విలువైన మ్యూజిక్ డైరెక్టర్ – విలువలున్న మ్యూజిక్ డైరెక్టర్ వన్రాజ్ భాటియా. ‘ అంకుర్ ‘ ‘భూమిక ‘ ‘నిషాంతీ ”36 చౌరంఘీలేన్ ‘ ‘ మంధన్ ‘ ‘జునూన్ ‘ మండీ ‘ లాంటి గొప్ప గొప్ప సినిమాల్ని తన స్వరాలతో నిలబెట్టినవాడు భాటియా. ప్రసిద్ధ దర్శకుడు శ్యాం బెన్ గల్ కి దాదాపు పర్మినెంట్ మ్యూజిక్ డైరెక్టర్. గొప్ప గొప్ప ఆర్ట్ ఫిలిమ్స్ కి హార్ట్ లా నిలిచిన భాటియా, వందలాది వాణిజ్య ప్రకటనలకు, అనేక డాక్యుమెంటరీలకు కూడా తన స్వరసాయం చేశారు. దామిని లాంటి వాటికి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో ఒకే ఒక సినిమాకి పని చేశారు. శ్యాం బెనగల్ తీసిన ఆ సినిమా పేరు అనుగ్రహం ( 1978 ) వాణిశ్రీ , అనంత్ నాగ్, స్మితా పాటిల్ , రావుగోపాలరావు , అమ్రీష్ పురి లాంటి హేమ హేమీలు నటించారు. స్మితా పాటిల్ నటించిన ఏకైక తెలుగు సినిమా కూడా ఇదే. ఆవిడ ఈ చిత్రానికి కళాదర్శకత్వం కూడా చేశారు. మాటలు, పాటలూ ఆరుద్ర రాశారు. స్క్రీన్ ప్లే లో గిరిష్ కర్నాడ్, శ్యాం బెనగల్ కి తోడ్పాటు అందించారు. దీనికి ఛాయా దర్శకుడు గోవింద్ నిహ్లానీ. నిర్మాత కాటమరెడ్డి,  వెంకట రామిరెడ్డి పేరు చెప్పక పోతే తప్పు అవుతుంది. ఇందులో పాటలు బావుంటాయి. ‘ జయమ్మా ఇది నీ సీమంతమే ‘, ‘ ఇది వరమోశాపమో ‘ , ‘ సీతను సోకెను రావణ హస్తం ‘ వంటి పాటలు కథ మూడ్ ని బాగా ఎలివేట్ చేస్తాయి. ఫార్ములాలకి దూరంగా మ్యూజిక్ చేసిన మహానుభావుడు వన్రాజ్ భాటియా. 
writer – Pulagam Chinnarayana 

Leave a comment

error: Content is protected !!