నటీనటులు : కార్తికేయ , తాన్యా రవిచంద్రన్,సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
ఛాయాగ్రహణం: పి.సి.మౌళి
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
ఎడిటింగ్: జస్విన్ ప్రభు
ఆర్ట్: నరేష్ తిమ్మిరి
ఫైట్స్: సుబ్బు,నబా, పృథ్వీ శేఖర్,
పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ కాంత్
పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ
సమర్పణ: ఆదిరెడ్డి. టి
నిర్మాత: ’88’ రామారెడ్డి
దర్శకత్వం: శ్రీ సరిపల్లి
విడుదల తేది : 12-11-2021

ఆర్ ఎక్స్ హండ్రెడ్ తో ఫేమ్ తెచ్చుకున్న యువ హీరో కార్తికేయ వరుసగా విభిన్న చిత్రాలు చేస్తూ తన ప్రతిభకు పదును పెట్టుకుంటున్నాడు.. నటనలో ఈజ్ తెచ్చుకుంటూ, కెరీర్ పరంగా గ్రాఫ్ పెంచుకుంటున్నాడు.. ఇటీవలే 90 ఎం ఎల్ , చావుకబురు చల్లగా చిత్రాలతో పలకరించిన కార్తికేయ తాజాగా ‘రాజా విక్రమార్క’ అనే రొమాంటిక్ లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.. ఈ చిత్రంలో తన మార్క్ ను ఎలా ప్రజెంట్ చేశాడు? ఇతనికి జంటగా నటించిన తాన్యా రవిచంద్రన్ తో కెమిస్ట్రీ ఎలా కుదిరింది. ఈ చిత్ర కథా, కథనాలు ఎలా ఆకట్టుకుంటున్నాయి ? భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్ర ఫలితం ఎలా ఉండబోతుంది? తదితర విషయాలన్నీ సమీక్షలో చూద్దాం.

కథ :
(NIA) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ లీడ్ చేసే అధికారి తనికెళ్ళ భరణి , ఆయన టీమ్ సభ్యుల్లో ఒకరు విక్రమ్ (కార్తికేయ). హోమ్ మంత్రి (సాయి కుమార్ )కి ప్రాణహాని ఉందని ఆయనను రక్షించేందుకు అండర్ కవర్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేయాలని విక్రమకు బాధ్యతలను అప్పగిస్తాడు భరణి.. హోమ్ మంత్రి కూతురు కాంతి ( తాన్యా రవిచంద్రన్ )కి నృత్య శిక్షణిస్తున్న డాన్స్ గురూజీ  ( హర్షవర్ధన్ )  వృత్తి పరంగా ఇన్సూరెన్స్ ఏజెంట్.. ఆయనకు అసిస్టంట్ గా హోమ్ మంత్రి ఇంట్లోకి ప్రవేశిస్తాడు విక్రమ్ ఈ క్రమంలో కాంతి తో ప్రేమలో పడతాడు.. ఆమె ప్రేమను పొందడానికి రకరకాల ఫీట్లు చేస్తుంటాడు.. ఈ క్రమంలో హోమ్ మంత్రి ఇంట్లో రక్షణ దళం లో పని చేస్తున్న ఏసీపీ గోవిందు (సుధాకర్ కోమాకుల)కు పట్టుబడతాడు. దాంతో విక్రమ్ ఎవరు? అనే విషయాన్ని గోవిందుకు రివీల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. (ఉద్యమకారుడు) కామ్రేడ్ గా చలామణి అవుతూ, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న (పశుపతి) నుంచి, హోమ్ మంత్రి ప్రాణాలను రక్షించడానికి విక్రమ్ ఎంత రిస్క్ చేశాడు? చివరికి హోమ్ మంత్రిని రక్షించాడా లేదా? కాంతి ప్రేమను దక్కించుకోవడానికి ఎన్ని కష్టాలెదురుక్కొంటాడు ?. ఈ చిత్రంలో మెయిన్ విలన్ ఎవరు ?  తదితర విషయాలన్నీ తెరమీదే చూడాల్సిందే.

