సూపర్‌స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ ‘సర్కారువారి పాట’. ఈ చిత్రం నుంచి స్పెషల్ డే..మహేశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన బ్లాస్టర్ కు అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ బ్లాస్టర్ లో మహేశ్ చాలా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. తన యాట్యిట్యూడ్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. అన్ని అంశాలతో ఓ ఎంటర్టైనింగ్ రోల్లో, మహేశ్‌ను ఎలివేట్ చేసిన తీరు చూసి డైరెక్టర్ పరశురాంను ప్రేక్షకాభిమానులు అప్రిషియేట్ చేశారు.
రీసెంట్గా ‘సర్కారువారి పాట’ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యింది. శుక్రవారం నుంచి గోవాలో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఓ భారీ సెట్ వేసి ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలను చిత్రకరిస్తున్నారు. దీంతో పాటు కొంత టాకీ పార్టును కూడా చిత్రీకరిస్తారు. ఈ గోవా షెడ్యూల్లో ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి గోవా షెడ్యూల్ వర్కింగ్ స్టిల్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో మహేశ్, పరశురాం, రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ నెక్స్ట్ తీయబోయే సీన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు.
`సర్కారువారి పాట`ను పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఆర్.మది సినిమాటోగ్రాఫర్. మార్తాండ్ కె.వెంకటేశ్ ఎడిటర్, ఎ.ఎస్.ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్. వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 13న సినిమాను విడుదలచేస్తున్నారు.
నటీనటులు:
మహేశ్, కీర్తి సురేశ్, వెన్నెలకిషోర్, సుబ్బరాజు తదితరులు
సాంకేతిక వర్గం:
సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: పరశురాం పెట్ల
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట
బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్
మ్యూజిక్: ఎస్.ఎస్.తమన్
సినిమాటోగ్రఫీ: ఆర్.మది
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేశ్
ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్.ప్రకాశ్
ఫైట్స్: రామ్ లక్ష్మణ్
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్
కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్
సి.ఇ.ఓ: చెర్రీ
వి.ఎఫ్.ఎక్స్ సూపర్ వైజర్: యుగంధర్