ప్రేమ ఖైదీసినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కన్నడ నటి మాలాశ్రీ. తర్వాత ఆమె దక్షిణాది భాషల్లో హీరోయిన్ గా రాణించి, తర్వాత లేడి ఓరియెంటెడ్ కథలతో తెరకెక్కిన యాక్షన్ సినిమాల్లోనూ నటించి ఏంతో మంది  అభిమానులను సంపాదించుకుంది. స్టార్హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటి మాలాశ్రీ కన్నడ సినిమా పరిశ్రమలో ఎన్నో సూపర్హిట్సినిమాలను నిర్మించిన కొణిగల్రామును వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె. అయితే గత వారం ఆయనకు కరోనా సోకగా బెంగుళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ కొణిగల్ రాము(52) సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. దీనితో కన్నడ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. 1990 కాలంలో ని శాండల్ వుడ్ లో ప్రముఖ నిర్మాతగా వెలుగు వెలిగారు. దాదాపు 39 చిత్రాలను నిర్మించిన ఆయనకుకోటి రాముఅన్న పేరుంది. కోట్లాది రూపాయలు పెట్టి సినిమాలు తీసినందుకు ఆయనకు పేరు వచ్చింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సామాజిక మాధ్యమం ద్వారా అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తపరుస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!