చిత్రం: సర్కారు వారి పాట
నటీనటులు: మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిశోర్, సముధ్రఖని, మహేష్ మంజ్రేకర్, సుబ్బరాజు, నధియా, సౌమ్య మీనన్, అజయ్, బ్రహ్మజీ, తనికెళ్ళ భరణి, మాధవన్, సత్యం రాజేష్
సంగీతం: ఎస్.ఎస్. తమన్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
ఛాయాగ్రహణం: ఆర్. మది
నిర్మాత: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్
రచన, దర్శకత్వం: పరశురామ్
పీఆర్వో: వంశీ – శేఖర్

భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ వరుస సూపర్ హిట్స్ మూవీస్ తరువాత “మహేష్ బాబు – పరశురామ్” క్రేజి కాంబినేషన్ లో వచ్చిన సినిమా “సర్కారు వారి పాట”. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. అలాగే, మహేష్ బాబు, కీర్తి సురేష్ కాంబినేషన్ సాంగ్స్ & వాళ్ళిద్దరి జోడికి మంచి రెస్పాన్సే వచ్చింది.వరస మూడు హిట్స్ తర్వాత మహేష్ బాబు, గీత సుబ్రమణ్యం సెన్సేషనల్ హిట్ తరువాత పరశురామ్ “సర్కారు వారి పాట” కలిసి చేసిన ఈ సినిమా ప్రేక్షకులని ఏ మేరకు అలరించిందో ఈ రివ్యూ లో చూద్దాం ?

కధ:
సినిమాలో “మహేష్ బాబు” కి తండ్రి గా నటించిన “కొణిదెల నాగబాబు”. బ్యాంక్ వాళ్ళకి కట్టాలిసిన అమౌంట్ కట్టలేక అప్పులు పాలై ప్రెజర్ తట్టుకోలేక, మహేష్ బాబు చిన్న వయసులోనే తల్లి, తండ్రి ఇద్దరు ఉరి వేసుకొని చనిపోతారు. స్కూల్ లో మాస్టర్ అయ్యిన “తణికెళ్లభరణి” మహేష్ బాబు ని, ఒక చర్చ్ ఆశ్రమం లో చేర్పిస్తారు. కట్ చేస్తే, మహేష్ బాబు అమెరికా లో ఉంటాడు, అమెరికా లో చదువు అబ్బక డబ్బులు కావలిసిన వాళ్ళకి వడ్డీ కి ఇస్తుంటాడు. ఒకరోజు కీర్తి సురేష్ ఎక్జామ్స్ రాయడానికి డబ్బు కావలిసి ఉంటె, మహేష్ బాబు దగ్గర పది వేల డాలర్లు  అప్పు తీసుకుంటుంది. కీర్తి సురేష్ తిరిగి అప్పు ఇవ్వకపోవడంతో, ఇండియా లో ఉన్న తన తండ్రి (సముధ్రఖని) దగ్గరికి వెళ్ళాలిసి వస్తుంది. …అసలు కథ..! ఇక్కడ స్టార్ట్ అవ్వుతుంది.   మహేష్ “పది వేల డాలర్లు” కాస్త “పది వేల కోట్లు” అప్పు ఇచ్చానని ప్రెస్ కి అనౌన్స్ చేస్తాడు చేస్తాడు, దాంతో మైండ్ బ్లాక్ అవ్వుతుంది. కీర్తి సురేష్ ఫ్యామిలీ తిరిగి అప్పు ఇచ్చిందా? అసలు కీర్తి సురేష్ డబ్బులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మహేష్ బాబు డబ్బులు  “పది వేల కోట్లు”  ఎలా వసూల్ చేసారనేది మిగతా కధ …

కథనం, విశ్లేషణ:

ఓ మంచి మెసేజ్ తో ఈ సినిమా సాగుతుంది. ఇంతవరకు ఎవరు టచ్ చేయని పాయింట్ ని డైరెక్టర్ టచ్ చేసారు. ఐతే ఇదే విషయాన్ని బలంగా చెప్పడం లో కొంచెం మిస్ అయ్యారనే చెప్పచ్చు . ఐతే సెంకడాఫ్ లో స్టొరీ రివీల్ చేయడం పరసనల్ ఇష్యూ కాస్త నేషనల్ ఇష్యూ రేంజ్ కి వెల్లడం దగ్గరే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అక్కడక్కడ సినిమా స్లో ఉన్న మంచి లైన్ తీసుకొని ప్రేక్షకులని అలరించిందనే చెప్పాలి.బాగా డబ్బున్నవారు బ్యాంక్ కి డబ్బులు కట్టక పోతే అది సామాన్యుల ఎంతటి ప్రభావం చూపిస్తుందనేది బాగా చెప్పారు.

నటి నటుల పెర్ఫార్మెన్స్:

ఖలేజా, దూకుడు సినిమాలు తరువాత మహేష్ బాబు ని మల్లి, ఆ స్థాయి పవర్ ప్యాకడ్ గా పెర్ఫామెన్స్ చేశారనే చెప్పచ్చు. ముఖ్యంగా కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, సముద్రఖని వీళ్ళతో వచ్చే కొన్ని కాంబినేషన్ సీన్స్ అయ్యితే టెర్రిఫిక్ అసలు. సగటు ప్రేక్షకుడిని థియేటర్ లో విజిల్స్ పడే సీన్స్. ఇకపోతే, మహానటి సినిమా తరువాత “కీర్తి సురేష్” కి మంచి హిట్. తన యాక్టింగ్ తో పాటు మహేష్ బాబు కి సినిమాలో పర్ఫెక్ట్ జోడి. వెన్నెల కిషోర్ & సుబ్బరాజు కామిడి ట్రాక్
నెస్ట్ లెవెల్ . సముధ్రఖని – మహేష్ బాబు తో తలపడే విలనిజం చాల ఫ్రెష్ గా సీన్స్ అన్నిటెర్రిఫిక్ గా ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి.

సాంకేతిక వర్గం: సూపర్ స్టార్ “మహేష్ బాబు” ని ఏ విధంగా అయ్యితే చూడాలని ప్రేక్షకులు పరితపించారో, ఈ సినిమా ద్వారా యాక్షన్, కామిడి, గ్లామర్, స్టైలిష్ తో ప్రతి ప్రేక్షకుడికి కనువిందు కలిగేలా చేసాడు “డైరెక్టర్ పరశురామ్”. సినిమాలో కళావతి, పెన్నీ సాంగ్స్ హైలైట్ గా నిలిచాయి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎప్పటి లాగే, మహేష్ బాబు ఫ్యాన్స్ కి నచ్చేలా తన డైనా స్టైల్ లో “బిజెఎమ్” ఇరగదీసాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్ గా కనిపించాయి. “డీఓపీ మది” మునుపెన్నడూ లేని మహేష్ బాబు ని తెర మీద స్టైలిష్ గా చూపించారు. ముఖ్యంగా సినిమాలో డ్యాన్స్ కోరియోగ్రఫీ, హీరో & హీరోయిన్స్ కాస్ట్యూమ్స్, ఫైట్స్ అసెట్స్ అని చెప్పచ్చు.

రేటింగ్: 3/5

బాటమ్ లైన్:  మెసేజ్ తో సాగే సర్కారు వారి పాట

Review – Tirumalasetty Venkatesh

Leave a comment

error: Content is protected !!