మెగాస్టార్ చిరంజీవిని , సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఇలా పక్కపక్కనే చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది కదూ. నిజానికి వీరిద్దరూ కలిసి వారి కెరీర్ బిగినింగ్ లో ‘కాళి, బందిపోటు సింహం’ (తమిళం నుంచి తెలుగుకు డబ్బింగ్ అయిన చిత్రం) చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఇద్దరూ వారి వారి భాషల్లో టాప్ స్టార్స్ అవడం వల్ల మళ్లీ స్ర్కీన్ షేర్ చేసుకోవడం కుదరలేదు. అయితే రజనీకాంత్ నటించిన ఒక తమిళ చిత్రలో చిరు ఒక గెస్ట్ రోల్ పోషించారు. ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రం తెలుగులో ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవడంతో అదే చిత్రాన్ని అరవింద్ తమిళంలో ‘మాపిళ్లై’గా రీమేక్ చేశారు. అందులో రజినీకాంత్ పెళ్ళిచేసుకొనే సీన్ లో .. ఆ పెళ్ళిని ఆపడానికి కొంతమంది రౌడీల్ని పురమాయిస్తుంది అత్త పాత్రధారి అయిన శ్రీవిద్య (తెలుగులో వాణిశ్రీ పాత్ర). ఆ సిట్యువేషన్ లో వాళ్ళను డీల్ చేయానికి నేనెందుకు ? నా ఫ్రెండ్ ఉన్నాడని చిరంజీవికి ఫోన్ చేస్తాడు రజనీకాంత్. చిరు ఎంట్రీ ఇచ్చి చాలా స్టైలిష్ గా ఫైట్ చేసి .. రజినీకాంత్ పెళ్లి సవ్యంగా జరిగేలా చేస్తాడు. అసలు ఒరిజినల్ వెర్షన్ లో పెళ్ళి జరిగేటప్పుడు ఫైట్ సీన్ లేదు. కానీ నిర్మాత అరవింద్ అవడంతో .. రజనీకాంత్ ఫ్రెండ్ గా చిరు ఎంట్రీ ఇచ్చినట్టు సీన్ క్రియేట్ చేశారు. ఈ ఫోటోలో ఇద్దరు టాప్ స్టార్స్ అదిరిపోయారు కదా.