వెండి తెరపై అగ్రనటులుగా రాణించి ఆ రాష్టాలకే ముఖ్యమంత్రులైన వారిలో తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావులా… తమిళ చిత్ర పరిశ్రమలో ఎం.జి రామచంద్రన్ లా… కన్నడ చిత్ర పరిశ్రమలో రాణించిన అగ్రనటులు కన్నడ రాజ్ కుమార్. ఆయన కర్ణాటక రాష్టంలో ఓ సువర్ణ అధ్యాయం లిఖించి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గా ప్రసిద్ధి పొందారు. ‘బెదర కన్నప్ప‘ సినిమా ద్వారా పూర్తి స్థాయి నటుడిగా మారిన రాజ్‌కుమార్ అక్కడి నుండి వరుస అవకాశాలు అందుకుంటూ అగ్రనటులుగా కన్నడ చిత్ర పరిశ్రమలో రాణించారు. ఆయనకు కన్నడ నాటే కాదు దేశ వ్యాప్తంగా కూడా మంచి పేరుంది. రాజ్ కుమార్ నటుడిగానే కాకుండా సింగర్‌గాను అలరించారు. ఆయన మొత్తంగా తన కెరీర్ లో 206 సినిమాలలో నటించిన మహా నటుడు రాజ్ కుమార్. ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. పద్మ భూషణ్, కర్ణాటక రత్న, దాదా సాహెబ్ ఫాల్కే, కెంటకీ కల్నేల్ ఇలా ఎన్నో అవార్డులు దక్కించుకున్నారు. 2006, ఏప్రిల్ 12న రాజ్ కుమార్ అందరిని విడిచి అనంతలోకాలకేగారు. నేడు ఆయన 91వ జయంతి కావడంతో అటు అభిమానులు ఇటు సినిమా సెలబ్రిటీలు సైతం ఆయనపై ఉన్న అభిమానాన్ని, అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సామాజిక మాధ్యమం ద్వారా పంచుకుంటున్నారు. ఆ మహా నటుడు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ జయంతి సందర్బంగా ఘననివాళులు అందిస్తుంది మూవీ వాల్యూం.