సినిమా పేరు: డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్‌

దర్శకుడు: సామ్ రైమి

నటీనటులు: బెనెడిక్ట్ కంబర్‌బాచ్, చివెటెల్ ఎజియోఫోర్, ఎలిజబెత్ ఒల్సెన్,
బెనెడిక్ట్ వాంగ్, జోచిటిల్ గోమెజ్, మైఖేల్, మైఖేల్, మక్ఆడమ్స్.

నిర్మాతలు: కెవిన్ ఫీగే

సంగీతం : డానీ ఎల్ఫ్‌మాన్

సినిమాటోగ్రఫీ: జాన్ మాథిసన్

మార్వెల్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం “డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్”. ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా, ప్రేక్షకులు థియేటర్ లో అద్భుతమైన విజువల్స్‌ని చూసి మరో ప్రపంచంలోకి
తేలుతున్నారు. అయితే, డాక్టర్ స్ట్రేంజ్ పాత్రకు క్రేజి అభిమానులు ఉన్నారు. సామ్ రైమిధీ హారర్ చిత్రాలు తీయడంలో ప్రతేయక శైలి. గత సినిమాలలో లాగే, ఈ సినిమా లో కూడా డార్క్ షేడ్స్ తీసుకురావడానికి ప్రయత్నించారు. సో
ఆలస్యం చేయకుండా మల్టివర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్‌లో డాక్టర్ స్ట్రేంజ్ ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. అలాగే ఈ చిత్రం ఎంత వరుకు ప్రేక్షకులని అలరించిందో తెలుసుకుందాం?

కథ:

డాక్టర్ స్ట్రేంజ్ (బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్) కాపాడిన తరువాత, అమెరికా చావెజ్ కథ మొత్తం తెలుసుకొని తనను కాపాడటం అనుకున్నంత సులువు కాదని తెలుస్తుంది. ఒక విశ్వం నుంచి మరో విశ్వానికి అమెరికా చావెజ్‌కు
(సోచీ గోమెజ్) ప్రయాణించే శక్తి ఉంటుంది. ఆ శక్తీ ని ఎలా అదుపు చేయాలో తెలియదు. అదే విధంగా ఆ శక్తిని సొంతం చేసుకోవడానికి గుర్తు తెలియని వ్యక్తి ప్రయత్నాలు చేస్తుంటారు. దీంతో డాక్టర్ స్ట్రేంజ్, వాండా మాక్సిమాఫ్ (ఎలిజబెత్ ఓల్సెన్) సాయం కోరతాడు. వాండా మాక్సిమాఫ్ అమెరికా చావెజ్ శక్తిని సొంతం చేసుకోవాలనుకుంటుంది? డాక్టర్ స్ట్రేంజ్ తనను అడ్డుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ.

కథ, విశ్లేషణ:

మార్వెల్ స్టూడియోస్ నుంచి సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌తో పాటు జనరల్ ఆడియన్స్ ని నిరాశ పరచదని అంచనా వేస్తారు. ఎందుకంటే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్‌కు ముందు వరకు, ఈ యూనివర్స్‌లో అన్నిబ్లాక్‌బస్టర్లే. దాదాపు గత దశాబ్దాలు గా ఒకే స్టోరీ లైన్‌తో సినిమాలు తీస్తూ సక్సెస్‌లు కొడుతూ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్‌ను
మార్వెల్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్’ మార్వెల్ స్థాయిని మరింత పెంచేలానే ఉంటుందనే చెప్పచ్చు. వాండా మాక్సిమాఫ్/స్కార్లెట్ విచ్, డాక్టర్ స్ట్రేంజ్‌తో నువ్వు నియమాలను
ఉల్లగించి హీరో అయ్యావు. అదే పని నేను చేసి విలన్ అయ్యాను. ఇది ఏమాత్రం న్యాయం కాదు, అని డైలాగ్ చెబుతుంది. ఈ సినిమా కథ మొత్తం ఈ డైలాగ్‌లోనే ఉంది. విశ్వానికి సంబంధించిన కొన్ని నియమాలు బ్రేక్ చేయడం, వాటికి
చెల్లించే మూల్యం చుట్టూనే ఈ కథ మొత్తం తిరుగుతుంది. ఒకవేళ నియమాలు క్రాస్ చేసి, మంచి కోసం చేస్తే హీరో అవుతారు, స్వార్థం కోసం చేస్తే, విలన్ అవుతారనే విషయాన్ని భయపెట్టే విధంగా చూపిస్తారు.

