Shopping Cart 0 items - $0.00 0

‘అందాల రాక్షసి’ని నానీ మిస్సయ్యాడా?

కొన్ని సినిమాలు డ‌బ్బులు తెచ్చిపెట్ట‌క‌పోయినా మంచి పేరు తెస్తాయి. అలా హ‌ను రాఘ‌వ‌పూడికి మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రం అందాల రాక్ష‌సి. 2012లో విడుద‌ల‌యిన ఈ మూవీ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయిన‌ప్ప‌టికీ మ్యూజిక‌ల్ గా మాత్రం చాలా పెద్ద హిట్ అయ్యింది. రాడాన్ మ్యూజిక్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఈ మూవీలో అన్ని పాట‌లు హిట్ కావ‌డ‌మే కాదు యూత్ హార్ట్స్ లో ప్లేస్‌ను కూడా కొట్టేసింది. ఈ సినిమా ఇంట‌ర్వెల్ బ్యాంగ్ కూడా అదిరిపోతుంది.
న‌వీన్ చంద్ర‌, రాహుల్‌, లావ‌ణ్య త్రిపాఠి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ మూవీ కి డైరెక్ట‌ర్ హ‌ను ముందుగా అనుకున్న హీరో నేచుర‌ల్ స్టార్ నాని. స్టోరీ కూడా నేరేట్ చేసాడ‌ట‌. ఇందులో సూర్య క్యారెక్ట‌ర్ చేసిన న‌వీన్ చంద్ర క్యారెక్ట‌ర్‌లో నాని ప్లేస్ చేద్దామ‌నుకున్నాడ‌ట హ‌ను రాఘ‌వపూడి. ఎందుకో ఏమోగా నీ నానికి అందాల రాక్ష‌సి మూవీ స్టోరీ నచ్చ‌లేదు. సో ఆ విధంగా అందాల రాక్ష‌సి మూవీలో హీరో ఆఫ‌ర్‌ని రిజెక్ట్ చేయ‌డం జ‌రిగింది. అలా క‌లిసి వ‌ర్క్ చేయ‌లేక‌పోయిన ఈ ఇద్ద‌రు.. కృష్ణ‌గాడి వీర‌ప్రేమగాధ‌తో మంచి హిట్ కొట్టారు.

Leave a comment

error: Content is protected !!