డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్.
ఆయన అంటే రౌడీలకు హడల్, గుండాలకు గుబుల్.
వయలెంట్‌గా కొడతాడు! వెంటనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేస్తాడు!
అతడి కథేంటో తెలియాలంటే… ముందు ‘ది వారియర్’ టీజర్ చూడాల్సిందే.
‘ది వారియర్’ టీజర్లో హీరో రామ్ క్యారెక్టర్‌తో పాటు విలన్ రోల్ చేస్తున్న ఆది పినిశెట్టి, హీరోయిన్ కృతి శెట్టి, నదియా క్యారెక్టర్లను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సత్య ఐపీఎస్ పాత్రలో రామ్ ఫెరోషియస్ యాక్టింగ్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ సూపర్బ్ అని చెప్పాలి. హీరోను లింగుస్వామి బాగా ప్రజెంట్ చేశారు. ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.
‘ఈ పోలీసోళ్ళ టార్చర్ భరించలేకపోతున్నాం అప్ప! ఇంతకు ముందు సైలెంట్‌గా ఉండేటోళ్ళు. ఇప్పుడు వైలెంట్‌గా లోపలేస్తాండారు. ఈ మధ్య సత్య అని ఒకడు వచ్చున్నాడు… వాడియమ్మా
‘పాన్ ఇండియా సినిమా చూసుంటారు. పాన్ ఇండియా రౌడీస్‌ను చూశారా?’, ‘మై డియర్ గ్యాంగ్స్టర్స్ వీలైతే మారిపోండి, లేకపోతే పారిపోండి. ఇదే నేను మీకు ఇస్తున్న ఫైనల్ వార్నింగ్’ అంటూ రామ్ చెప్పే డైలాగులు సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.
మాస్… ఊర మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని టీజర్ చెప్పకనే చెప్పింది. యాక్షన్ ప్రియులను మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకునే అంశాలు సినిమాలో ఉన్నాయని రామ్, నదియా సీన్ చూస్తే అర్థం అయ్యింది. విడుదలైన కొన్ని క్షణాల్లో సోషల్ మీడియాలో ‘ది వారియర్’ టీజర్ వైరల్ అయ్యింది.
నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ “టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తోంది. స్క్రీన్ మీద రామ్, స్క్రీన్ వెనుక లింగుస్వామి అద్భుతంగా చేశారు. ఊర మాస్ విజువల్ గ్రాండియర్ అని ఆడియన్స్ చెబుతుంటే సంతోషంగా ఉంది. వాళ్ళ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది. ఒక్క పాట మినహా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఆ పాటను ఈ నెల 22 నుంచి హైదరాబాద్‌లో షూట్ చేయడానికి ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తాం” అని చెప్పారు.