డైలాగ్ కింగ్ సాయికుమార్ గారు మాట్లాడుతూ
నా సినీ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో పోలీస్ స్టోరీ, ప్రస్థానం చిత్రాలు నాకు ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఇచ్చాయి. నా యాభై ఏళ్ల సినీ జీవితంలో నేను ఇప్పటి వరుకు పోషించిన పాత్రలు నా ఫస్ట్ ఇన్నింగ్స్ కి వైభవాన్ని తీసుకొస్తే నా సెకండ్ ఇన్నింగ్స్ కి అద్భుతమైన గుర్తింపును తీసుకొచ్చే సినిమాగా SR కళ్యాణమండంపం EST 1975 అవ్వడం ఖాయం. హీరో కిరణ్ అబ్బవరం చాలా ఫోకస్ డ్ గా పనిచేస్తూ ఉంటాడు, ఈ సినిమాతో కిరణ్ మంచి పేరు, గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను, అలానే ప్రేక్షకుల మా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసి ప్రోత్సహించాలని ప్రార్థిస్తున్నాను అని అన్నారు
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ
కుటంబ సమేతంగా చూడదగ్గ సినిమా మా SR కళ్యాణమండంపం EST 1975. ఈ సినిమాకు పనిచేసిన ప్రతిఒక్కరికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను థియేటర్లలో, టీవీల్లో చూసిన సాయికుమార్ వంటి గొప్ప నటులు పక్కన నేను నటించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాను నమ్మి ఈ చిత్రానికి సంబంధించిన రైట్స్ తీసుకున్న శంకర్ పిక్చర్స్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేనే కథ చెప్పగానే నన్ను నమ్మిన ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేతలు ప్రమోద్, రాజులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. వారి ప్రోత్సాహం లేకపోతే ఈ సినిమా ఇలా వచ్చేది కాదు. అలానే దర్శకుడు శ్రీధర్ ఈ సినిమా ఆద్యంతం అలరించే రీతిన తీర్చిదిద్దారు. మేమంతా చేసిన ఈ ప్రయత్నాన్ని ఆగస్ట్ 6న థియేటర్లకి వచ్చి ప్రేక్షకులు ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు
తారాగణం – కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, సాయికుమార్ తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ – ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్
వరల్డ్ వైడ్ రైట్స్ – శంకర్ పిక్చర్స్
నిర్మాతలు – ప్రమోద్, రాజు
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ – కిరణ్ అబ్బవరం
దర్శకుడు – శ్రీధర్ గాదే
సంగీతం – చేతన్ భరద్వాజ్
కెమెరా – విశ్వాస్ డేనియల్
ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్ – భరత్
లిరిక్స్ – భాస్కరభట్ల, క్రిష్ణ కాంత్
పీఆర్ఓ – ఏలూరుశ్రీను, మేఘశ్యామ్
ఆర్ట్ – సుధీర్
డిఐ – సురేశ్ రవి
ఫైటర్ – శంకర్