ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన కూడా కోవిడ్సెకండ్ వేవ్ప్రభావం మునుపటి కంటే తీవ్రంగా ఉంది. మహమ్మారి వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. అవి కొన్ని ఆర్ధిక స్థోమతలేక కొందరు, ఆసుపత్రుల్లో సరైన వైద్య వసతులు లేక మరి కొందరు.

సినిమా ఇండస్ట్రీ నుండి నటులు తమవంతు సాయంగా కోవిడ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. అందులో ముఖ్యంగా మెగాస్టార్చిరంజీవి, నాగార్జున ట్విట్టర్ వేదికగా ప్లాస్మాను దానం చేయాలంటూ పిలుపునిస్తూ చైతన్యాన్ని కలిగిస్తున్నారు. మరో నటుడు హర్షవర్ధన్ రానే హైదరాబాద్ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ అవసరం ఉన్నవాళ్లకోసం తన బైక్ ను అమ్ముతున్నట్లు ట్విట్టర్ లో తెలిపాడు. ఇటీవల  ఆక్సిజన్ లేక మృతి చెందిన సామాన్యులు చాలా మందే ఉన్నారు.

చిరంజీవి ట్వీట్ :

కోవిడ్ సెకండ్వేవ్చాలా మందిపై ప్రభావం చూపుతుందనే సంగతి మీ అందరికీ తెలిసిందే. కొన్నిరోజుల ముందు మీరు కోవిడ్నుంచి కోలుకుని ఉంటే, మీ ప్లాస్మాను దానం చేయండి. దీని కారణంగా మరో నలుగురు కోవిడ్ను సమర్ధవంతంగా ఎదుర్కోగలరు. వివరాల కోసం, గైడెన్స్కోసం చిరంజీవి చారిట్రబుల్ ట్రస్ట్ను సంప్రదించాలని కోరుతున్నానుఅంటూ ట్రస్ట్నెంబర్ను ట్వీట్ చేశారు చిరంజీవి.

నాగార్జున ట్వీట్ :

ప్లాస్మా డొనేట్ చేసే దిశగా టీ హోప్అనే స్వచ్చంద సంస్థలో అందరూ భాగం కావాలని కోరుతూ నాగార్జున ట్వీట్చేశారు.

హర్షవర్ధన్ రానే ట్వీట్ :

ఆక్సిజన్ లభించక నరకయాతన పడుతున్న బాధితులకు అండగా నిలవడానికి ఏకంగా తన బైక్ను అమ్మకానికి పెట్టాడు హర్షవర్ధన్ రానే. ‘తన బైక్ను తీసుకొని ఆక్సిజన్ను ఇవ్వండని, అవసరమైన పేషెంట్లకు దాన్ని అందిస్తానని ట్విట్టర్ ద్వారా తెలియపరిచారు.’ తను కూడా గతేడాది అక్టోబర్లో కరోనా బారిన పడి అనంతరం మహమ్మారిని జయించాడు.

 

View this post on Instagram

 

A post shared by Harshvardhan Rane (@harshvardhanrane)

Leave a comment

error: Content is protected !!