ప్రీవియస్ మార్వెల్ మూవీస్ కంటే, ఈ మూవీ లో హార్రర్ వయొలెన్స్, కొంచెం ఎక్కువుగా ఉంటుంది. ప్రత్యేకంగా క్లైమ్యాక్స్ లో వచ్చే డాక్టర్ స్ట్రేంజ్ వెర్షన్ భయంకరంగా ఉంటుంది. మార్వెల్‌ లోని కొత్త కెప్టెన్ ఇందులో చూపించడంతో పాటు, ఎక్స్-మెన్, ఫెంటాస్టిక్ ఫోర్ వంటి పాత్రలను ఇందులో పరిచయం చేస్తారు. డైరెక్టర్ సామ్ రైమి గతంలో స్పైడర్ మ్యాన్ సినిమాలతో పాటు, ఎంతో ఫేమస్ హార్రర్ సినిమాలు అయిన ‘ఈవిల్ డెడ్’ సిరీస్‌ను తెరకెక్కించడం వళ్ళ, ఆ అనుభవం ఈ సినిమాకు మరింత ఉపయోగపడింది.

నటి నటుల పెర్ఫామెన్స్:

డాక్టర్ స్ట్రేంజ్‌గా నటించిన బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్‌కు ఈ పాత్ర పోషించడం ఇది మొదటిసారి కాదు. థోర్: రాగ్నరాక్, అవెంజర్స్: ఇన్‌ఫినిటీ వార్, ఎండ్‌గేమ్, స్పైడర్‌మ్యాన్: నో వే హోంల్లో సినిమాల్లో కూడా తను నటించారు. ఈ సినిమాలో తనకు సంబంధించిన వేర్వేరు వెర్షన్లు, ఎమోషనల్ సైడ్ కూడా చూపించారు. ఈ సినిమాలో డాక్టర్ స్ట్రేంజ్ కంటే ముఖ్యమైన పాత్ర, వాండా మాక్సిమాఫ్/స్కార్లెట్ విచ్‌గా నటించిన ఎలిజబెత్ ఓల్సెన్‌ది.

    వాండా పాత్ర లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అన్ని వేరియేషన్స్ ఉన్న ఈ పాత్ర మూవీ కి మెయిన్ హైలెట్. అన్ని విశ్వాల్లో తనే అత్యంత శక్తివంతమైన ప్రాణిగా చూపించారు. కాబట్టి రానున్న మార్వెల్ యూనివర్స్ సినిమాలకు తనే కీలకం కావచ్చు. ఇక అమెరికా చావెజ్‌గా నటించిన “సోచీ గోమెజ్” తన పాత్ర పరిధిలో బాగానే నటించింది. కథ మొత్తం తిరిగేది తన చుట్టూనే అయినా, తనకు నటించడానికి ఉన్న స్కోప్ చాలా తక్కువ. మిగతా పాత్రధారులందరూ తమ పాత్రల్లో మెప్పించారు. డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్  ఖచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా. ఈ సినిమా తో పాటు అవతార్ 2 టీజర్ కూడ ఎక్స్‌క్లూజివ్‌గా చూడచ్చు.

సాంకేతిక వర్గం:

వాండా తన పిల్లలతో ఉన్న సీన్స్ చాల సెంటి మెంటల్ గా ఉంటాయి. ఈ సీన్స్ కి ఎవరైనా కూడ కనెక్ట్ అవుతారు.  డాక్టర్ స్ట్రేంజ్ పాత్రని ఇందులో చాలా డిఫరెంట్ గా సెంటిమెంటల్ గా డిజైన్ చేసారు. సూపర్ హీరో సినిమాలో హార్రర్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కొత్తగా ఉంది. అక్కడక్కడ స్లో నరేషన్ కొంచెం బోర్ కొట్టిస్తుంది. ఇక సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ ఐతే సినిమాకే హైలెట్. డానీ ఎల్ఫ్‌మ్యాన్ అందించిన సంగీతం సినిమాకి మరో ప్లస్

రేటింగ్ : 3/4

బాటమ్ లైన్: విజువల్ వండర్

Review – Tirumalasetty Venkatesh

Leave a comment

error: Content is protected !!