పాలరాతి శిల్పం వంటి రూపం… నేరేడు లాంటి కళ్ళు… నవ్వితే ముత్యాలు రాలేటి పళ్ల వరుస… అన్నీ అందాలు కలపగ వచ్చిన ఝరి – అంజలా ఝవేరి. ఈ రోజు బర్త్ డే సందర్భంగా…

తన సినిమాల విషయాలు.. మీకోసం…

వెంకటేశ్‌ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రూపొందించిన పలు చిత్రాలతో సరికొత్త హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అలా పరిచయమైన వాళ్ళలో అంజలా ఝవేరి కూడా ఒకరు. తొలి సినిమా ‘ప్రేమించుకుందాం రా..!’ ఈ బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి దర్శకుడు జయంత్‌ సి.పరాన్జీ. హీరోయిన్ గా పరిచయమైన తొలి సినిమానే బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. వెంకటేశ్‌, అంజలా ఝవేరిల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు, ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ‘కావేరి’ పాత్రలో తన అందచందాలతో 90వ సం”లోని అప్పటి కుర్రకారులను ఆకర్షించి వారి కలల రాణిగా మారింది అంజలా ఝవేరి. తొలి సినిమా హిట్‌ కావడంతో ఇక చేయబోయే రెండో సినిమా గుణశేఖర్ ‘చూడాలని ఉంది..!’ లో ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవితో జతకట్టే అవకాశం దక్కింది. సినిమాలో ఎటువంటి డైలాగ్స్ లేకుండా కేవలం చిరంజీవి, ఝవేరి చూపులతో నడిచే ఆ లవ్ ట్రాక్ సన్నివేశాలు అప్పటి యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ సన్నివేశాలు ఇప్పుడు చూసిన అదే ఫీల్ కలుగుతుంది. అలా చేసిన రెండో సినిమా బంపర్‌ హిట్‌గా నిలిచింది. అలా వచ్చిన వరుస అవకాశాలతో తర్వాత బాలకృష్ణతో ‘సమరసింహా రెడ్డి’, నాగార్జున ‘రావోయి చందమామ’ వంటి సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలోని నలుగురి స్టార్ హీరోస్ తో హీరోయిన్‌గా నటించింది ఝవేరి. తర్వాత బాలకృష్ణ ‘భలేవాడివి బాసు’, వెంకటేష్ తో ‘దేవి పుత్రుడు’ సినిమాలో రెండో సారి జత కట్టి… మెగాస్టార్ ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ సినిమాలో ‘హే చైల చైల చైల చైలా’ అనే పాటలో మెరిసింది ఝవేరి. రాజశేఖర్ తో చేసిన ‘ఆప్తుడు’ హీరోయిన్ గా చివరి తెలుగు సినిమా. శేఖర్ ఖమ్ముల ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమాలో మళ్ళీ ఒకసారి మెరిసింది ఝవేరి.
తను మోడల్‌ గా ఉన్నప్పుడు తరుణ్‌ అరోరాను ప్రేమించి తర్వాత వివాహం చేసుకుంది. తరుణ్‌ అరోరా ‘ఖైదీ నెంబర్‌ 150’, ‘కాటమ రాయుడు’, ‘జయ జానకి నాయక’ ‘అర్జున్ సురవరం’ వంటి సినిమాల్లో విలన్‌ పాత్రలో నటించారు.
అంజలా ఝవేరి అందాల నాయికకు బర్త్ డే విషెస్ తెలుపుతుంది మూవీ వాల్యూం.

Leave a comment

error: Content is protected !!