సుధీర్ బాబు, ఆనంది జంటగా 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కరుణ కుమార్ తెరకెక్కించిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఆగస్ట్ 27న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. సినిమా విడుదలైన రోజే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకంగా షో వేసుకొని చూశారు. శ్రీదేవి సోడా సెంటర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు మహేష్ బాబు. సుధీర్ బాబు అద్భుతంగా నటించారని.. ఆయన కెరీర్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే అంటూ మహేష్ మన్ననలు అందించారు. ఆడవాళ్ళంతా తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది అటు మహేష్ బాబు తెలిపారు. సినిమాలో హీరోయిన్ ఆనంది పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందని.. ఆమె నటన అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు మహేష్ బాబు. శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో మహిళా ప్రాధాన్యత సన్నివేశాలు చాలా ఉన్నాయి అంటూ తెలిపారు మహేష్ బాబు. మరీ ముఖ్యంగా సినిమాలో బోట్ సన్నివేశాల గురించి మహేష్ బాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ రేసింగ్ సీన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. సినిమాలో శ్యామ్‌దత్ సైనుద్దీన్ గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. దాంతో పాటు జైలులో వచ్చే స్యాడ్ సాంగ్ లో ఫైట్ పెట్టడం అద్భుతమైన ఆలోచన అన్నారు మహేష్ బాబు. హీరోయిన్‌కు పెళ్లైపోయింది అని తెలిసినపుడు సుధీర్ బాబు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్.. ఆ పాట అన్నీ మరో స్థాయిలో ఉన్నాయన్నారు మహేష్ బాబు. మణిశర్మ సంగీతం నెక్ట్స్ లెవల్‌లో ఉందని.. ఈ సినిమాకు ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ప్రాణం అని తెలిపారు మహేష్ బాబు. ఈ సినిమాలో ఇలాంటి అద్భుతమైన సన్నివేశాలు సినిమాలో ఇంకా చాలా ఉన్నాయని తెలిపారు మహేష్ బాబు. ఈ సినిమాను అందరూ చూసినపుడే దర్శకుడు చూపించిన విషయం.. చెప్పాలనుకున్న సందేశం ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుందని.. అందుకే ప్రతీ ఒక్కరూ శ్రీదేవి సోడా సెంటర్ చూడాలని కోరారు మహేష్ బాబు. తాజాగా హీరో సుధీర్ బాబు, నిర్మాతలు, దర్శకుడు ప్రత్యేకంగా వెళ్లి మహేష్ బాబును కలిశారు. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నా.. వ్యక్తిగతంగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమా యూనిట్ ను కలిసి తన అభినందనలు అందించారు మహేష్ బాబు. ఇలాంటి అద్భుతమైన సినిమాలు సుధీర్ బాబు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకున్నారు. అలాగే చిత్రయూనిట్ ను కూడా ప్రత్యేకంగా అభినందించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈయన ప్రశంసలతో శ్రీదేవి సోడా సెంటర్ చిత్ర యూనిట్ సంతోషంలో మునిగిపోయారు. మహేష్ బాబుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు.
నటీనటులు:
సుధీర్ బాబు, ఆనంది , పవెల్ నవగీతమ్,నరేష్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్హ వర్దన్, సప్తగిరి, కళ్యణి రాజు, రొహిణి, స్నేహ గుప్త తదితరులు
టెక్నికల్ టీం:
రచన-దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
బ్యానర్: 70mm ఎంటర్టైన్మెంట్స్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ దత్ సైనుద్దీన్
సంగీతం: మణిశర్మ
ప్రోడక్షన్ డిజైనర్: రామకృష్ణ- మౌనిక
కథ: నాగేంద్ర కాషా
కొరియొగ్రాఫర్స్: ప్రేమ్ రక్షిత్, విజయ్ బిన్ని, యశ్వంత్
యాక్షన్: డ్రాగన్ ప్రకాష్, కె ఎన్ ఆర్ (నిఖిల్) , రియల్ సతీష్
లిరిక్స్: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కళ్యాణ చక్రవర్తి, కాసర్ల శ్యామ్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘశ్యామ్