాం?
కధ:
రాజ్ శేఖర్ (శేఖర్) వాలంటరీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ముస్కాన్ (మరదలు) తన బావ “శేఖర్” ని ప్రేమిస్తుంది. శేఖర్ ట్రైనింగ్ కి వెళ్లి వచ్చాక పెద్దలని ఓప్పించి ముస్కాన్ (మరదలని) పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. ఇంతలో ముస్కాన్ తండ్రి, కార్తిక్ అనే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. తిరిగి వచ్చాక అది తెలిసి బాధ పడతాడు శేఖర్. కొన్ని రోజులు తరువాత శేఖర్ “ఆత్మీయ రాజన్” అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఒక రోజు లోకల్ లో మర్డర్ జరిగితే శేఖర్ టీం ఇన్వెస్టిగేషన్ కోసం ఇంటికి వెళ్తారు. ఆ డెడ్ బాడీ ప్రేమించిన ముస్కాన్ (మరదలు) అని తెలుసుకొని బాధపడతాడు. అక్కడ ఒక లెటర్ రాసి పెట్టి ఉంటుంది. ఆ లెటర్ చదివిన శేఖర్ తన వల్లే చనిపోయింది అనుకోని ప్రతి క్షణం కుమిలిపోతూ కట్టుకున్న భార్య కి విడాకులు ఇస్తాడు. కొన్ని రోజులు తరువాత శేఖర్ భార్య యాక్సిడెంట్ లో చనిపోతుంది. అది యాక్సిడెంట్ కాదు, హత్య అని శేఖర్ తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. శేఖర్ భార్య ని ఎవ్వరు చంపారు? ఆ కేస్ ని ఎలా సాల్వ్ చేసాడు? ఇవన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే ?
కథనం, విశ్లేషణ:
రాజ్ శేఖర్ ఒక ఇంటిలిజెంట్ ఆఫీసర్ ఆఫ్ డ్యూటీ లో ఎక్కువ కేస్ లు సక్సెస్ ఫుల్ గా డీల్ చేస్తుంటాడు. మలయాళం లో హిట్ అయ్యిన జోసెఫ్ సినిమా ని, తెలుగు లో రీమేక్ చేసారు. జీవిత రాజ శేఖర్ గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాగానే డీల్ చేసారు. కొన్ని సీన్స్ ఇంకా ఉత్కంఠ భరితంగా రాసుంటే బాగుండు. రాజ్ శేఖర్ వన్ మ్యాన్ షో గా నడిచిన ఈ సినిమాలో “శేఖర్” గా అద్భుతంగా నటించారు. సినిమాలో కొన్ని కుటుంబ సన్నివేశాలు ఎమోషనల్ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి.
నటి నటుల పెర్ఫామెన్స్:
రాజ్ శేఖర్ “శేఖర్” క్యారెక్టర్ లో ఓదిగి పొయి చాలా సెటిల్ గా చేస్తూ సినిమా ని తన భుజాల మీద నడిపించారు. అంతే కాదు, తన డైన స్టైల్ లో రగ్గడ్ లుక్ తో మెస్మరైజ్ చేశారు. ఈ సినిమాలో తండ్రి కి తగ్గ కూతురు అనిపించుకుంది శివాని రాజ్ శేఖర్. స్క్రీన్ మీద కనిపించిన నిడివి తక్కువే అయ్యిన, తండ్రి తో వచ్చే సీన్స్ అన్ని ప్రేక్షకులని కట్టిపడేస్తుంది. మరోసారి ప్రకాష్ రాజ్ గారు పవర్ ఫుల్ రోల్ చేసి ఆడియెన్స్ ని థ్రిల్ చేస్తుంది. “శేఖర్” కి వైఫ్ పాత్రలో నటించిన ఆత్మీయ రాజన్ పెర్ఫామెన్స్ చాలా బాగుంది. జార్జ్ రెడ్డి ఫేం ముస్కాన్ కి రెండో చిత్రం “శేఖర్”. రాజ్ శేఖర్ తో వచ్చే కొన్ని సీన్స్ చాల బాగా ఆకట్టుకుంటూ ప్రేక్షకులని కంట తడి పెట్టిస్తాయి. ఇకపోతే, సమీర్, కిశోర్, రవి వర్మ, అభినవ్, పోసాని కృష్ణ మురళి, తమ పరిధి తగ్గట్టు యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం:
ఎప్పుడు వచ్చాము అన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా..! లేదా..! డైలాగ్ బాగా ఫాలో, అయ్యినట్టున్నారు జీవిత రాజ్ శేఖర్. తన డైరెక్షన్ లో వచ్చిన “శేఖర్” సినిమాతో మెరిట్ లో పాస్ అయ్యారనే చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఇచ్చిన సాంగ్స్ ఈ సినిమా ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లింది. ఛాయాగ్రహణం, ఎడిటర్ గ్యారి పని తీరు బాగుంది. ముఖ్యంగా శివాని & శివాత్మిక ఇద్దరు ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఎక్కడ తగ్గకుండ చాలా కేర్ తీసుకున్నారని అర్ధమవ్వుతుంది.
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: ఆడియెన్స్ ని మెప్పించిన రాజ్ “శేఖర్”
Review by – Tirumalasetty Venkatesh