చిత్రం: అశోక వనంలో అర్జున కళ్యాణం
నటి నటులు: విశ్వక్ సేన్, రితిక నాయక్, రుక్సార్ ధిల్లన్, కాదంబరి కిరణ్, గోపరాజు రమణ, కేధర్ శంకర్, వెన్నెల కిషోర్
సంగీతం: జె క్రిష్
ఛాయాగ్రహణం: పవి కే పవన్
నిర్మాత: బాపినీడు, సుధీర్ ఎడర
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
రచన, దర్శకత్వం: విద్య సాగర్ చింత
ఈ నగరానికి ఏమైంది, ఫలకనామా దాస్, హిట్, పాగల్ ఇలా ప్రతి సినిమా తో వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న యంగ్ హీరో “విశ్వక్ సేన్”. తన కంటూ టాలీవుడ్ లో స్టైల్ ఏర్పరచుకున్న ఈ యంగ్ హీరో, దేవి నాగవల్లి (జర్నలిస్ట్) తో కాంట్రావర్సీ అయ్యిన తరువాత, థియేటర్ లో రీలిజ్ అయ్యిన ఈ “అశోక వనంలో అర్జున కళ్యాణం” సినిమా ఎంతవరుకు ప్రేక్షకులని అలరించిందో చూద్దాం..!!
కథ:
కథ లోకి వెళ్తే, 33 ఏళ్ళు వచ్చిన అర్జున్ (విశ్వక్ సేన్) సూర్య పెట్ లో చిన్నపాటి ఫైనాన్సియర్ గా తన లైఫ్ ని కొనసాగిస్తూ ఉంటాడు. ఒక పక్క వయసు మీద పడుతూ ఉంటుంది, అదే విధంగా సంబంధాలు కూడ ఫ్యామిలీ చూస్తుంటారు. ఒక
రోజు, తన తండ్రి (కేధర్ శంకర్) ఒక అమ్మాయితో పెళ్లి చూపులు ఫిక్స్ చేసి, నిశ్చితార్థనికి రాజమండ్రి కి వెళ్తారు. రాజమండ్రి లో అక్కడ పసుపులేటి మాధవి (రుక్షర్ ధిల్లాన్) పెళ్లి కూతురుగా చూసాక ఏమవుతుంది? అర్జున్ కి
ఆమెకి పెళ్లవుతుందా లేదా? ఆమె సడెన్ గా కనిపించకపోవడానికి కారణం ఏమిటి?
అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడాల్సిందే.
కథనం, విశ్లేషణ:
చాలా రోజులు తరువాత మల్లి, ఒక సెన్సిబుల్ కామిడి ఎమోషన్స్ తో కూడిన ఫ్యామిలీ సినిమా అని చెప్పచ్చు. సినిమా కథ రొటీన్ అయ్యిన డైరెక్టర్ విద్య సాగర్ తీర్చి దిద్దిన విధానం చాలా బాగుంది. విశ్వక్ సేన్ ఇక ఈ బ్యాచలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పి, అందమైన అమ్మాయితో సెటిల్ అయ్యిపోదాం అనుకునే లోపల, హీరోయిన్ లేచిపోతుంది. కథ మొత్తం ఎంతో మంది కుటుంబీకుల మధ్య, ఉత్కంఠ భరితంగా సాగుతూ, ఒకే ఇంట్లో ఎంతో సందడి గా ఉంటుంది. ఈ సినిమా కి
సెకండ్ హీరోయిన్ గా నటించిన “రితిక నాయక్”, ముఖ్య పాత్ర పోషించింది అనే చెప్పాలి. ఎందుకంటే, కొత్తమ్మాయి అయ్యిన తన పెర్ఫామెన్స్ తో సెకండ్ ఆఫ్ లో స్టోరీ ని నిలబెట్టింది. అదే విధంగా “విశ్వక్ సేన్” ఖాతాలో మరో హిట్
అని చెప్పచ్చు.
నటి నటుల పెర్ఫామెన్స్:
“విశ్వక్ సేన్” కెరీర్ లో బెస్ట్ పెర్ఫెమెన్స్ (“నెవ్వర్ బిఫోర్ – నెవ్వర్ ఆఫ్టర్”), అలాగే తన స్టైల్ లో కామిడి, సెన్సిబుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంతో చక్కగా సినిమా మొత్తం క్యారీ చేసారు. హీరోయిన్ “రుక్సార్” కథ కి తగ్గట్టు గా తెలుగింటి అమ్మాయిలా వినయంగా నటించింది. హీరోయిన్ చెల్లెలు గా పెర్ఫార్మ్ చేసిన “రితికా నాయక్” ఫస్ట్ మూవీ తోనే అందంతో,
చక్కటి పెర్ఫామెన్స్ తో అల్లరి అల్లరి గా ఉంటూ యువకుల మనసులని దోచుకుందనే చెప్పాలి. ఇకపోతే, కాదంబరి కిరణ్, గోపరాజు రమణ, వెన్నెల కిషోర్ నవ్వులతో స్క్రీన్ మీద మరోసారి ప్రేక్షకులని నవ్వించారు.
సాంకేతిక వర్గం:
డైరెక్టర్ “విద్య సాగర్ చింత” కొత్త వాడైనా కధని అద్భుతంగా తీర్చి దిద్దుతూ, స్టోరీ ని సెకండ్ ఆఫ్ లో మలిచిన విధానం, రితిక నాయక్ (వసుధ) క్యారెక్టర్ స్క్రీన్ మీద అందంగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఓ ఆడపిల్ల, చిన్నవాడా రెండు సాంగ్స్ కధ కి బాగా యాప్ట్ అనిపించాయి. మ్యూజిక్ డైరెక్టర్ “జే క్రిష్” పని తీరు సూపర్. డీవోపీ పని తీరు బాగుంది.
సినిమాకి ఆర్ట్ వర్క్ కూడా బాగా ప్లస్ అయ్యింది.
రేటింగ్ : 3/5
బాటమ్ లైన్: అలరించిన “అశోక కళ్యాణం”.
Review – Tirumalasetty Venkatesh