కథనం : డైరెక్టర్ ఎంచుకున్న లైన్ బాగుంది. సినిమాలో అక్కడక్కడా కొంచెం ల్యాగ్ అనిపించచ్చు. ఐతే తనికెళ్ళ భరణి, కార్తికేయ కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ కి మాత్రం బాగ వర్కౌట్ అయ్యాయి. వీటి తో పాటు హర్షవర్ధన్ సినిమా మొత్తం తనదైన కామెడి టైమింగ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకోవడం లో సక్సెస్ అయ్యారు. ఇంటర్వల్ సీన్ ట్విస్ట్ ఎంతో ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఈ ఒక్క సీన్ తో సెకండాఫ్ మీద విపరీతమైన క్యూరియాసిటి ని క్రియేట్ చేసారు . సినిమాలో క్లైమాక్స్ వచ్చే ఫైట్ హైలెట్ .ఇక ధూల్పేట్ సీన్ లో ఒక పక్క సీరియస్ గానే నడుస్తూ ఫన్ బాగా జనరేట్ చేసారు. ఐతే విలన్ పసుపతి క్యారెక్టర్ విషయం లో డైరెక్టర్ ఇంకొంచెం కేర్ తీసుకొని ఉంటే బాగుండు అనిపిస్తుంది.

 

నటీనటులు :
కామెడీ టైమింగ్ తో క్యాజువల్ బిహేవియర్ తో ఫన్ తో పాటు యాక్షన్ అండ్ లవ్ సన్నివేశాల్లో కొత్త రకమైన హావ భావాలను ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు కార్తికేయ. డాన్స్ ఇరగదీశాడు.. తాన్యా రవిచంద్రన్ బేసికల్లీ తమిళ అమ్మాయి. తెలుగు తెరకు తొలి పరిచేయమే అయినా పదహారణాల తెలుగింటి ఆడపిల్లలా కనిపిస్తుంది. అందం తో పాటు అభినయంతో కుర్రకారును ఆకట్టుకుంటుంది. హోమ్ మంత్రిగా సాయికుమార్ తన పరిది మేరకు నటించారు.. (NIA) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ లీడ్ చేసే అధికారి గా తనికెళ్ళ భరణి పాత్ర,  సంభాషణలు సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి. ఇన్సూరెన్స్ ఏజెంట్ గా హర్షవర్ధన్ క్యారెక్టర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నవ్విస్తుంది. హర్షవర్ధన్ మార్క్ కనిపిస్తుంది. ఏసీపీ గా సుధాకర్ కోమాకుల నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర పోషించాడు ఆయన నటనలో మెచ్యూరిటీ కనిపించింది. ప్రముఖ తమిళ విలక్షణ నటుడు పశుపతి తన పాత్ర పరిధి మేరకు నటించాడు.. ఆయనను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడంలో దర్శకుడు కొంత తికమక పడ్డాడాని అనిపిస్తుంది. ఇంకా రాజేష్ ఉల్లి, జబర్దస్త్ నవీన్  , జెమిని సురేష్ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం :
నిర్మాతలు 88 రామారెడ్డి, టి ఆదిరెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు శ్రీ సరిపల్లి అక్కడక్కడా కొంత కంగారు పడినప్పటికీ ఈ చిత్రాన్ని ఆసక్తి కరంగా మాలచడంలో విజయం సాధించారు. కొన్ని పాత్రలను దర్శకుడు ఇంకా ఉపయోగించుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.. ప్రశాంత ఆర్ విహారి సంగీతం, రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అలరిస్తుంది. పి. సి. మౌళి ఛాయాగ్రాహణం చాలా బ్యూటీఫుల్ గా ఉంది. జస్విన్ ప్రభు కూర్పు బాగా కుదిరింది. నరేష్ తిమ్మరి, శ్రీ రూప్ మీనన్ ఆర్ట్ సెట్స్ బాగున్నాయి. సుబ్బు, నబా లు చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ ఈ చిత్రంలో హైలెట్ అని చెప్పుకోవచ్చు.

 

చివరిగా : సినిమాలో డైలాగ్స్ బాగా పేలాయి ..

Rating : 3.25/5

 

 

Leave a comment

error: Content is protected !!