‘క్రాక్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తరవాత హీరో రవితేజ, సెన్సేష‌న‌ల్ హిట్‌ ‘రాక్షసుడు’ తర్వాత దర్శకుడు రమేశ్‌ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఖిలాడి’. ‘ప్లే
స్మార్ట్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ పెన్‌ స్టూడియోస్‌ అధినేత జయంతిలాల్‌ గడ సమర్పణలో సినిమాను ఎ స్టూడియోస్, హవీష్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై నిర్మాత కోనేరు సత్యనారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రవితేజ ద్విపాత్రా భినయం చేస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, డింపుల్‌ కపాడియా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మేజర్‌ షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంద‌ని వెల్లడిస్తూ చిత్రయూనిట్‌ ‘ఖిలాడి’ సినిమాలోని రవితేజ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్ట‌ర్లో స్పోర్ట్స్‌ బైక్‌పై అల్ట్రా స్టైలిష్‌లుక్‌లో అదిరి పోయేలా కనిపిస్తున్నారు హీరో రవితేజ. అలాగే కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ముందే ఇటలీలో ఓ భారీ షెడ్యూల్‌ను ‘ఖిలాడి’ చిత్రయూనిట్‌ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసిన విషయం తెలిసిందే. ‘ఖిలాడి’ సినిమా థియేటర్స్‌లో ఆడియన్స్‌కు అదిరిపోయే థ్రిలింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేందుకు దర్శకుడు రమేశ్‌ వర్మ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ దానికోసం ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెట్టి వ‌ర్క్ చేస్తున్నారు.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సుజిత్‌ వాసుదేవ్, జీకే విష్ణు ఛాయాగ్రాహకులు. శ్రీకాంత్‌ విస్సా, సాగర్‌ (ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ తమ్ముడు) ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యం అందిస్తున్న ఈ చిత్రానికి అమర్‌ రెడ్డి ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

నటీనటులు: రవితేజ, మీనాక్షీ చౌదరి, డింపుల్‌ కపాడియా

సాంకేతిక విభాగం
కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌: రమేష్‌ వర్మ
ప్రొడ్యూసర్‌: కోనేరు సత్యానారాయణ
బ్యానర్స్‌: ఏ స్టూడియోస్, పెన్‌ స్టూడియోస్‌
సమర్పణ: జయంతిలాల్‌ గడ
మ్యూజిక్‌ డైరెక్టర్‌: దేవి శ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: సుజిత్‌ వాసుదేవ్, జీకే విష్ణు
స్క్రిప్ట్‌ కో ఆర్టినేషన్‌: పాత్రికేయ
ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్, అన్భు- అరివు
డైలాగ్స్‌: శ్రీకాంత్‌ విస్సా, సాగర్‌
ఎడిటింగ్‌: అమర్‌ రెడ్డి
లిరిక్స్‌: శ్రీమణి
స్టిల్స్‌: సాయి మాగంటి
మేకప్‌: ఐ. శ్రీనివాసరాజు
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మురళీకృష్ణ కోడాలి
పబ్లిసిటీ: రామ్‌ పెద్దింటి సుధీర్‌
కో డైరెక్టర్‌: పవన్‌ కేఆర్‌కే
ఆర్ట్‌: గాంధీ. ఎన్‌
పీఆర్‌వో: వంశీ – శేఖర్‌

Leave a comment

error: Content is protected !!