విక్టరీ వెంకటేష్, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో రూపొందిన తాజా మాస్ ఎంటర్టైనర్ ‘నారప్ప’. డి. సురేష్‌బాబు, కలైపులి యస్ థాను సంయుక్తంగా నిర్మించిన ‘నారప్ప’ చిత్రం ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ రోజు (జూలై 14)న ‘నారప్ప’ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ‘నీదైన దాని కోసం పోరాటం చెయ్యి..సరైన సమయంలో..’అంటూ ‘నారప్ప’ ట్రైలర్‌ను షేర్ చేశారు విక్టరీ వెంకటేష్. ‘‘నారప్ప’ ట్రైలర్ కసిగా ఉంది’’ అని ట్వీట్ చేశారు రానా.
విడుదలైన ‘నారప్ప’ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో పాటుగా సినిమాలపై అంచనాలను మరింత పెంచేస్తుంది. ఈ చిత్రంలో వెంకటేష్ తండ్రి, కొడుకు పాత్రల్లో డ్యూయల్ రోల్ చేశారు. ఈ చిత్రంలో వెంకటేష్ భార్య సుందరమ్మగా ప్రియమణి, వెంకటేష్ పెద్ద కొడుకుగా కార్తీక్ రత్నం కనిపిస్తారు.
‘నారప్ప’ ట్రైలర్లో సన్నివేశాలు, డైలాగ్స్ బాగున్నాయి. కానీ కేవలం ట్రైలర్‌తో నారప్ప సినిమా ఫ్లాట్‌ను ఊహించడం కష్టం. ఎందుకంటే సినిమాలో ప్రేక్షకులు ఊహించలేని మలుపులు, ఆశ్చర్యపోయే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఇక తండ్రి కొడుకులు గా విక్టరీ వెంకటేష్ అద్భుతంగా నటించారు. విడుదలైన ‘నారప్ప’ ట్రైలర్లో విద్య గొప్పదనం, ప్రాముఖ్యత గురించి సీనియర్ వెంకటేష్ చెప్పిన డైలాగ్స్ ఆసక్తికరంగా, ఆలోచించదగినవిగా ఉన్నాయి.
తన ప్రత్యర్థులపై విరుచుకుపడి రక్తంతో తడిసిన యంగ్ వెంకటేష్ సీన్, కోపోద్రోక్తుడైన ఓల్డర్ క్యారెక్టర్ వెంకటేష్ షాట్‌తో ట్రైలర్ ముగుస్తుంది. నటీనటుల పెర్ఫార్మెన్స్, టెక్నికల్ వేల్యూస్‌తో విడుదలైన ‘నారప్ప’ ట్రైలర్ అద్భుతంగా, మణిశర్మ సంగీతం ఇంప్రెసివ్‌గా ఉంది.ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫర్.
నటీనటులు: వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రామ్, రావు రమేష్, రాజీవ్ కనకాల
సాంకేతిక విభాగం
డైరెక్టర్: శ్రీకాంత్ అడ్డాల
ప్రొడ్యూసర్స్: సురేష్‌బాబు, కలైపుతి యస్.థాను
మ్యూజిక్ డైరెక్టర్: మణిశర్మ
డీఓపీ: శ్యామ్ కె నాయుడు
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
స్టోరీ: వెట్రిమారన్
స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్
ఫైట్స్: పీటర్ హెయిన్, విజయ్
లిరిక్స్: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి,సుద్దాల అకోశ్ తేజ, అనంత శ్రీరామ్, కృష్ణకాంత్, కాసర్ల శ్యామ్
ఫినాన్స్ కంట్రోలర్: జి. రమేష్‌రెడ్డి
ప్రొడక్షన్ కంట్రోలర్: డి. రామాబాలజీ
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఏపీ పాల్ పండి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ శంకర్ డొంకాడ
కో ప్రొడ్యూసర్: దేవి శ్రీదేవి సతీష్