ఫొటో జర్నలిస్ట్ గా కెరీర్ ని మొదలు పెట్టి ఆ తర్వాత సినిమాటో గ్రాఫర్ గా ,  డైరెక్టర్ గా మారిన కె.వి.ఆనంద్ (54) చెన్నైలోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో ఈ శుక్రవారం ఉదయం 3 గంటలకు కన్నుమూశారు. కె.వి.ఆనంద్‌ సినిమాటోగ్రాఫర్‌గా పలు తమిళం, మలయాళం, తెలుగు, బాలీవుడ్‌ చిత్రాలకు పని చేశారు. తెలుగులో మోహన్ బాబు దాసరి నారాయణరావు నటించిన ‘పుణ్యభూమి నాదేశం’ సినిమాకు ఆయనే సినిమాటోగ్రాఫర్‌.‘తెన్నావిన్‌ కోంబత్’ చిత్రానికి కె.వి.ఆనంద్‌ జాతీయ అవార్డు వరించింది. ఈ చిత్రాల తో పాటు ప్రేమదేశం, షారుఖ్ ఖాన్ జోష్, అమితాబ్ ఖాకి, డైరెక్టర్ శంకర్ తో బాయ్స్, శివాజి , హింది నాయక్ చిత్రాలకి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేసారు. తర్వాత మెగాఫోన్ పట్టి దర్శకుడుగా మారిన ఆనంద్ వీడొక్కడే,‘రంగం’,‘బందోబస్తు’,‘బ్రదర్స్‌’,అనేకుడు వంటి వైవిధ్యమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇందులో రంగం, వీడొక్కడే చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఆయన ఆకస్మిక మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!