పవన్ కళ్యాణ్ మూడేళ్ళ విరామం తర్వాత చేసిన సినిమా ‘వకీల్ సాబ్’. ఈ నెల 9న థియేటర్స్ లో భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా మొదటి రెండు వారాలు హిట్ టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ ను సంపాదించింది. ఐతే కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఇరు తెలుగు రాష్టాలలో బలంగా ఉండటం, కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సగటు ప్రేక్షకుడు థియేటర్ లో సినిమా చూసే అవకాశం లేకపోవడంతో మూడో వారానికి పరిస్థితి కొంచం డల్ అవ్వటం…. బయట పరిస్థితులు బాగోలేకపోవడంతో ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా… సినిమా ఈ శుక్రవారం నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ లో ఈ సినిమాని మిస్ అయ్యినవాళ్లు ఇక ఇంట్లోనే ఈ వకీల్ సాబ్ ను చూడొచ్చు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతి హాసన్ పవన్ కి జోడిగా నటించగా, అంజలి, నివేదా థామస్, అనన్య నాగేళ్ల కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకి థమన్ సంగీతం, నిర్మాత దిల్ రాజు.

LINK – http://amzn.to/VS 

Leave a comment

error: Content is protected !!