సినిమా బండిపేరే ఆసక్తి కరంగా ఉంది కదా..! ప్రవీణ్ కంద్రెగుల దర్శకుడిగా పరిచయమవుతూ అంతా కొత్తవారితో తెరకెక్కిన సినిమాసినిమా బండి‘. సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ యూనిట్. ట్రైలర్ ఆధ్యాంతం సరదా సన్నివేశాలతో వినోదభరితంగా ఆసక్తికరంగా  ఉంది. ఒక ఖరీదైన కెమెరాను ఎవరో షేర్ ఆటోలో మరిచిపోతారు. ఆటో డ్రైవర్ తన స్నేహితులు కలిసి సినిమా తీయాలనుకుంటారు. కానీ నిజానికి వాళ్లకు కెమెరాతో సినిమా ఎలా తీయాలో తెలీదు. కెమెరాతో వాళ్ళు చేసిన ప్రయోగాలు, ట్రైలర్ లో నటీనటులు సినిమా తీసే క్రమంలో వచ్చే సన్నివేశాలు, కామెడీ, డైలాగులు నవ్విస్తున్నాయి.

ఫ్యామిలీ మ్యాన్వెబ్ సీరీస్ ను డైరెక్ట్ & ప్రొడ్యూస్ చేసిన రాజ్ & డి.కె సమర్పకులుగా వస్తున్న తెలుగు సినిమా ఇది. మే 14 సినిమా బండినెట్ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. సరదా సన్నివేశాలసినిమా బండిట్రైలర్ ను మీరు చూసేయండి.

Leave a comment

error: Content is protected !!